Suryaa.co.in

Andhra Pradesh

99శాతం హామీల అమలంటూ జగన్ రెడ్డి కట్టుకథలు

– ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి చర్చకువస్తే ఆయన హామీల్లోని డొల్లతనం బయటపెడతాం
• అప్పులుచేయడానికి ముఖ్యమంత్రి పదవే కావాలా? జగన్ రెడ్డి స్థానంలో దారినపోయే దానయ్య ఉన్నా, అతనికంటే గొప్పగా ప్రజలకోసం బటన్లు నొక్కేవాడు
• మద్యపాననిషేధం, సీపీఎస్ రద్దు, దళితులకు చంద్రబాబు అమలుచేసిన 27 పథకాలు ఏమయ్యాయి జగన్ రెడ్డీ?
• 45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్లు ఇస్తానన్న హామీ సంగతేంటి? ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రులకు వెళ్తే, రోగుల్ని బయటనుంచే గెంటేస్తున్నారు
• నాలుగేళ్లలో జగన్ రెడ్డి కొత్తగా అమలుచేసింది గడపగడపకు మన పోలీసులు, వైఎస్సార్ నకిలీఓట్ల పథకాలు మాత్రమే
• పంచ్ ప్రభాకర్ రెడ్డి పిచ్చికుక్కతో దళితుల్ని తిట్టిస్తున్న జగన్ రెడ్డి, వచ్చేఎన్నికల్లో దళితులసత్తా ఏంటో చూస్తాడు
– టీడీపీ అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్

నాలుగేళ్లలో 99శాతం హామీలు అమలుచేశామని ముఖ్యమంత్రి అతనిపరివారం ప్రజల్ని కట్టుకథలతో మోసగించేం దుకు సిద్ధమైందని, మంత్రలు వైసీపీఎమ్మెల్యేలు, అధికా రపార్టీ వంతపాడే ఎవరైనా సరే జగన్ రెడ్డి అమలుచేసిన హామీలపై ఎక్కడైనా, ఎప్పు డైనా బహిరంగచర్చకు రావచ్చని, ప్రజలసమక్షంలో చర్చకు తాముసిద్ధమని టీడీపీ అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తేల్చిచెప్పారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ మాట్లాడితే మాటతప్పను, మడమతిప్పను అని జగన్మోహన్ రెడ్డి సొంతడబ్బాలు కొట్టుకుంటున్నాడు. పాదయాత్ర సమయంలో ఆడబిడ్డలకు ఇచ్చిన మద్యపాననిషేధం హామీ ఏమైందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. వారంలో రద్దుచేస్తానన్న సీపీఎస్ రద్దుహామీ సంగతేమిటి? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలనెలా పింఛన్ ఇస్తానన్న ముఖ్యమంత్రి శపథం ఏమైంది?
రూ.1000 నుంచి రూ.10లక్షలవరకు పేదలఆరోగ్యంకోసం ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమేఖర్చు భరిస్తుందని చెప్పాడు. ఏపీలోనేకాకుండా పక్కరాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అమలయ్యేలా చేస్తానని బొంకిన జగన్ రెడ్డి, రాష్ట్రంలో ఇప్పుడుఎన్ని నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పేదలకు అందుతున్నాయో చెప్పాలి. పేదలు ఆరోగ్యశ్రీ కార్డుతీసుకొని ఆసుపత్రు లకు వెళితే, బయటనుంచి బయటే గెంటేస్తున్నారు.

