• పవర్ పర్చేజ్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకోవడానికే ముఖ్యమంత్రి కొత్త నాటకం
• రాజశేఖర్ రెడ్డి 6,200ఎకరాల్లో పోర్టు నిర్మిస్తామంటే, జగన్ రెడ్డి నేడుదాన్ని 1800ఎకరాలకే పరిమితం చేయడం ఎవర్ని మోసగించడానికి?
• జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో పూర్తిచేస్తానంటుంది పోర్టునా..లేక ఫిషింగ్ హార్బర్ నా?
• పోర్టు నిర్మాణాన్ని తాకట్టుపెట్టి పదవులుపొందిన పేర్నినాని ఎన్నాళ్లు ప్రజల్నిమోసగిస్తాడు?
టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర
జగన్మోహన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి బందర్ పోర్ట్ నిర్మాణానికి శంఖుస్థాపనచేశారని, గతంలో అదేపోర్టు నిర్మాణాన్ని తప్పుపట్టిన వ్యక్తి, నేడు దాన్నినిర్మిస్తున్నానంటూ కొత్త నాటకానికి తెరలేపాడని, దివంగత రాజశేఖర్ రెడ్డి 2006లో బందర్ పోర్టుని అమ్మేయడానికి సిద్ధ పడి సంతకాలు చేశారని, దానిపై తాము ఆనాడుఉద్యమించడంతో, ఆయన దిగివచ్చారని, నాటినుంచి బందర్ పోర్టుకి శంఖుస్థాపనలు జరుగుతూనే ఉన్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. మంగళగిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
“రాజశేఖర్ రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హాయాంలో మరలా బందర్ పోర్ట్ నిర్మాణానికి ఉద్యమించడం జరిగింది. 2012లో దాదాపు 500రోజులు బందర్ పోర్టు కోసం ప్రజలు ఉద్య మించారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నపేర్నినాని ఒంటెలపై ఎక్కి ఊరేగుతూ, బందర్ పోర్టు నిర్మించకపోతే, ముక్కునేలకు రాస్తానని, రాజకీయసన్యాసం తీసుకుంటానని ప్రగల్భా లు పలికాడు.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో టెండర్ దక్కించుకున్న నవయుగసంస్థనే కొనసాగిస్తూ, డీపీఆర్ మొత్తం తయారుచేయించి, ఎన్విరాన్ మెంట్ విభాగం అనుమతులు సాధించారు. దాదాపు 23బెర్తులతో గ్రీన్ ఫీల్డ్ పోర్టు ని నిర్మించాలని భావించారు. పోర్టు నిర్మాణంకోసం రైతులనుంచి భూములు సేకరించారు. ఎకరాకు కిరణ్ కుమార్ రెడ్డి రూ.9లక్షలు ఇస్తానంటే, చంద్రబాబుగారు ఎకరాకు రూ.25లక్ష లిచ్చి భూములుసేకరించారు. బీ.వో.టీ (బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో రాష్ట్రప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చులేకుండా పోర్టు నిర్మాణపనులు ప్రారంభించారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులతోపాటు, బందర్ పోర్ట్ నిర్మాణపనులు సమాంతరంగా జరిగేలాచేశారు. జగన్ రెడ్డి వచ్చాక బీ.వో.టీ విధానంరద్దుచేసి, బందర్ పోర్టు నిర్మాణపనులు నిలిపివేయించాడు. తాము ఉద్యమాలుచేసి సాధించుకున్న పోర్టు నిర్మాణపనుల్ని పూర్తిగా విస్మరించాడు.
