Home » త్రిబుల్ ఇంజన్‌తోనే అభివృద్ధి సాధ్యం

త్రిబుల్ ఇంజన్‌తోనే అభివృద్ధి సాధ్యం

-కూటమిదే విజయం
-రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి
-నిడదవోలులో ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 2024సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విజ్జేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు..

ఆమెతోపాటు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజ్జేశ్వరం నుండి మొదలైన ఈ రోడ్ షోకి విశేష స్పందన లభించింది. ఇదే రోజు రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలను సంబరాలు అంటించారు. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజ్జేశ్వరం, గోపవరం, పురుషోత్తపల్లి, సమిశ్రగూడెం డి. ముప్పవరం, కలవచర్ల, మునిపల్లి, పెండ్యాల గ్రామాలలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు అడుగడుగునా మంగళ హారతులు పట్టారు.

ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని అదే విధంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేష్ ను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి,భారతీయ జనతా పార్టీ, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply