-వేల కోట్లు విద్యుత్ డిస్కంలకు ఎగనామం పెట్టిన జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఫ్యూజులను తక్షణమే విద్యుత్ అధికారులు తొలగించాలి
-టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ప్రజలపైన పన్నుల బాధుడు కార్యక్రమాన్ని జగన్ రెడ్డి నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు.
నిన్నటి వరకు వివిధ రూపాల్లో విద్యుత్ వినియోగదారులపై రూ.16,611 కోట్ల భారాలు మోపారు.
ఇప్పుడు తాజాగా ట్రూఅప్ ఛార్జీల పేరుతో మరో రూ.2,910 కోట్లు భారం మోపనున్నారు.
దీంతో నేటి వరకు రూ.19,500 కోట్లు విద్యుత్ భారాల పేరుతో ప్రజలను బాదుతున్నారు.
ఒకప్రక్క ప్రజలను బాదుతూ మరోప్రక్క రూ15.474 కోట్లు ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ బకాయిలు పెట్టింది జగన్ సర్కార్.
వివిధ ప్రభుత్వ శాఖలు వాడుకున్న విద్యుత్ కు 30.09.2021 వరకు రూ.9,783 కోట్లు డిస్కంలకు బకాయిపడ్డాయి.
మొత్తంగా జగన్ రెడ్డి గత సెప్టెంబర్ నాటికే రూ. 25,257 కోట్లు డిస్కంలకు ఎగనామం పెట్టారు.
ఈ బకాయిలు చెల్లించనందుకు ముందుగా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఫ్యూజులను విద్యుత్ అధికారులు తొలగించాలి.
మే 2022 లో హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో రాష్ట్రంలోని విద్యుత్ డిస్కాంలు దివాల తీశాయని తనకు తానే ప్రకటించుకుంది.
రూ.38,836 కోట్లు అప్పుల ఊబిలో డిస్కంలు కూరుకుపోయాయని జగన్ సర్కార్ నిస్సిగ్గుగా ఒప్పుకుంది.
దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ.13,011 కోట్లు తాము బాకీపడిన తమ ఘన కీర్తిని కూడా అఫిడవిడ్ లో చాటుకున్నారు.
ఇంత ఘోరంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా పతనమైన అంశాన్ని కోర్టులో ఒప్పుకున్న దాఖలాలు దేశ చరిత్రలోనే లేవు.
అమరావతి: ప్రజలపైన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జగన్ రెడ్డి నిర్వీరామంగా కొనసాగిస్తున్నారని, ఆయన బాదుడికి ప్రజలు అల్లాడిపోతున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. 2014-19 కాలంలో వినియోగించిన విద్యుత్ కు ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల వసూలు చేయడం జగన్ దోపిడీ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల నుంచి ట్రూఅప్ ఛార్జీల వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టిడిపి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం పట్టాభి మాట్లాడుతూ….
జగన్ రెడ్డి ప్రజలపై మోపిన భారాల వివరాలు….
2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన వారిపై యూనిట్ పై 90 పైసలు పెంచి, 2020 ఏప్రిల్, మే నెలలో కరోనా సమయంలో స్లాబులు మార్చి. 2021 ఏప్రిల్ లో కిలో వాట్ కు రూ.10 పెంచి, సెప్టెంబర్ 2021 లో ట్రూ అప్ ఛార్జీలు రెండుసార్లు పెంచి. ప్రతీ మూడు నెలలకు ప్యూయల్ అండ్ పర్చేజ్ కాస్ట్ పేరుతో భారాలు మోపి. తిరిగి ఏప్రిల్, 2022 లో స్లాబులు కుదించి, జూన్, 2022 లో ఏసీడీ ఛార్జీల (కాషన్ డిపాజిట్) పేర్లతో ఇప్పటికి రూ.16,611 కోట్లు భారం ప్రజలపై మోపారు. ఇప్పుడు తాజాగా మరోసారి ట్రూఅప్ పేరుతో రూ.2,910 కోట్లు భారం మోపుతున్నారు. దీంతో ఇప్పటి వరకు జగన్ రెడ్డి ఒక్క విద్యుత్ ఛార్జీల పేరతోనే ప్రజలపై రూ.19500 కోట్ల భారం మోపినట్లైంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి దాదాపు రూ. 20 వేల కోట్ల రూపాయలు భారం ఒక్క విద్యుత్ పేరుతోనే మోపిన జగన్ రెడ్డి బటన్ నొక్కి ప్రజలకేదో పంచేస్తున్నట్లు బిల్డప్ లు ఇస్తున్నాడు.
