Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంలో ఎన్నికల నిబంధనలకు పాతర

-ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కుతున్న వైసీపీ నేతలు
-సహకరిస్తున్న అధికారులు
-నామినేషన్ వేయడానికి కుప్పంలో రెండు కార్లతో ఆర్వో కార్యాలయంలోకి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్ భార్యకు గేట్లు తీసి స్వాగతం పలికిన పోలీసులు
-100 మీటర్ల ముందే ఆగి కారు దిగి వచ్చి చంద్రబాబు నామినేషన్ వేసిన భువనేశ్వరి
-ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై కలెక్టర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
-టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

ఏపీలో ఎన్నికల నిబంధనలు, ఎన్నికల కోడ్ ను వైసీపీ రౌడీ మూఖలు లెక్కచేయడంలేదని.. ప్రజా స్వామ్యాన్ని వైసీపీ నేతలు గౌరవించడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు.. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

వైసీపీ నేతలు ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కినా దానికి అధికారులు వంత పాడుతున్నారన్నారు. దానికి ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యం కుప్పం ఘటన. ఎన్నికల నిబంధన ప్రకారం వంద మీటర్ల ముందు దిగి వచ్చి , కేవలం ఐదుగురు మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వెళ్లి నామినేషన్ వేసే అనుమతి ఉంది. నేడు కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ భార్య దుర్గ , తన భర్త నామినేషన్ వేయడానికి రెండు కార్లలో నేరుగా ఆర్వో కార్యాలయంలోకి వెళ్లడం. వారికి సలాంలు కొట్టి పోలీసులు తలుపులు తీయడం విడ్డూరంగా ఉంది.

ఇటీవల నారా భువనేశ్వరి చంద్రబాబు నామినేషన్ ను 100 మీటర్ల ముందు ఆగి కారు దిగి లోపలికి వెళ్లి నామినేషన్ వేశారు. భరత్ భార్య ఏమైనా భువనేశ్వరి మేడమ్ కంటే గొప్పవారా ? నేరుగా కారు ఆర్వో కార్యాలయంలోకి వెళ్లడానికి? ఇలా ఎన్నికల్లో వైసీపీకి అంటకాగితే ఆ పోలీసులు తగిన మూల్యం చెల్లించుకుంటారు. వైసీపీ తొత్తులుగా ఉండి ఇప్పుడు ఎదురులేదనుకుంటే, ఖచ్చితంగా బాధ్యులు అవుతారు ? కుప్పం ఆర్వో కార్యాలయంలోకి వెళ్లిన కార్లు వీడియోలో ఎమ్మెల్సీ చిత్తూరు అని ఉండటం స్పష్టం కనిపించింది.

అక్కడ 100 మీటర్ల నిబంధన ఎక్కడా పాటించలేదు. ఎన్నికల నియమావళిని వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నా… అక్కడి పోలీసులు వారికి స్వాగతించడం చాలా దౌర్భాగ్యం. ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస మూర్తి కూడా లోపలికి వెళ్లాడు. ఇంత పక్కగా వీడియోలు ఉన్నా కలెక్టర్ కు కంప్లేట్ ఇస్తే పరిశీలిస్తామని చెప్పడం సిగ్గుచేటు. కార్లు ఆర్వో ఆఫీసులోకి రావడంపై అక్కడ ఉన్న అధికారులు , ఆర్వో, కలెక్టర్ కచ్చితంగా సమాధానం చెప్పాలి, దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం.

టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఈరోజు నామి నేషన్ వేయడానికి నిర్ణయించిన రూట్ లో ట్రాఫిక్ జామ్ అయినా, పోలీసులు పట్టించుకోలేదు. మరో వైపు తణుకులో టీడీపీ వైసీపీ నేతలు ఇద్దరు ఒకేసారి వెళితే సమన్వయం చేయాల్సిన బాధ్యత పోలీసులు పై ఉంది కానీ పోలీసులు తమకు పట్టనట్లు పూర్తిగా వదిలేశారు. ఇలా వైసీపీతో అంటకాగుతూ ఉంటే అధికారులు చేసే ప్రతి తప్పుడు పని రికార్డ్ అవుతుంది. అధికారులు చేసే తప్పుకు జూన్ 4 తరువాత మూల్యం చెల్లించుకుంటారు.

ఇండి పెండెంట్ లు వచ్చినా, చిన్న చిన్న గ్రూపులుగా వచ్చి నామినేషన్లు వేస్తుంటే, పోలీసులు దిగజారి వ్యవహరిస్తూ మాట్లాడుతున్నారు. వైసీపీతో భుజం భుజం రాసుకుని ఇలా ప్రజలను కించపరిస్తే వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎలక్షన్ లు అనేవి నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి భద్రత ఉంటుంది. పోలీసులు చట్టానికి అనుకూలంగా పనిచేస్తేనే వారికి రక్షణ ఉంటుంది. చట్టాన్ని అమ్ముతానంటే టీడీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వైసీపీతో అంటకాగి వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారులు ఇకనైనా మారాలి. అందరూ చట్టానికి లోబడి పనిచేయాలి అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE