దళిత ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు పట్ల జగన్ రెడ్డి వేధింపులు దుర్మార్గం

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత నేత కొలికపూడి శ్రీనివాసరావును సీఐడీ పేరుతో జగన్ రెడ్డి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాసమస్యలపై స్పందిస్తున్న దళిత ఉద్యమ నేతపై వేధింపులకు పాల్పడటం జగన్ రెడ్డి దమనకాండకు నిదర్శనం. ప్రజల గొంతులను అణిచివేసే కుట్రలకు పాల్పడుతున్నారు. నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ లోని కొలికపూడి శ్రీనివాసరావు నివాసానికి వెళ్లిన సీఐడీ.. ఆయన కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు.

11 ఏళ్ల పాపకు నోటీసులిస్తామని బెదిరించడం అమానవీయం. నియంతలు పాలిస్తున్న దేశాల్లో కూడా ఇంతటి క్రూరత్వం లేదు. కొలికపూడి నివాసానికి విజిటర్స్ గా వచ్చిన సీఐడీ నానా భీభత్సం సృష్టించారు. కొలికపూడి చేసిన తప్పేంటి? ప్రజాసమస్యలు, జగన్ రెడ్డి అవినీతి, అరాచకాన్ని ప్రశ్నించడమే నేరమా? చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? ప్రశ్నించేవారిని చూసి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. మరో వందరోజుల్లో జగన్ రెడ్డిని ప్రజలు తరిమివేయడం ఖాయం.

Leave a Reply