Suryaa.co.in

Andhra Pradesh

మద్యంలో లక్ష కోట్లు మింగేసిన జగన్ రెడ్డి

హత్యలు, అత్యాచారాలు ఆగాలంటే జగన్ రెడ్డి పోవాలి.. చంద్రన్న రావాలి
రాష్ట్రాన్ని కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ కేంద్రంగా మార్చిన జగన రెడ్డిని తరిమికొట్టాలి
మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న హామీపై జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పాడు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణ మాణాలు హరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. మద్య నిషేధం హామీపై మాట తప్పి.. మడమ తిప్పి నాసిరకమైన మద్యం తీసుకొచ్చి లక్ష కోట్లు జేబుల్లో వేసుకున్నాడు. ఐదేళ్లలో మద్యం రేట్లు మూడు సార్లు పెంచాడు. రూ.2 లక్షల కోట్ల నాసిరకం మద్యం అమ్మి రూ.లక్ష కోట్లు తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకున్నాడు.

ఐదేళ్ల పాలనలో 35 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో ఆస్పత్రుల పాలయ్యారు. అందులో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారి భార్యల మాంగళ్యాలు తెగిపోవడానిక జగన్ రెడ్డే కారణం. మరోవైపు మద్యం మత్తులో రాష్ట్ర యువతను నాశనం చేశాడు. అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. రోడ్ల పక్కన కూరగాయల దుకాణాల్లో, పానీపూరీ బండ్ల వద్ద కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి. కానీ, జగన్ రెడ్డి మద్యం షాపుల్లో మాత్రం నగదు మాత్రమే చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు ఉందో ప్రజలు ఆలోచించాలి.

మద్యంపై ఆదాయాన్ని 15 సంవత్సరాలకు తాకట్టు పెట్టి రూ.40 వేల కోట్లు అప్పు తెచ్చాడు. మందుబాబుల్ని తాకట్టు పెట్టిన నీచమైన చరిత్ర జగన్ రెడ్డికే సాధ్యమైంది. గంజాయి డ్రగ్స్ మాఫియాను ఏపీలో విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తున్నాడు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు ఏపీలోనే పట్టుబడుతున్ని. గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యంతో అత్యాచారాలు తారాస్థాయికి చేరాయి.

మద్యం అక్రమ వ్యాపారం మొత్తం జగన్ రెడ్డి పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి ద్వారానే జరుగుతోంది. రాష్ట్రంలో మద్యం మహమ్మారికి ఈ ముగురే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో నాలుగు లక్షల బెల్టు షాపులు, మొబైల్ షాపులు పెట్టి ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు స్థానిక నాయకులు బెల్టు షాపులతో ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు తగ్గాలేంటే జగన్ రెడ్డి పోవాలి. చంద్రన్న రావాలి. మహిళల మాంగళ్యాలు నిలబడాలంటే.. చంద్రబాబు రావాలి. ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న జగన్ రెడ్డి లాంటి నియంతను రాష్ట్రం నుండి దేశం నుండి తరిమికొట్టినడపుడే అభివృద్ధి సాకారమవుతుంది.

 

LEAVE A RESPONSE