పవర్ పర్చేజ్ కార్పొరేషన్ నుంచి రుణంతీసుకోవడానికి, కమీషన్లకోసమే జగన్ రెడ్డి నేడు బందర్ పోర్ట్ నిర్మాణానికి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశాడు
బందర్ పోర్టు నిర్మాణానికి ఎంత అవసరమైతే అంతేభూమి తీసుకుంటుందని టీడీపీప్ర భుత్వం చెబితే, దానిపై ప్రజల్లోవిషబీజాలునాటి, చంద్రబాబు ఎక్కువభూమి తీసుకున్నా డని దుష్ప్రచారంచేశారు. నేడు జగన్ రెడ్డి 1800ఎకరాల్లో కడతాను అంటున్న పోర్ట్ మైనర్ పోర్టు మాత్రమే. దానివల్ల రాష్ట్రానికి ఎలాంటిఉపయోగం ఉండదు. ఫిషింగ్ హార్బర్ కుఎక్కువ..పోర్టు కి తక్కువా అయిన పోర్టుతో ఎలాంటిఉపయోగం ఉంటుందో ముఖ్యమం త్రే చెప్పాలి. పాతడీ.పీ.ఆర్ మార్పించి, కొత్త డీ.పీ.ఆర్ తయారు చేయించారు. పవర్ పర్చేజ్ కార్పొరేషన్ నుంచి రుణంతీసుకోవడానికే జగన్ రెడ్డి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశాడు తప్ప, నిజంగా పోర్టు నిర్మించ డానికి కాదు. రాష్ట్రంలోని పోర్టులను, వాటికిసంబంధించిన కార్పొరేష న్లను మారిటైమ్ బోర్డ్ కింద పెట్టారు. దానికో గోల్ మాల్ వ్యక్తిని ఛైర్మన్ గా నియమించారు. కేవలం కమీషన్లకోసమే నేడు జగన్ బందర్ పోర్టు జపంమొదలెట్టాడు. రెడ్డొచ్చి మొదలాయే అన్నట్టుగా రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ రెడ్డి బందర్ పోర్ట్ నిర్మాణానికి శంఖు స్థాపనచేశారు. గతంలో జగన్ రెడ్డి మైటాస్ సంస్థను బ్లాక్ మెయిల్ చేసి, రూ.400 కోట్లు కొట్టేశాడు. పేర్నినాని పదవులకోసం కక్కుర్తిపడి బందర్ పోర్ట్ ని తనస్వార్థానికి వాడుకుంది నిజంకాదా? విప్ పదవికోసం బందర్ పోర్టుని అమ్మేసింది నిజంకాదా? ఇలాంటి దొంగలంతా పోర్టు కడతారా? డీ.పీ.ఆర్ బయటపెడితే ప్రజలకు పోర్టునిర్మాణంలోని వాస్తవాలు తెలుస్తా యి. పోర్టులోకి నౌక రావాలంటే ఎంతలోతు డ్రెడ్జింగ్ చేయాలి. తక్కువలో తక్కువగా 15, 16 మీటర్ల లోతుతవ్వాలి. ఒక మీటర్ కి 800మీటర్ల డ్రెడ్జింగ్ చేయాలి. గతంలో బ్రేక్ వాటర్ కింద విస్తీర్ణం 2.5కిలోమీటర్లు ఉంటే, నేడుదాన్ని కేవలం 1.05కిలోమీటర్లకే పరిమితంచేశారు. దానిలోకి పెద్దపెద్ద నౌకలువస్తాయా? అట్టబొమ్మలు తీసుకొచ్చి పెడతారా జగన్ రెడ్డి గారు?
పోర్టునిర్మాణంలో అనుభవంలేని సంస్థకు పనులు అప్పగించడం పోర్టు పూర్తిచేయడానికేనా?
