Suryaa.co.in

Andhra Pradesh

అధికారులకు జగన్ ‘రెడ్డి’కార్పెట్!

-ఐఏఎస్‌లు కాకపోయినా ఐఏఎస్ అంత బిల్డప్పులు
-డెప్యుటేషన్‌లో రెడ్లకే జగన్ అందలం
-వారితోనే కావలసిన పనులు
-వారిని తొలగించాల్సిందే
-ఈసీకి ఫిర్యాదు చేస్తాం
-డెప్యుటేషన్‌ పై వచ్చి జగన్ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులు
-టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్

మంగళగిరి:ఎన్నికలు దగ్గరపడే కొద్ది మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం అధికారులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా డిప్యూటేషన్ పై కేంద్రం నుంచి వచ్చిన కొంతమంది ఐఆర్‌టీఎస్, డిఫెన్స్ లాంటి సంస్థలకు చెందిన కొంతమంది అధికారులు సివిల్ సర్వీస్ డిప్యూటేషన్ ద్వారా రాష్ట్రానికి వచ్చారు. వీరిలో అధిక శాతం రెడ్డి సామాజికవర్గంవారే.

వీరితోపాటు ఇతర కులాల వారు ఉన్నారు. వీరిలో అధికశాతం మంది గత 5 సంవత్సరాలుగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తు వస్తున్నారు. వీరంతా ఏ విధంగా చేస్తే వైసీపీ ప్రభుత్వానికి ఉపయోగం కలుగుతుందని ఆలోచించేవారే. ఇప్పుడు ఈ డిప్యూటేషన్ పై వచ్చినవారు ప్రభుత్వాధినేతలు చెప్పినట్లే చేస్తున్నారు. వీరు వైసీపీ నాయకులు చెప్పినదానికల్లా తలూపుతూ, చెప్పిందల్లా చేస్తూ వైసీపీకి పూర్తిస్థాయి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

వాసుదేవరెడ్డిని బదిలీ చేసినట్లుగా ఇతర డిప్యుటేషన్ శాఖ అధికారులను బదిలీ చేయాలి
ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుండి ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేసింది. మిగిలినశాఖల్లో డిప్యూటేషన్ పై వచ్చి పనిచేస్తున్న వారిని కూడా బదిలీ విషయమై ఈసీ పరిశీలించాలని టీడీపీ కోరుతోంది. ఎందుకంటే వాళ్లు ఆయా కార్పొరేషన్లలో నిర్ణయాత్మక పదవుల్లో ఉంటే ఎన్నికలు సజావుగా సాగవు.

రాష్ట్రంలోని కీలకమైన శాఖలన్నీ డిప్యూటేషన్ పై వచ్చినవారి వద్దే ఉన్నాయి. వైన్, మైన్, ల్యాండ్, శాండ్, అడ్వర్ టైజ్ మెంట్, ఫైనాన్స్, రెవెన్యూ ఇంటలిజెన్స్, ఇలా కీలకమైన రాబడి వచ్చే శాఖలన్నీ డిప్యుటేషన్ పై వచ్చిన వారి వద్దనే ఉన్నాయి. ఈ శాఖలను రాష్ట్రంలోని ఐఏఎస్ కేడర్ లకు ఇవ్వకుండా ఐఏఎస్ కానివారికి కట్టబెట్టారు. డెప్యూటేషన్ మీద వచ్చిన ఎవరూ ఐఏఎస్ లు కాదు. ఐఏఎస్, ఐఆర్ఎస్ స్థాయి వారు కాకపోయినా తత్సమాన హోదా అని చెప్పి వారిని రాష్ట్రంలో కీలక శాఖల్లో నియమించారు. వైసీపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోని కొందర్ని ఏరి కోరి ఈ రాష్ట్రానికి తెచ్చుకున్నారు.

ఐఏఎస్ లు కాకపోయినా ఐఏఎస్‌లుగా వ్యవహరిస్తున్నారు
ఈ కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ ఎస్ లతోపాటుగా ఇతర తరగతుల ఉద్యోగాలైన డిఫెన్స్, ఐఆర్టీఎస్, పర్సనల్ తదితర శాఖలు ఉంటాయి. వీరిని కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఎంపికలు జరుగుతాయి. వీరు ఐఏఎస్ లు కాకపోయినా తత్సమాన సర్వీసులు అని చెప్పబడింది. వీరిని ఐదు సంవత్సరాల వరకు డిప్యూటేషన్ పై తెచ్చుకోవచ్చని చట్టంలో ఉన్న సౌలభ్యాన్ని వైసీపీ పూర్తిగా వాడుకుంది.

ఐఏఎస్ షార్టేజీలు ఎక్కువగా లేనప్పటికి డైరెక్టు ఐఏఎస్ లు అయితే తమ మాట వినరనే భావనతో వివిధ రాష్ట్రాలలోని తమ వారిని ఏరి కోరి మన రాష్ట్రానికి తెచ్చి పెట్టుకున్నారు. సాధారణ ప్రజలు ఎప్పుడూ పెద్దగా వినని సర్వీసుల నుంచే ఈ డిప్యూటేషన్ కింద వచ్చినవారిలో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దల్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ చాలా కాలం కీలక పదవుల్లో తిష్ట వేస్తూ 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో పాతుకుపోయారు.

