Suryaa.co.in

Andhra Pradesh

ఓటమి భారం నుంచి తప్పించుకోవడానికే జగన్ స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి పాత రాగం

– 4 ఏళ్లుగా విచారణలపేరుతో కాలయాపనతప్ప, ముఖ్యమంత్రి అతని ప్రభుత్వం ప్రాజెక్ట్ లో లేని అవినీతిపై ఏంతేల్చింది?
• షెల్ కంపెనీలు, అవినీతి అని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది
• క్విడ్ ప్రోకో, మనీలాండరింగ్ పదాల్ని దేశానికి పరిచయంచేసిన అవినీతి సామ్రాట్ జగన్. అలాంటి వ్యక్తి చంద్రబాబు తప్పుచేశాడని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
• స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే దాన్నిఈడీ తేలుస్తుంది. ఈడీ విచారిస్తుండగానే మరలా జగన్ సీఐడీతో విచారణజరపడం ఏమిటి?
• విచారణ జరుగుతుండగానే ఆ వ్యవహారంపై శాసనసభలో మాట్లాడటం దర్యాప్తుసంస్థల్ని ప్రభావితం చేయడంకాదా?
– పీ.ఏ.సీ ఛైర్మన్, టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్

రాష్ట్రంలో ఉన్నసమస్యలు, మరీముఖ్యంగా అకాలవర్షాలకు నష్టపోయిన రైతాంగం గురించి సభలో ఒక్కమాట మాట్లాడని ముఖ్యమంత్రి, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై 2గంటలు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని, ఏమీలేనిదానిపై కేవలం బురదజల్లి, బట్టకాల్చి చంద్రబాబు, టీడీపీనేతల ముఖానవేయాలన్నదే జగన్ ఉద్దేశమని టీడీపీశాసనసభ్యులు, పీ.ఏ.సీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…

“రాష్ట్రవిభజనానంతరం, వ్యవసాయఆధారితమైన ఏపీలోని యువతకు ఉద్యోగాలుకల్పించి, రాష్ట్రాన్ని ఐటీహబ్ గా మార్చాలన్న లక్ష్యంతో టీడీపీప్రభుత్వం దేశంలోని అవకాశాలను పరిశీ లించి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నమార్పులపై దృష్టిపెట్టింది. అదేసమయంలో సీమెన్స్ సంస్థ దేశవ్యాప్తంగా తాముస్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను ఏర్పాటుచేశామని, గుజరాత్ ప్రభు త్వంతోకూడా ఒప్పందంచేసుకున్నామని చెప్పడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కొందరు ఐఏఎస్ లను గుజరాత్ కువెళ్లి, సీమెన్స్ సంస్థ అమలుచేస్తున్న శిక్షణాకార్యక్రమాలను పరిశీలించాలని చెప్పారు. దానిలో భాగంగా అంతర్జా తీయసంస్థ సీమెన్స్, దేశీయ సంస్థ డిజైన్ టెక్, రాష్ట్రప్రభుత్వం కలిసి త్రైపాక్షిక ఒప్పందంచేసు కున్నాయి. ఆ ఒప్పందాన్ని ఫైనలైజ్ చేసింది సీమెన్స్ సంస్థే. ఏపీ గుజరాత్ తోపాటు, సీమెన్స్ సంస్థతో కర్ణాటక, చత్తీస్ ఘడ్, తమిళనాడు ప్రభుత్వాలుకూడా ఒప్పందాలు చేసు కున్నాయి. వాటన్నింటిలో ఎక్కడా ఎలాంటిలోపాలు, ఆరోపణలు కనిపించలేదు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కుసంబంధించి ఏసీబీఇచ్చిన నివేదికలో అవినీతి జరిగిందని సీబీఐ ఎక్కడైనా చెప్పిందా?
2018లో ఒప్పందంచేసుకున్న సంస్థల్లో ఒకటి జీఎస్టీ ఎగ్గొట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. దానిపై పూనాలో విచారణ మొదలైంది. సీబీఐ రాష్ట్రఏసీబీని కలిసి, విచారణ జరిపింది. దానిపై నివేదికకూడా ఇచ్చారు. కానీ ఆతతంగంపై నేడు జగన్ మాట్లాడుతూ, నివేదిక నేరు గా ముఖ్యమంత్రికి అందింది కాబట్టే, దాన్ని పక్కనపెట్టారు అంటున్నారు. నివేదికలో ఎక్కడై నా సీబీఐ తప్పులుజరిగినట్టు చెప్పిందా? ఎక్కడో ఒకసంస్థ జీఎస్టీ ఎగ్గొడితే, అది ఆ సంస్థకు చెందినవిషయమనే వాస్తవాన్ని జగన్ ప్రజలకు చెప్పకుండా, చంద్రబాబు అవినీతికి పాల్ప డ్డారని చెప్పడం మసిపూసి మాయచేయడమే. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణ వివరాలుగానీ, ఏసీబీ నివేదికకానీ, వైసీపీప్రభుత్వం విచారించి సేకరించిన వివరాలుగానీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? ఊరికే సాక్షిమీడియాకు లీకులిస్తూ ఎన్నాళ్లు దుష్ప్రచారం చేస్తారు?

జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశించింది. ప్రాజెక్ట్ పై అంతకు ముందు సీబీఐ విచారణతాలూకా వివరాలుగానీ, ఏసీబీ నివేదికకానీ, వైసీపీప్రభుత్వం విచా రించి సేకరించిన వివరాలుగానీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? వైసీపీప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఆర్జా శ్రీకాంత్ అనేఅధికారి ఇచ్చిన నివేదికను ఎందు కు బయటపెట్టరు? ఎందుకంటే ఎక్కడా టీడీపీప్రభుత్వం, చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో తప్పుచేసినట్టులేదు.
ఏమీలేకపోయినా.. కోడిగుడ్డుమీద ఈకలు పీకడానికి జగన్ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై సీఐడీ విచారణకు ఆదేశించారు. అదిచేసి మూడేళ్లైంది. కానీ ఎక్కడా ఏమీతేల్చలేదు. ఊరికేసాక్షి మీడియాకు మాత్రం, చంద్రబాబు తప్పుచేశాడని, టీడీపీ నేతలకు డబ్బులు వచ్చాయని లీకులు ఇస్తున్నారు. ఎక్కడనుంచి ఎవరికి డబ్బులు వచ్చా యో చెప్పమంటే దానికి సమాధానంచెప్పరు.

 సెంట్రల్ టూల్ డిజైన్ సంస్థ ఇచ్చిన నివేదక జగన్ ప్రభుత్వానికి కనిపించలేదా?
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, ప్రతి ఆరునెలలకు ఒకసారి స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై సమీక్షలు చేస్తున్నాడు. చంద్రబాబు యువతకు శిక్షణ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణా కేంద్రాల్లోనే, ఈ ప్రభుత్వంకూడా యువతకు శిక్షణ ఇస్తోంది. టీడీపీప్రభుత్వం పెట్టిన అన్నాక్యాంటీన్లనే మూసేసిన జగన్, టీడీపీప్రభుత్వం అవినీతిచేసింది అంటున్న నైపుణ్యశిక్షణా కేంద్రాల్ని ఎందుకు కొనసాగిస్తున్నాడు? స్కిల్ డెవలప్ మెంట్ మొత్తం ప్రాజె క్ట్ వ్యయం రూ.3వేలకోట్లు, దానిలో 90శాతం వాటా సీమెన్స్ సంస్థది అయితే, రాష్ట్రప్రభుత్వ వాటా 10శాతం. ఆ పదిశాతం సొమ్ముని (రూ.370కోట్లు) ఎవరు రిలీజ్ చేశారు. గంటా సుబ్బారావుగారా? నిధులు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డిగారు. ఆయన కూడా కేంద్రప్రభుత్వ సంస్థతో సీమెన్స్ చెప్పింది వాస్తవమని నిర్ధారించుకున్నాకే నిధులు విడుదలచేశారు. సీమెన్స్ సంస్థవారు రూ.3వేలకోట్ల పరికరాలు, సాఫ్ట్ వేర్ తెచ్చామంటున్నారు ..దానిగురించి తనకు తెలియదుకాబట్టి, కేంద్రప్రభుత్వసంస్థ సెంట్రల్ టూల్ డిజైన్ కు విచారణ జరపాలని లేఖరాశారు. ఆ సంస్థ అంతావిచారించి, నైపుణ్యశిక్షణాకేంద్రాలకు అవసరమైన సాఫ్ట్ వేర్ ఇతరపరిక రాలు, యంత్రాలను సీమెన్స్ సంస్థ సమకూర్చింది.. వాటితో యువత శిక్షణ పొందుతున్నారు అనినివేదిక ఇచ్చింది. ఆ తరువాతే ప్రేమచంద్రా రెడ్డి నిధులు విడుదల చేశారు. ఈవ్యవహారంలో సీమెన్స్ సంస్థ, సెంట్రల్ టూల్ డిజైన్, ప్రేమచంద్రారెడ్డి తప్పుచేయకుండా చంద్రబాబే చేశాడని జగన్ చెప్పడం అతని రాజకీయ అజ్ఞానం కాదా? తెలుగుదేశం పెద్దలఖాతాల్లోకి డబ్బులు పోయాయని సాక్షిమీడియాలో దుష్ప్రచారం చేసేబదులు, ఆఖాతాల వివరాలు ఏవో జగన్ ప్రభుత్వమే బయటపెట్టవచ్చుకదా! ఊరికే సిం గపూర్.. అమెరికా, అండమాన్ అని కబుర్లుఎందుకు?