నిర్మాణపనుల్ని అప్పగించిన మెగాసంస్థకు పోర్టులునిర్మించిన అనుభవంలేదు. కేవలం కమీషన్లకోసమే ముఖ్యమంత్రి బందర్ పోర్టు జపంమొదలెట్టారు. రాజశేఖర్ రెడ్డిహాయాంలో 6,220 ఎకరాల్లో నిర్మిస్తామంటే, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాక 5,400ఎకరాల్లో అన్నారు. అంత విస్తీర్ణం ఇప్పుడు జగన్ వచ్చాక కేవలం1800ఎకరాలకేపరిమితం కావడం ఏమిటి? భావన పాడు, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్ని ప్రజలఆకాంక్షలకు అనుగుణంగా నిర్మించేది టీడీపీ ప్రభుత్వమే. అందులో ఎలాంటి సందేహంలేదని స్పష్టంచేస్తున్నాం. ఫిషింగ్ హార్బర్లు కట్టి మత్స్యకారుల్ని ఉద్ధరించానన్నట్టు జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. పడవలు, వలలు, డీజిల్ రాయితీ, కోల్డ్ స్టోరేజ్ లు లేకుండా మత్స్యకారులు ఎలా బాగుపడతారో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. తాను నిర్మిస్తాను అంటున్న ఫిషింగ్ హర్బర్లతో ఎందరు మత్స్యకారులు జీవితాలు బాగుపడతాయో జగన్ చెప్పాలి. డీజిల్ ధర ఎంతఉంటే, జగన్ ఎంతరాయితీ ఇస్తు న్నాడు?
పేదలకు ఇచ్చే ఇంటిపట్టాలు, ఇంటిస్థలాలు ఎందుకుపనికిరావని సుప్రీంకోర్టు చెప్పలేదా?
సెంటు రూ.5లక్షలవిలువైన పేదలకుఎక్కడ ఎన్నిసెంట్లఇళ్లస్థలాలు ఇచ్చాడో జగన్ రెడ్డి సమాధానంచెప్పాలి. శ్మశానాలపక్కన, ముంపుప్రాంతాల్లో పేదలకు ఇచ్చిన సెంటుస్థలం రూ.5లక్షల విలువచేస్తుందా? రాజధానిలోసెంటు రూ.5లక్షలుంటే, రాష్ట్రమంతా అదేధర ఉం టుందా? ఎక్కడోఉన్నపేదలకు రాజధానిలో ఇళ్లపట్టాలిస్తానంటున్న జగన్ రెడ్డికి అదేప్రాంతం లోని పేదలు ఎందుకు కనిపించరు? ఎక్కడో 15, 20కిలోమీటర్ల దూరంలోఉండేవారికి రాజధా నిలో సెంటుపట్టాలిస్తే, వారు అక్కడ ఎలానివాసముంటారు? ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేనిచోటనివాసముండి వారి జీవనంఎలాకొనసాగించాలి? చంద్రబాబుగారు సౌకర్యాలు కల్పించకుండా పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలు ఎందుకు పనికొస్తాయంటే, దానిలో తప్పేముంది ?
చంద్రబాబు కట్టించిన జీప్లస్ 3 భవనాలు పేదలకు ఎందుకు ఇవ్వడంలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. 4ఏళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కట్టకుండా, చంద్రబాబు కట్టించిన ఇళ్లు వారి కిఇవ్వకుండా జగన్ రెడ్డి సెంటుస్థలంలో ఇళ్టుకట్టుకోవడం ఎలాసాధ్యమో సమాధానంచెప్పా లి. జగన్ రెడ్డి ఇళ్లస్థలాలు, సెంటుపట్టాలపేరుతో ప్రజల్ని మోసగిస్తున్నాడు. చేతివృత్తులు, కులవృత్తులవారి జీవితాల్ని 4ఏళ్లలో నిర్వీర్యంచేశాడు. స్వర్ణకారులకు విద్యుత్ రాయితీ ఇవ్వాలన్న ప్రతిపాదన టీడీపీప్రభుత్వంలో పెట్టిందే. తీరప్రాంతంలోని భూములన్నీ ఎస్.ఈ. జెడ్ కింద ఉంటే, వాటిని తిరిగిరైతులకు ఎలాఇస్తారో ముఖ్యమంత్రి చెప్పాలి. నాటకాలు, కల్లబొల్లి మాటలుకాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలకు దగ్గరగా జగన్ రెడ్డి మాట్లాడాలి.” అని రవీంద్ర సూచించారు.