– వైసీపీ సర్కారు దద్దమ్మ అని నిరూపించుకున్నారు
– స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శ
మంగళగిరి: ప్రైవేటీకరణకు ఆద్యుడు జగన్ రెడ్డి అని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజ్ ల అంశంపైన జగన్ నర్సీనట్నం వెళ్లి అక్కడున్న మొండిగోడలు, ముళ్ల చెట్లు , పిచ్చి మొక్కల్ని చూసి, ఆహా, ఓహో అని చెప్పి ఆయనకి ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం మనం చూశాం. ఈ మధ్య పదే పదే చెబుతా ఉన్నాడు కదా.. ఆయన కట్టిన కాలేజ్ లను జనం చూసి ఆగి ఆహా అనాలట. ఆ మొండిగోడల్ని చూపించి నానారకాలుగా అనరాని మాటలు అని బురద చల్లే ప్రయత్నం చేశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
ప్రత్యేకంగా జీవోల గురించి మాట్లాడారు. సాధారణంగా ఎప్పుడూ కూడా ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతారు. కానీ ఈసారి జీవోలు పట్టుకున్నారు. మంచిదే మాకు కూడా జగన్ ఇచ్చిన జీవోలు చూసి మాట్లాడలనేదే మాకు కూడా కావాలి. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెం: 108(తేదీ 19-7-2023) తీసుకువచ్చింది తమరే కదా జగన్. మరి ఈ జీవో గురించి కూడా ఇప్పుడు మాట్లడరేం.
ఈ జీవోలో ఏముందంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పర్సెంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించాలని. 100 శాతంలో 15శాతం నేషనల్ కోటా, మిగతా 85 శాతం సగంగా డివైడ్ చేస్తే.. 42.5 శాతం ఓపేన్ క్యాటగిరి వాళ్లకు ఇస్తారు. మిగతా 42.5ను 50శాతంగా తీసుకుంటే 35 శాతం ఎన్నారై, మిగతా 15శాతం మెనేజ్మెంట్ కోటా ఉంటుంది. మరి ఇది మీరు తీసుకొచ్చిన జీవోనే.
దీనికి విరుద్ధంగా ఏమైనా చేస్తున్నామా అంటే జగన్ దగ్గర సమాధానం లేదు. వైద్య విద్యను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పీపీపీ విధానం సరైందని నేషనల్ మెడికల్ కమీషన్ చైర్మన్ అభిజాత్ సేట్ చెప్పారు. మరి ఆయన్ని కూడా నువ్వు తప్పు పట్టగలవా జగన్. ఎన్ఎంసీ ఏదైతే చెప్పిందో దాన్ని నువ్వు ఖండించగలవా జగన్. దాదాపు 110 సీట్లు మన పేద విద్యార్థులకు వస్తాయి అని చూస్తుంటే రాక్షస మూకల అడ్డు పడుతున్నవ్.
నర్సీ పట్నం వెళ్లి ఏం చూపించావ్? నీ చేతకాని తనాన్నేనా? వదిలేసిన నిర్మాణాలని చూపిస్తూ మీ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని నిరూపించుకున్నారు. మీరు విడుదల చేసిన జీవో 108 ప్రకారం కూటమి అడుగులు ముందుకు వేయడం తప్పా? పేదవాడి మొఖంలో చిరునవ్వు చూడటం మీరు ఓర్చుకోలేరు. వాళ్లకిచ్చిన సంక్షేమ పథకాల్లో కోత పెట్టాలి. పేద వాడి కడుపునిండా పట్టెడన్నం తింటే జీర్ణించుకోలేవు.. అందుకే అన్నా కాంటీన్లు మూసేయాలి. కానీ కూటమి వచ్చాక ఈరోజు ఆంధ్ర లో ప్రతి నెలా ఒక పండగ.
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రతి పేదవాడి ఇంటికి వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకుంటూ వాళ్లకి మంచి చేస్తున్నారు. కానీ నువ్వు రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడి ఇంటికైనా వెళ్లావా, అసలు వాళ్ల గడప తొక్కావా? ఎంతసేపూ పరదాలు కట్టుకోవడం , బారికేడ్లు కట్టకోవడం, హెలికాప్టర్లలో తిరుగుతూ గాలిలో చక్కర్లు కొట్టడం లేదా రోడ్ల పైన రెడ్ కార్పెట్లు వేసుకోవడం.. ఇదేగా నీ పని. ఒక నియంతలా, విలాసవంతమైన జీవితం గడపడమే కదా నీకు చేతనయింది. అలాంటి నీకు పేదవాడి గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది జగన్. ఈరోజు ప్రతి పేదవాడి మొఖంలో నవ్వు చూడటం కోసం చంద్రబాబుగారు పనిచేస్తున్నారు.
పీ4 పథకంతో లబ్ది పొందుతున్న బంగారు కుటుంబాల దగ్గరకు వెళ్లి అడుగు వాళ్లే నీకు చెబుతారు. వైద్య కళాశాలల గురించి నువ్వు చేస్తున్న దుష్ప్రచారం అందరికీ తెలుసు జగన్. నువ్వే జీవో విడుదల చేస్తావు. అదే జీవోని కొనసాగిస్తుంటే ప్రశ్నిస్తావు. పీపీపీ విధానంలో 11 సీట్లు పేదవాడికి చేరుతుంటే ఏవిధంగా ప్రశ్నిస్తున్నావు? పీపీపీ విధానంలో ప్రతి కళాశాలలో 50 శాతం సీట్లు పేదవిద్యార్థులకే కేటాయించబడతాయి. 15 వేల రూపాయలు పేద విద్యార్థులకు అదే కేటాగిరి కింద ఖచ్చితంగా కేటాయించబడతాయి. అంతెందుకు నేషనల్ మెడికల్ కమీషన్ చైర్మన్ అభిజాత్ సేట్ గారిని అడుగు.. పీపీపీ గురించి ఆయనే చెబుతారు.
పీపీపీ అంటే ప్రైవేట్ వాళ్లకు ఇచ్చేయటం కాదు. అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. కానీ ప్రైవేట్ సహకారం మాత్రమే ఉంటుంది అని. అయినా నీకు అది కూడా తెలియదా జగన్. నీకు తెలుసు కానీ తెలియనట్లు నటిస్తావు. ఇదే పీపీపీ మోడల్ లో మీరు పిలవలేదా పీపీపీ మోడల్ హబ్బులు.. మరి నిన్న నర్సీపట్నంలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదు. ఎందుకంటే నీ అజెండానే పేదవాడిని ఏడిపించడం. అందుకే అవేం మాట్లాడకుండా నోరు పారేసుకుని వచ్చావు.
కానీ కూటమి అలా కాదు.. ఏది ఏమైనా వాస్తవాలను మేం తెలియేస్తూనే ఉంటాం. నిజమైన పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం చంద్రబాబుది. అది ప్రజలకు కూడా తెలుసు. మెడికల్ కాలేజీల గురించి వైసీపీ మూకల ఫేక్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలుసుకో జగన్.