జగన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ వ్యవస్థ ఏ విధంగా నాశనం అయ్యిందో, డిస్కంల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో ఒకసారి చూద్దాం….
సోలార్, విండ్ విద్యుత్ ఉత్పాదక కంపెనీల పీపీఏ ల రద్దు అంశంపై హైకోర్టులో విచారణ సంధర్బంగా వైసీపీ ప్రభుత్వం మే,2022 లో దాఖలు చేసిన అఫిడవిట్ లో
…..the respondent distribution companies…APSPDCL, APEPDCL, APCPDCL are facing precarious financial crisis. it is unable to pay the monthly bills from 1st January 2021. All three Discoms are in a severe financial crises in the state of Andhra Pradesh ….అని పేర్కొంది.
కనీసం విద్యుత్ సరఫరా చేసిన వారికి నెలవారీ చెల్లింపులు కూడా చేయలేనంత ఆర్ధిక ఇబ్బందుల్లో డిస్కంలు కూరుకుపోయాయని గౌరవ హైకోర్టు ఆదేశించిన మాదిరి సోలార్, విండ్ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయలేమని సాక్షాత్తు ప్రభుత్వమే గౌరవ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిడ్ లో చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఇప్పటికే రూ.13,011 కోట్ల రూపాయలు బాకీపడ్డాం అని కూడా చెప్పింది. ఇంత నిస్సిగ్గుగా తమ రాష్ట్ర డిస్కంలు దివాలా తీశాయని ఏ రాష్ట్రం కూడా ఈ రకమైన అఫిడవిట్ కోర్టులో దాఖలు చేసిన చరిత్ర లేదు.
ఏ.పీ.ఎస్.పీ.డీ.సీ.ఎల్ రూ.11,760 కోట్లు, ఏ.పీ.ఈ.పీ.డీ.సీ.ఎల్ రూ.7,431 కోట్లు., ఏ.పీ.సీ.పీ.డీ.సీ.ఎల్ రూ. 9,407 కోట్లు మొత్తంగా డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో కూరుకుపోయాయని కూడా అఫిడవిట్ లో రాశారు. అంతేకాకుండా డిస్కంలకు రూ. 38,836 కోట్లు అప్పులు ఉన్నట్లు చెప్పారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 5,754, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ నుంచి 11,074 కోట్లు. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 11,597, వివిధ బ్యాంకుల నుంచి రూ 3 వేల కోట్ల అప్పులు చేసి అప్పులు చేయడం వలన అప్పుల ఊబిలో డిస్కంలు కూరుకుపోయాయని కూడా అఫిడవిట్ లో రాశారు. ఇంత అధ్వానమైన పరిస్థితికి డిస్కంలకు ఉత్పన్నమవడానికి కారణం నీవు కాదా జగన్ రెడ్డి.
