Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ జనగణన చేయకుండా బీసీలకు తీరని ద్రోహం

పులివెందుల కూడా టీడీపీదే
జగన్ సభలకు జనం కరవు – గేట్లు దూకి పారిపోతున్నారు
– శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు

సామాజిక న్యాయానికి దోహదపడే బీసీ జనగణనను దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలే చేపడుతుంటుంటే.. జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ జనగణన చేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తోంది. బీసీలు ఎంతమంది ఉన్నారు..? వారి ఆర్థిక స్థితిగతులేంటి..? దారిద్ర్యరేఖ దిగువన ఉండడానికి గల కారణాలు ఏంటి? సంచార జాతులుగా ఎంతం మంది ఉన్నారు? వారి ఆర్థిక పరిస్థితివంటి సమాచారం బీసీ జనగణన ద్వారానే వస్తోంది. ఈ సమాచారం లేకుండా జగన్ రెడ్డి ఏ విధంగా పాలన సాగిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేయవచ్చని పట్నా హైకోర్టు కూడా చెప్పింది, బీహార ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది. జగన్ మాత్రం ఎందుకు మౌనంగా వున్నారు? బీసీ జనగణనను జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. బీసీలంటే జగన్ రెడ్డికి ఎందుకు అంత కక్ష?. బీసీల విషయంలో లెక్కలేనితనం చూపుతున్నజగన్ రెడ్డికి త్వరలో బీసీలే బుద్ధి చెబుతారు. వెంటనే బీసీ జనగణనను మొదలు పెట్టాలి.

టీడీపీ హయాంలో చట్ట సభల్లో రిజర్వేషన్లు, బీసీ జనగణన వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తే వాటిని ఆమోదించుకునేందుకు కూడా జగన్ రెడ్డి దృష్టిపెట్టకపోవడం దుర్మార్గం. అప్పులపై ఉన్న శ్రద్ధ బీసీల సంక్షేమంపై లేదు.

వైసీపీ నుంచి గెలిచిన 151 మందిలో 140 మంది అవినీతి తిమింగళాలే అనే విషయం ఏడీఆర్ నివేదిక ద్వారా బట్టబయలైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్నారు. దేశంలో అత్యధిక ధనిక ఎమ్మెల్యేల జాబితా చూస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలే మొదటి స్థానంలో ఉన్నారు. అయినకాడికి దోచుకుని రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు. నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలతో వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారు.

ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లపై దృష్టిపెట్టిన విధంగానే వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై దృష్టి పెట్టాలి. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా కాపాడాలి. డబ్బు ప్రభావం లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. అత్యంత అణగారిన వర్గం చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది.

పులివెందుల కూడా తెలుగుదేశం పార్టీదే అనే విషయం నిన్న చంద్రబాబు నాయుడుగారి బహిరంగసభ ద్వారా బట్టబయలు అయింది. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత ఊరిలో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టడం జగన్ పై ఉన్న వ్యతిరేకతకు అద్దంపడుతోంది. జగన్ రెడ్డి సభలకు బలవంతంగా ప్రజలను తరలించిన రావట్లేదు.. కానీ చంద్రబాబు నాయుడుగారి సభలకు స్వచ్ఛందంగా ప్రజలు హాజరై మద్దతు తెలుపుతున్నారు. పేదల సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజా సంపదను పెత్తందారులకు దోచిపెట్టడం ద్వారే జగన్ సభలకు జనం కరువైనారు. బాదుడే బాధుడుతో తాడేపల్లి ప్యాలెస్ నింపుకునేందుకు ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారు. సీఎం జ‌గ‌న్ ప్రసంగిస్తున్న స‌మయంలోనే స‌భ‌కు హాజ‌రైన వారు మ‌ధ్యలోనే లేచి వెళ్లిపోవటం దేనికి సంకేతం

 

LEAVE A RESPONSE