ప్రభుత్వంలో ఏది చేయకూడదో అవన్నీ చేస్తూ ప్రభుత్వానికి సహాయం చేస్తూ వస్తున్నారు. ఐఎఎస్ లు అనుభవించాల్సినవన్నీ వీరు ఐఏఎస్ లు కాకుండానే అనుభవిస్తున్నారు. వీరికి బాధ్యతలేమీ ఉండవు. హక్కులు మాత్రం అనుభవిస్తుంటారు.

పదవుల్లో వున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే… రాబోయే ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకొంటుందనే భయం కూడా లేదు.ప్రభుత్వం మారితే మనం తిరిగి తమ కేంద్ర మాతృ సంస్థకు వెళ్లిపోవచ్చనే ధైర్యం వీరికి. రెండు మూడు డిప్యుటేషన్ కేసులు నిజమైనవి కావచ్చు.

స్వంత రాష్ట్రంలో కొన్నేళ్ళు పని చేయాలి అనే కోరిక మీద ఉండచ్చు. కానీ అందరూ అలా కాదు. మొత్తం 18 మంది డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళలో, 10 మంది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినోళ్లే ప్రభుత్వాధినేతలు చెప్పిన పని చేసేస్తూ తమకు డెప్యుటేషన్ ఇచ్చినందుకు లాయల్టీ ప్రదర్శిస్తుంటారు.

ఒక ఏడెనిమిది డెప్యుటేషన్ మీద వచ్చినోళ్ళను వారి పని తీరును పరిశీలిస్తే, వారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చెయ్యమని తెలుగుదేశం పార్టీ అడుగుతోందో అర్ధం అవుతుంది.

1.ఎస్. రమణారెడ్డి: AP NREDCAP లో ఉండేవారు. సోలార్ పీపీఏల రద్దు వంటి కక్ష సాధింపు చర్యలకు ఈ అధికారి సహకారం ఇందిస్తూ వచ్చారు. వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలకు దశాబ్దాల పాటు చెల్లుబాటు అయ్యేలా ఒప్పందాలు చేశారు. అరబిందో, ఇండోసోల్ సంస్థలకు లక్ష ఎకరాలకు పైగా సోలార్ ఒప్పందాల కింద కట్టబెట్టారు.

2. ఏవీ ధర్మారెడ్డి: ఈయన డిఫెన్స్ స్టేట్ ఎస్టేట్స్ లో పనిచేశారు. ఈయన గత 18 ఏళ్ల లో రాష్ట్రంలో డిప్యూటేషన్ మీద 9 ఏళ్లుగా ఉన్నారు. వచ్చే నెల 14న రిటైర్ అవుతున్న ఈయన కోసం సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే , కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఈయన మూడవసారి సర్వీస్ ఎక్స్ టెన్షన్ కోసం ఉత్తరం రాశారు. 2023 సెప్టెంబర్ లో కరుణాకర్ రెడ్డి ఛైర్మన్ కాగానే రూ.1233 కోట్ల కాంట్రాక్టును కేటాయించారు. దేవుడి డబ్బులను లడ్డూలు పంచినట్లు పంచారు. భక్తుల డబ్బుకు జవాబుదారిగా ఉండాల్సిన ధర్మారెడ్డి , బోర్డు ఛైర్మన్ తో కలిసిపోయి బడ్జెట్ తో సంబంధం లేకుండా వందల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చేశారు.

3. D. వాసుదేవ రెడ్డి : IRTS (EC ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసేసింది) మద్యం ద్వారా ఈ అయిదేళ్ళలో లక్షా ముప్పై వేల కోట్లు ప్రభుత్వము సంపాదించింది అంటే, దానికి కారణం వాసుదేవరెడ్డి గారే…నాసిరకం మద్యం తయారీ, సరఫరా… డిష్టిలరీస్ వి బలవంతంగా లీజ్ కు తీసుకోవడం డిజిటల్ కరెన్సీ ని అనుమతించక పోవడం. వైసీపీ నాయకులు సిఫారసు చేసిన బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం, అక్రమంగా ప్రతిపక్ష నేతలపై మద్యం కేసులు బనాయించడం లాంటివి ఈయన హయాంలోనే జరిగాయి. నాసిరకం మద్యంతో దాదాపు 3 వేల మంది మరణానికి పరోక్షంగా కారణమయ్యారు. జగన్ కు ఈయన ద్వారా లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్నది వాస్తవం.