28.07.2022 న Unstarred Question no 1865 కి సమాధానంగా లోక్ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏపీ డిస్కంలు ఒక్క కేంద్ర విద్యుత్ ఉత్పాదక సంస్థలకే రూ. 9,945 కోట్లు బాకీ ఉన్నాయని అత్యధిక విద్యుత్ బాకీలున్న రాష్ట్రాల్లో దేశంలో ఏపీ నాలుగవ స్థానంలో ఉందని కూడా చెప్పారు. దీనికి అధనంగా ఏపీ జెన్ కోకు ఉన్న బాకీలను కూడా కలిపితే మొత్తంగా రూ. 13,011 కోట్ల బాకీలు డిస్కంలు చెల్లించాల్సిందన్న విషయం అర్ధమౌతోంది. రూ.38,837 కోట్ల అప్పులు, రూ.13,011 కోట్లు చెల్లించాల్సిన బాకీలు మొత్తంగా కలిపి రూ.51,848 కోట్లు డిస్కంలు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్ నవంబర్ 9,2021 న ప్రభుత్వానికి లేఖ రాసి రూ15.474 కోట్లు ప్రభుత్వం డిస్కంలకు సబ్సిడీ బకాయిలు పెట్టిందని, 30.09.2021 నాటికి వివిధ ప్రభుత్వ శాఖలు వాడుకున్న విద్యుత్ కు రూ.9,783 కోట్లు డిస్కంలకు బకాయిపడ్డాయని.. మొత్తంగా జగన్ రెడ్డి 2021 సెప్టెంబర్ నాటికి రూ. 25,257 కోట్లు డిస్కంలకు తక్షణమే చెల్లించాలని ఆ లేఖలో రాశారు. కానీ, ఇప్పటి వరకు జగన్ రెడ్డి డిస్కంలకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. అందుకు తక్షణమే విద్యుత్ శాఖా అధికారులు జగన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ ఫ్యూజులు పీకాలి. రాష్ట్రంలో ఒక పేదవాడు కేవలం వంద రూపాయలు విద్యుత్ శాఖకు బకాయిపడితేనే వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యంగా ఫ్యూజులు పీకే అధికారులు రూ.25,257 కోట్ల విద్యుత్ శాఖకు బకాయి పెట్టిన జగన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఫ్యూజులు పీకే సాహసం చేయగలరా?
మొత్తం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసి ప్రజలపై నిస్సిగ్గుగా భారాలు మోపుతున్నాడు జగన్ రెడ్డి. దిక్కుమాలిన వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా ఆ భారాన్ని ప్రజలపై మోపారు. డిస్కంలు రూ. 39 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు జగన్ రెడ్డే. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల తమ బాకీ చెల్లించాలంటూ రాష్ట్రం చుట్టూ తిరుగుతున్నా జగన్ రెడ్డికి కించింతు మాత్రం కూడా సిగ్గురాలేదు. డిస్కంలను ఇంతటి అప్పుల ఊబిలో ముంచినందుకు ముందుగా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఫ్యూజులు పీకేయాలని విద్యుత్ అధికారులను డిమాండ్ చేస్తున్నాను. ఏ.పీ.ఈ.ఆర్.సి ప్రభుత్వానికి రాసిన లేఖపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసి జగన్ రెడ్డి మాత్రం ఏసీ రూముల్లో శయనించడం సిగ్గుచేటు. బటన్ నొక్కడంపై అత్యంత మోజు చూపించే జగన్ రెడ్డి ముందుగా డిస్కంల బకాయిల చెల్లింపుకు బటన్ నొక్కాలి.