దళితులకు సంబంధించిన 27పథకాలరద్దుతో పాటు, అన్నాక్యాంటీన్లు, పెళ్లికానుక, విదేశీవిద్య వంటిపథకాలను రద్దుచేసిన జగన్ రెడ్డి, సిగ్గులేకుండాఇచ్చిన హామీలన్ని నెరవేర్చానంటున్నాడు
భారతదేశంలో ఏనాయకుడు అమలుచేయనన్నిసంక్షేమపథకాల్ని చంద్రబాబు అమ లుచేస్తే వాటన్నింటినీ జగన్ రెడ్డి రద్దుచేశాడు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన 27 పథకాల్ని ఒక్కకలంపోటుతో పక్కనపెట్టేశాడు. దళితులంటే జగన్ రెడ్డికి ఎంత చిన్నచూపో ఆయనపాలనలోజరిగే దాడులు, దారుణాల్నిచూస్తేనే తెలుస్తోంది. చంద్ర బాబు పేదలకడుపు నింపడానికి పెట్టిన అన్నాక్యాంటీన్లు మూసేశాడు.పెళ్లికానుక పథకం రద్దుచేశాడు.

2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో పెళ్లికానుకపథకం కింద ఎక్కడా, ఎవరికీ రూపాయి ఇవ్వలేదని ప్రభుత్వమే సమాచారహక్కుచట్టంకింద అడిగి నప్రశ్నకు సమాధానంగా వాస్తవం బయటపెట్టింది. అంబేద్కీర్ విదేశీవిద్య, ఎస్సీ, ఎస్టీ కోసం చంద్రబాబుపెట్టిన స్టడీసర్కిళ్లు, ఎన్టీఆర్ ఓవర్ సీస్ పథకం వంటివి ఎక్కడ అమల్లో ఉన్నాయని జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. పాదయాత్రసమయంలో, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినహామీల్లో ఒక్కదాన్ని సక్రమంగా నెరవేర్చని జగన్ రెడ్డి సిగ్గు లేకుండా 99శాతం పూర్తిచేశానని చెప్పడం సిగ్గుచేటు.

చంద్రబాబుకి కుప్పంలో, తాడేపల్లిలో ఇల్లులేకపోవచ్చు జగన్ రెడ్డి..కానీ పేదలకోసం ఆయన లక్షలాది టిడ్కోఇళ్లు నిర్మించాడు. ఆ ఇళ్లన్నీ ఆయనవేనని తెలుసుకో
చంద్రబాబుకి కుప్పంలో, తాడేపల్లిలో ఇల్లులేకపోవచ్చుగానీ, పేదలకోసం ఆయన కట్టించిన లక్షలాది టిడ్కోఇళ్లన్నీ ఆయనవేనని జగన్ రెడ్డి తెలుసుకుంటే మంచిది. జగన్ రెడ్డిలాగా ప్రజలసొమ్ము దోచుకొని, అప్పనంగా ఊరికొక ప్యాలెస్ కట్టుకోవడం చంద్రబాబుకి చేతగాదు. ప్రతిపక్షనేతకు ఇల్లులేదంటున్న జగన్ రెడ్డి 4ఏళ్లలో పేదలకు ఎన్నిఇళ్లు కట్టించాడో చెప్పగలడా? సొంతనియోజకవర్గం పులివెందులలో బస్టాండ్ కట్ట లేని అసమర్థ ముఖ్యమంత్రి, జిల్లాకొక ఎయిర్ పోర్ట్ కడతానంటూ గాలికబుర్లు చెబుతున్నాడు. ఇలాంటి హామీలతో మరలాప్రజల్ని మోసగించి అధికారంలోకి రావాలన్నదే జగన్ రెడ్డి కుట్ర. అసలు విశ్వసనీయత అనేమాటకు అర్థం జగన్ రెడ్డికి తెలుసా?

వైఎస్సార్ జలకళ పథకంకింద రాష్ట్రవ్యాప్తంగా ఎన్నిబోర్లు వేసి, ఎన్నిఎకరాలకు నీళ్లిచ్చావో చెప్పు జగన్ రెడ్డి?
రూ.2,324కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 2లక్షలబోర్లు రైతులకోసం వేయిస్తానని, గతంలో జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు. తనసాక్షి మీడియాలో తాటికాయంత అక్షరాలతో రాయించాడు. పత్రికలకు ఇచ్చినప్రకటనల్లోని రిగ్ మిషన్లపై తనబొమ్మలుకూడా వే యించుకున్నాడు. ఆన్ లైన్లో రైతులుదరఖాస్తు చేసుకున్నవెంటనే ప్రభుత్వమే అన్ని ఖర్చులుభరించి బోర్లు వేయిస్తుందని చెప్పిన జగన్ రెడ్డి హామీ ఎక్కడ అమలైంది?

