ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివపై దాడి దుర్మార్గం

– వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాది
– విలేకరులపై దాడులు, దౌర్జన్యలు నిత్యకృత్యం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయిడు

కుప్పం సీఎం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శివ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు తెగబడుతుంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పత్రికలకు, జర్నలిస్టులకు, మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయింది. సామాన్య పౌరుల నుంచి జర్నలిస్టుల వరకు ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలను బయట పెట్టడానికి వీలు లేదు.

ఆఖరికి పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. పోలీసుల ముందే వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్ధమవుతుంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అల్ల కల్లోలంగా మారింది.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలను, ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడో ప్రజలకు తెలియజేస్తున్న మీడియా మిత్రులపై దాడి జరిగిందంటే ప్రజాస్వామ్యం దెబ్బతిన్నట్లే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంతివాడిపైనైనా దాడి చేయడమే అధికారం పార్టీ అనుసరిస్తున్న మార్గం.

ఫొటోగ్రాఫర్ పై దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు పక్కనే ఉండి ఆపకపోవడం దుర్మార్గం? జగన్ రెడ్డి నువ్వు చేస్తున్న అక్రమ పాలనకు స్వస్థి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఫొటోగ్రాఫర్ శివపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

Leave a Reply