4. V. G. వెంకట రెడ్డి : కోస్ట్ గార్డ్ సర్వీసెస్ నుంచి వచ్చారు. AMPDC-VC & MD గా పనిచేస్తున్నారు. అక్రమ మైనింగ్ లో వైకాపా వారికి సహకారం అందించారు. 40 వేల కోట్ల ఇసుక కుంభకోణానికి పూర్తి సహకారం అందించారు. గ్రానైట్ వ్యాపారాలపై కేసులు, APMDC ద్వారా బాండ్లు జారీ చేయించి, 7 వేల కోట్లు ప్రభుత్వానికి బదిలీ మే మాసంలో రెండో విడతలో ఇంకొక 7 వేల కోట్లు ప్రభుత్వానికి బదిలీకి ప్రయత్నం ఇవన్నీ ఈయన హయాంలోనే జరిగాయి.

5. మధుసూధన రెడ్డి: రైల్వే అకౌంట్ సర్వీస్ నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్ మీద వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో ఫైబర్ నెట్ వి పూర్తిగా నిర్వీర్యం చేశారు. అసత్య ఆరోపణలతో ప్రతిపక్ష నేత పై కేసు పెట్టడం జరిగింది. భారీగా చార్జీలు పెంచి ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేశారు. వ్యూహం లాంటి రాం గోపాల్ వర్మ సినిమాలను సైతం రాజకీయానికి వాడుకొని ఫైబర్ నెట్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది.

6. చిలకల రాజేశ్వర్ రెడ్డి: IRS మంచి deputation మీద ఉన్నారు. ఈయన ప్రతిపక్ష నాయకుల వ్యాపారాల పై డేగ కన్ను వేసి వారిని వేధింపులకు గురి చేశారు. ఆడిటింగ్ సంస్థల పై వేధింపులకు పాల్పడ్డారు. మార్గదర్శి సంస్థపై కూడా వేధింపులు మానలేదు. బ్రహ్మయ్య & CO సంస్థపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం విదితమే.

7. తుమ్మా విజయ కుమార్ రెడ్డి: ఐఐఎస్ అధికారి. ఈయన 2020లో డెప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. సాక్షి పత్రికకు వేల కోట్లు ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. సాక్షి ఉద్యోగులకి ప్రభుత్వము ద్వారా వేతనాలు చెల్లించారు.

8. CS దివాన్ రెడ్డి: ఈయన వైసీపీ నేతలకు తొత్తుగా మారి నాడు నేడు కింద జరిగిన పెద్ద ఎత్తున అవినీతిని అడ్డుకోలేదు. ఈయన హయాంలో YCP కాంట్రాక్టర్లు కోట్లను కొల్లగొట్టారు. అయినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

9. రవి శంకర్ నారాయణ్: డైరెక్టర్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి డిప్యుటేషన్ పై వచ్చిన ఈయన తెలుగుదేశం నాయకుల ఇళ్ళపై, ఆఫీసులపై దాడులు చేస్తూ ఇబ్బంది పెట్టారు. కుట్ర పూరితంగా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు.

10. కెవివి సత్యనారాయణ : సీఎఫ్ఎంఎస్ సిస్టంని పూర్తిగా నిలుపుదల చేశారు. ఫీఫో మొదటి వచ్చిన వారికి మొదట అనే చెల్లింపులపద్ధతి ని ఆపేశారు. చెల్లింపుల సిస్టం ని తన చేతుల్లోకి తీసుకొని వైసీపీ కాంట్రాక్టర్లకు మొదటగా చెల్లింపులు చేశారు. ఆర్ధిక వ్యవస్థని మొత్తం అస్తవ్యస్తం చేసేశారు.

వైకాపా పార్టీ మనోళ్ళు ఎక్కడున్నారో చూసుకొని వారిని డెప్యుటేషన్ మీద మన రాష్ట్రానికి తీసుకొచ్చింది. తమ వాళ్ళని డెప్యుటేషన్ కింద తెచ్చి పెట్టుకొని వాళ్ళ ద్వారా తమకు కావాల్సిన పనులు చేయించుకొంటూ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలని గుప్పిట్లో పెట్టుకొన్నారు. వీరిలో మెజారిటీ వ్యక్తులు అనేక సంవత్సరాల కాలం పూర్తయింది కావున వీరిని ట్రాన్స్ఫర్ చెయ్యాల్సిన అవసరం వుంది. వీళ్ళని పర్యవేక్షణ చెయ్యాల్సిన చీఫ్ సెక్రటరీ ప్రభుత్వానికి టన్నుల కొద్దీ లాయల్టీ ని కుమ్మరిస్తూ జగన్ సేవలో తరిస్తున్నారు.

APBCL MD వాసుదేవ రెడ్డి ని బదిలీ చేసిన విధంగానే రమణా రెడ్డి, ధర్మా రెడ్డి, వెంకట రెడ్డి, మధుసూధనా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, విజయ కుమార్ రెడ్డి తదితరులని బదిలీ చేయాలని, ఇప్పటికే టీడీపీ తరపున డిమాండ్ చేశాము. రేపు EC ని కలిసి ఈ మేరకు వీరిని వెంటనే బదిలీలు చేయాలని కోరతాము.

LEAVE A RESPONSE