ఎన్నిబోర్లువేసి ఎన్నిఎకరాలకు నీళ్లిచ్చాడనే వివరాలను సమాచారహక్కు చట్టంకింద తామే సేకరిస్తే, ముఖ్యమంత్రి అసమర్థత, ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. వైఎస్సార్ జలకళ పథకం కింద ఎన్ని బోరుబళ్లు కొన్నారని తాము అడిగితే, పంచాయ తీ రాజ్ శాఖ ఒక్కబండికూడా కొనలేదని చెప్పింది. రాష్ట్రంలో ఈనాలుగేళ్లలో ఎన్ని బోర్లు వేశారని అడిగితే జిల్లాలవారీగా ఇప్పటి వరకు 14,185బోర్లు వేసినట్టు సమాచార హక్కుచట్టంకింద సమాచారమిచ్చారు. ఇదికూడా తప్పుడులెక్కేనని తేలింది.

బోర్లు వేస్తే వాటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. విద్యుత్ శాఖవారిని అడిగితే ఎక్కడా తాము ఎలాంటి కొత్తకనెక్షన్లు ఇవ్వలేద ని చెప్పారు. వైఎస్సార్ జలకళ పథకానికి రాష్ట్రవ్యాప్తం గా 2లక్షల దరఖాస్తులువస్తే, లక్షా80వేల దరఖాస్తుల్ని ఆమోదించినట్టుచెప్పారు. మరి ఆలెక్కప్రకారమే అయినా లక్షా80వేల బోర్లు వేయాలి. కానీ వేశామని చెబుతున్నవి కేవలం 14,185మాత్రమే. అవికూడా కాగితాలకే పరిమితమని తేలింది.

దావోస్ లో ప్రభుత్వం చేసుకున్నపారిశ్రామిక ఒప్పందాల్లో ఎన్నిసంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయో, ఎన్నిఉద్యోగాలిచ్చాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి
గతంలో దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడకూడా ఉత్తుత్తిపారిశ్రామిక ఒప్పం దాలుచేసుకొని యువతను ఉద్యోగాల పేరుతో నమ్మించే ప్రయత్నంచేశాడు. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు, ఆ సంస్థ రూ.60వేలకోట్ల పెట్టుబడి పెడుతుందని, 10వేలఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అరబిందోసంస్థ రూ.28వేలకోట్ల పెట్టుబడిపెడుతుందని, 8వేలఉద్యోగాలు వస్తాయని, గ్రీన్ కో గ్రూప్ వారు రూ.37వేల కోట్లపెట్టుబడిపెట్టి, 10వేల ఉద్యోగాలిస్తారని చెప్పారు.

అలానే ఏ.ఎస్అర్బన్ డెవలప్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 10వేల ఉద్యోగాలు ఇస్తుందన్నారు. 23 మే-2022న ఎప్పుడో అదానీసంస్థతో ఒప్పందంచేసుకొని, దాన్ని దావోస్ లో చేసుకున్నట్టుగా ముఖ్య మంత్రి, అతని ప్రభుత్వంచెప్పడం యువతను వంచించడంకాదా? ఆ సంస్థతో రెండే ళ్ల క్రితం ఒప్పందం జరిగితే ఇప్పటివరకు రూపాయిపెట్టుబడి పెట్టలేదు. అరబిందో సంస్థ కూడా అలానేచేసింది. పెట్టుబడులు, ఒప్పందాల ముసుగులో యువతను, నిరుద్యోగుల్ని ముఖ్యమంత్రి దారుణంగా వంచించాడు.