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో టీడీపీప్రభుత్వానికి డబ్బులుముట్టినట్టే, గుజరాత్ ప్రభుత్వానికి కూడా ముట్టాయని జగన్ చెప్పగలడా?
సీఐడీ విచారణతో తృప్తిపడకుండా జగన్మోహన్ రెడ్డే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై ఈడీ విచారణ కోరారు. ఈడీ విచారిస్తుండగానే మరలా సీఐడీ విచారణ ఎందుకు జరిపిస్తున్నారు? ఈడీ ఎవరో ఒకర్ని అరెస్ట్ చేస్తే అతను దోషి అవుతాడా? ఈడీ ఛార్జ్ షీట్ వేసేవరకు ఎందుకు ఓపికపట్టలేకపోతున్నారు? ఈ వ్యవహారంపై శాసనసభలో డిబేట్ పెట్టడం..విచారణను ప్రభా వితంచేయడం కాదా? ఒక విచారణ జరుగుతుండగా దానిపై సభలో ఇష్టానుసారం మాట్లాడ కూడదని ముఖ్యమంత్రికి తెలియదా? 4ఏళ్లుగా అధికారంలోఉండి జగన్, అతనిప్రభుత్వం, సీఐడీ స్కిల్ డెవలప్ మెంట్ పై ఏమీ తేల్చలేదు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో టీడీపీ ప్రభుత్వానికి డబ్బులుముట్టినట్టే, గుజరాత్ ప్రభుత్వానికి కూడా ముట్టాయని జగన్ చెప్పగలరా? ఏపీతోపాటు ప్రాజెక్ట్ ను అమలుచేసిన మరో 4 రాష్ట్రాలు కూడా అవినీతి చేశాయా? డిజైన్ టెక్ సంస్థ ఎక్కడో జీఎస్టీ చెల్లించకపోతే, దాన్ని జీఎస్డీ వింగ్ కనిపెట్టి, విచారణకు ఆదేశించింది . ఆసంస్థ ఎక్కడో, ఏదో తప్పుచేస్తే, దాన్ని టీడీపీకి, చంద్రబాబుకి ఆపాదిస్తారా?

తనకు ఎదురైన ఘోరపరాభవాన్ని జీర్ణించుకోలేకనే జగన్మోహన్ రెడ్డి, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ సభలో పసలేని పాతపాటే పాడాడు
జగన్మోహన్ రెడ్డి తనఅసమర్థతను, చేతగానితనాన్నికప్పిపుచ్చుకోవడానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఎదురైన ఘోరపరాభవంపై ప్రజలుచర్చించకూడదనే గంటలతరబడి శాసన సభలో లేనిదానిగురించి ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈడీనివేదిక వచ్చేవరకు ఆగకుండా జగన్ ఊరికే అవినీతి, షెల్ కంపెనీలు అంటే సరిపోతుందా? అసలు ఈ దేశానికి క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి. షెల్ కంపెనీలు, మనీలాండరింగ్ కు ఆద్యుడు జగన్. మేం జగన్ అవినీతిపై ఆరోపణలుచేసి, దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టా క సీబీఐ విచారించి, ఈడీ ఆయన ఆస్తులు జప్తు చేశాకే, ఆయన జైలుకెళ్లాడు. అలానే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో టీడీపీ, చంద్రబాబు తప్పుచేసుంటే ఈడీ విచారణలో తేలుతుంది. ఈడీ నివేదిక వచ్చేవరకు జగన్ ఆగలేకపోతున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ ప్రజ లు జగన్ ను ఛీకొట్టేసరికి, దిక్కుతోచనిస్థితిలో పనిగట్టుకొనిమరీ అసెంబ్లీలో పచ్చిఅబద్ధాలు చెప్పాడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో టీడీపీప్రభుత్వం అవినీతికి పాల్పడితే, దానికి సం బంధించి జగన్, ఆయనప్రభుత్వం కనిపెట్టిన ఆధారాల్నిఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదు? ప్రజలముందు పెడితే, మీరుచేసినవి నిరాధారఆరోపణలు అని తేలిపోతుందన్న భయ మా?” అని పయ్యావుల నిలదీశారు.

LEAVE A RESPONSE