జగన్ రెడ్డి చెల్లించాల్సిన భారాలు ప్రజలపై ఏ విధంగా మోపుతున్నాడో ప్రజలు గమనించాలి. విద్యుత్ పేరుతో ఆయన చేసిన అప్పులు దారిమళ్లించి దోచుకుని నేడు ప్రజల్ని బాధ్యులను చేస్తున్నాడు. పార్లమెంటు కేంద్ర మంత్రి చెప్పిన తర్వాత కూడా జగన్ రెడ్డి చెల్లించాల్సిన రూ.13 వేల కోట్లు ఇంకా చెల్లించలేదు. రూ.15,474 కోట్లు సబ్సిడీ బాకీ పెట్టి రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించి వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తానని పిట్టకథలు చెబుతున్న జగన్ రెడ్డి రూ.15,474 కోట్ల సబ్సిడీ సొమ్ము డిస్కంలకు ఎప్పుడు చెల్లిస్తాడో సమాధానం చెప్పాలి. ఆ బాకీలు చెల్లించే వరకు రైతుల మెడకు ఉరితాళ్లు బిగించి మోటార్లకు మీటర్లు పెడతామంచే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. దీనిపై ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
రూ. 38,836 కోట్లు అప్పులు చేసి కనీసం ప్రభుత్వం జెన్ కోలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించనటువంటి ఘనుడు రాష్ట్ర చరిత్రలో జగన్ రెడ్డి మాత్రమే. ఇన్ని బాకీలు పెట్టిన ఘనుడు మోటార్లకు మీటర్లు పెట్టుకుంటే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తానని చెప్పడం విడ్డూరం. టిడిపి పాలనలో ఏ గ్రేడ్ లో ఉన్న డిస్కంలను సీ గ్రేడుకు పడగొట్టిన అసమర్ధుడు జగన్ రెడ్డి. ఐదేళ్ల టిడిపి పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నిరంతర విద్యుత్ అందించిన ఘనత చంద్రబాబు నాయుడిదైతే…మూడేళ్లలో రూ.20 వేల కోట్ల విద్యుత్ భారాలు ప్రజలపై మోపి పవర్ హాలిడే ప్రకటించిన అసమర్ధ సి.ఎం జగన్ రెడ్డి. జగన్ రెడ్డి చెప్పే పిట్టకథలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. అందుకే నేడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. నేడు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదంటే దానికి ప్రధాన కారణం విద్యుత్ వ్యవస్థను దివాల తీయించిన జగన్ రెడ్డే. రాష్ట్రంలో పవర్ హాలిడేలు ప్రకటించుకునే దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. పరిశ్రమలు వారంలో రెండు రోజులు మాత్రమే తెరవాలని పవర్ హాలిడేలు ప్రకటించిన అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 2014 లో రాష్ట్రం విడిపోయి ఎన్నో ఆర్ధిక కష్టాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆర్ధిక క్రమశిక్షణతో పాలన చేశారు. ప్రజలపై భారాలు మోపకుండా పాలన సాగించారు. కానీ నేడు జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటూ కూడా పవర్ హాలిడేలు ప్రకటిస్తున్నాడు. బహిరంగ మార్కెట్ ఎవరు కమీషన్ ఇస్తే వారి దగ్గర అత్యధిక ధరలకు జగన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు చేశాడు. విద్యుత్ ప్లాంట్లలో కనీస బొగ్గు నిల్వలు ఉంచలేదు.