జగన్ రెడ్డి అమలుచేసిన గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమం గడపగడపకు మన పోలీసులుగా మారింది. వైఎస్సార్ నకిలీఓట్ల పథకం అమల్లో దేశంలో జగన్ రెడ్డే నంబర్ 1 గా నిలిచాడు. నాలుగేళ్లలో జగన్ రెడ్డి, అతనిమంత్రులు, ఎమ్మెల్యేలు కొల్లగొట్టిన లక్షలకోట్ల సొమ్ముతో చంద్రబాబు ప్రతిపేదకుటుంబాన్ని ధనికకుటుంబంగా మారుస్తాడు.

ప్రజలకు ఇచ్చినహామీలు గాలికివదిలేసి, చంద్రబాబు అమలుచేసిన సంక్షేమపథకా ల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి నాలుగేళ్లలో కొత్తపథకాలు అమలుచేశాడు. జీ.జీ.ఎమ్.పీ (గడపగడపకు మన ప్రభుత్వం) పథకం తెచ్చాడు. కానీ వాస్తవంలో దాని అసలు పేరు గడపగడపకు మన పోలీసులు. ప్రశ్నించేప్రతిఒక్కరిపై తప్పుడుకేసులు పెట్టడం అనేది మాత్రం చాలాచక్కగా అమలవుతోంది. అలానే వైఎస్సార్ నకిలీఓట్లపథకం అమల్లో జగన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచాడు.

దళితులపై దాడులు, మైనారిటీలపై వేధింపు లు, బీసీలపై దురాగతాలనే కొత్తపథకాల్ని కూడా చాలాసమర్థవంతంగా అమలుచేస్తు న్నాడు. తాడపత్రిలో ఒక దళిత సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రభుత్వవేధింపులతో ఆత్మహత్య చేసుకోవడంపై ముఖ్యమంత్రి ఏంచెబుతాడు? బాపట్ల జిల్లాలో చిన్నారిబిడ్డను సజీవద హనంచేస్తే ప్రభుత్వంలో స్పందనలేదు. పంచ్ ప్రభాకర్ రెడ్డి అనే జగన్ రెడ్డి పెంపుడు కుక్క దళితుల్ని దారుణంగా తిడుతుంటే, జగన్ రెడ్డి నోరెత్తడు. దళితుల్ని అడ్డమైన వాళ్లతో తిట్టిస్తూ ఆనందిస్తున్న జగన్ రెడ్డికి వచ్చేఎన్నికల్లో దళితులసత్తా ఏంటో తెలుస్తుంది.

అప్పులుచేయడానికి ముఖ్యమంత్రి పదవే కావాలా? జగన్ రెడ్డి స్థానంలో దారినపోయే దానయ్యఉన్నా ఇతనికంటే గొప్పగా ప్రజలకోసం బటన్లునొక్కేవాడు. టీడీపీఅధినేత చంద్రబాబు ప్రకటించిన మినీమేనిఫెస్టోపై ఇప్పటికే జగన్ రెడ్డికి భయంపట్టుకుంది. చంద్రబాబు ఎలా పథకాలు అమలుచేస్తాడని ప్రశ్నిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటివాళ్లంతా జగన్ ప్రభుత్వంలో జరిగిన దోపిడీసొమ్ముతోనే ప్రజలకు మేలుచేయవచ్చని తెలుసుకుంటే మంచిది.

సలహాదారులకు జగన్ రెడ్డి తగలేస్తున్న వేలకోట్లతో మహిళాశక్తి పథకం అమలుచేస్తాం. పార్టీరంగులకోసం జగన్ రెడ్డి దుబారాచేసిన వందలకోట్లతో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. ఇసుక, మద్యం దోపిడీతో ప్రజలనుంచి కొట్టేసిన లక్షకోట్లతో రాష్ట్రంలో ప్రతికుటుంబాన్ని ధనవంతుల్ని చేస్తాం. ఇలా ఏ పథకం ఎలా అమలుచేయాలో మాకు, మా నాయకుడి కి బాగాతెలుసు. మా పథకాల గురించి ఆలోచించి జగన్ రెడ్డి, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు వారి బుద్ధిలేని బుర్రల్ని పాడుచేసుకోవద్దు” అని సప్తగిరి ప్రసాద్ ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE