Suryaa.co.in

Andhra Pradesh

అధికారం పోయాకైనా ఆడవాళ్లను అవమానించడం మానుకో జగన్

– పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు దాసరి ఉదయ శ్రీ

పల్నాడు: మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటూ గడిచిన ఐదేళ్లూ ప్రచారార్భాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో మహిళను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నాడు.
జగన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి సాక్షి పత్రికకు చైర్ పర్సన్ గా ఉండి సాటి మహిళలను అవమానించడం సిగ్గుచేటు.

జత్వానీ కేసులో తాడేపల్లి ప్యాలెస్ లోనే స్ట్రిప్ట్ రాసింది వాస్తవం కాదా? అంత పెద్ద సార్ చెప్పారని ఎఫ్ ఐఆర్ నమోదైన గంటలోనే జత్వానీని అరెస్ట్ చేయడానికి ముంబై ఫ్లైట్ ఎక్కానని సస్పెండైన విశాన్ గున్నీ లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణపై ఏం చెబుతావ్ జగన్ రెడ్డీ?

జత్వానీని అరెస్ట్ చేయడానికి వెళ్లేందుకు కనీసం డీజీపీ అనుమతి కూడా తీసుకోకుండా ముంబై వెళ్లడం దేనికి సంకేతం?జత్వానీ ఆమె తప్పు చేసినట్టు ఆధారాలు లేవు. అయినప్పటికీ కేసు పెట్టడానికి ముందే ముంబై టికెటక్టు బుక్ చేసుకున్నది వాస్తవం కాదా?

పారిశ్రామిక వేత్తను కాపాడేందుకు ఆమెపై ఏపీలో కేసు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడింది జగన్ రెడ్డీ కదా? గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు నిత్యం మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉండేవి అధికారం పోయాకైనా సరే ఆడ వాళ్లను అవమానించడం మానుకో జగన్ రెడ్డి.

LEAVE A RESPONSE