గతంలో చంద్రబాబు నాయుడు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే జగన్ రెడ్డి వాటిని అటకెక్కించారు. ఈ విషయం పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పారు. ప్రశ్న నెం. 1119 కి సమాధానంగా మంత్రి రాజ్యసభలో చెప్పారు. విజయవాడ నార్లతాతారావు ధర్మల్ ప్లాంట్ లో 800 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్త్పిత్తికై నూతన ప్లాంట్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఇది ఏప్రిల్ 2019లోనే ట్రయల్ చేయాల్సి ఉంది. కానీ జగన్ రెడ్డి నిర్వాకం వల్ల 3 సంవత్సరాల 5 నెలలు ఆలస్యమవటంతో రూ. 5,286 కోట్లున్న ఒరిజినల్ కాస్ట్ రూ. 7,866 కోట్లకు పెరిగిందని కేంద్రమంత్రి చెప్పారు. దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ లో అధనంగా 800 మెగావాట్ల ఉత్పత్తికై నూతన ప్లాంట్ నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుడితే జగన్ రెడ్డి నిర్వాకం వల్ల దాని కాస్ట్ 88 శాతం పెరిగి రూ.4,276 కోట్ల నుండి రూ.8,069 కోట్లకు చేరింది. ఇది వాస్తవ అంచనాల కంటే రూ.3,793 కోట్ల అధనం. గతంలో మేం పనులు ప్రారంభించిన వాటిని పూర్తి చేయకుండా జగన్ రెడ్డి కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు విద్యుత్ కొని డిస్కంలకు అప్పుల్లోకి నెట్టారు. పీపీఏలు రద్దు చేశారు, జగన్ రెడ్డి నిర్వాకం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్ధితి. జగన్ రెడ్డి చేసిన పాపాన్ని ప్రజల మీదకు నెడుతున్నారు. డిస్కంల పేరుతో చేసిన రూ. 38 వేల కోట్ల రూపాయలు ఎవరికి దోచిపెట్టారో, రూ. 28 వేల కోట్ల పైబడి డిస్కంలు నష్టాలు మూటగట్టుకోవడానికి కారకులెవరో, రూ. 13 వేల కోట్లు విద్యుత్ సరఫరా చేసిన కంపెనీలకు బాకీ దేనికి పెట్టారో, రూ. 15 వేల కోట్ల సబ్సిడి బకాయిలు డిస్కంలకు ఎందుకు చెల్లించలేదో, ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిలు రూ. 9,783 కోట్లు డిస్కంలకు చెల్లించకుండా ఎందుకు ఎగనామం పెట్టారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలి. ఇదంతా ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన అఫడవిట్ లో ఉంది. ఏపీకి తెలంగాణ రూ. 6 వేల కోట్ల విద్యుత్ బకాయి పడిన మాట జగన్ రెడ్డికి తెలియదా? కానీ జగన్ రెడ్డి నేటి వరకు తన మిత్రుడైన కేసీఆర్ ని ఆ బాకీ గురించి ఎందుకు అడగటం లేదు? కేసీఆర్ ముక్కుపిండి రూ 6 వేల కోట్లు వసూలు చేయకుండా విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై ఎందుకు భారం మెపుతున్నారు?
పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ చార్జీలు, ఆస్తిపన్ను, మరుగుదొడ్లు, మద్యం, విద్యుత్, చెత్తపన్ను, ఓటీఎస్, నిత్యవసరరాలు ఇలా ప్రతి దానిపై బాదుడే బాదుడే అంటూ జగన్ రెడ్డి బాదేస్తున్నారు. ఇక జగన్ రెడ్డిని ప్రజలు బాదటం మాత్రమే మిగిలింది. దానికి జగన్ రెడ్డి సిద్దంగా ఉండాలి. ఎప్పుడు ఎన్నికలొస్తాయా జగన్ రెడ్డిని ఎలా బాదాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగన్ రెడ్డి బటన్ నొక్కడం కాదు, జగన్ రెడ్డి పవర్ కట్ చేసే బటన్ ప్రజల చేతిలో ఉంది. అది ఎప్పుడు నొక్కుదామా అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్యాన్ కి కరెంట్ ఏవిధంగా కట్ చేయాలో ప్రజలకు తెలుసు. ట్రూ అప్ చార్జీలు ప్రజలు ఎవరూ కట్టరు. ముందు జగన్ రెడ్డి ముక్కు పిండి డిస్కంలు బాకీలు వసూలు చేయాలి. డిస్కంల పేరుతో జగన్ రెడ్డి తీసుకున్న రూ. 38,836 కోట్లు ఎవరికి దోచిపెట్టారో చెప్పాలి. జెన్కోలకు ఉన్న రూ. 13 కోట్ల బాకీ ఎప్పుడు కడతారో చెప్పాలి. విద్యుత్ చార్జీల పేరుతో ఒక్క పైసా ప్రజల నుంచి వసూలు చేసే అర్హత జగన్ రెడ్డికి లేదు.