ఏపీని గంజాయి, మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చిన జగన్

– రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలే లేవంటున్న తిరుపతిఎస్పీకి ఎన్.సీ.ఆర్.బీ, డీ.ఆర్.ఐ నివేదికలు కనిపించడంలేదా?
– యువగళం పాదయాత్రలో లోకేశ్ పై పెట్టిన కేసుల్లో సగంకూడా పోలీసులు గంజాయిపై పెట్టలేదు:
• గంజాయిపై లోకేశ్ వి తప్పుడు ఆరోపణలు అంటున్న తిరుపతి ఎస్పీకి, ఎన్.సీ.ఆర్.బీ, డీ.ఆర్.ఐ నివేదికలు, పొరుగురాష్ట్ర పోలీస్ అధికారుల వ్యాఖ్యలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కనిపించలేదా?
• గంజాయి, ఇతరమాదకద్రవ్యాల వ్యాపారంలో మునిగితేలుతున్న అధికారపార్టీవారిని అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం తిరుపతిఎస్పీకి ఉన్నాయా?
• లోకేశ్ పోలీసుల్ని దూషిస్తున్నాడని ఐపీఎస్ హోదాలో ఉన్నవ్యక్తి చెప్పడం, రాజకీయాలు మాట్లాడటం ప్రభుత్వానికి కొమ్ముకాయడం కాదా?
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (పుంగనూరు) టీడీపీ ఎమ్మెల్సీ జీ.దీపక్ రెడ్డి

“యువగళం పాదయాత్రలో లోకేశ్ గారికి ప్రజలనుంచి గంజాయికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒకతల్లి తనకూతురు గంజా యికి బానిసైందని చెప్పి, కన్నీరుపెట్టుకుంది. దానిపై స్పందించిన లోకేశ్ , రాష్ట్రంలో సాగుతున్న గంజాయిసాగు, సరఫరా, విక్రయాలు, యువత, విద్యార్థుల జీవితాలు నాశనమై పోతున్న తీరునివివరిస్తూ, ప్రసారమాధ్యమాల్లోని కథనాలు, పత్రికాకథనాల్ని ఉటంకిస్తూ, కొన్నిఆధారాలను జోడించి ప్రధానమంత్రిగారికి, కేంద్రహోంశాఖ కార్యదర్శికి, ఎన్.సీ.బీ (నార్కోటిక్స్ బ్యూరో) వారికి బహిరంగ లేఖలు రాశారు. రాష్ట్ర డీజీపీగా సవాంగ్ ఉన్నప్పుడు 2లక్షల కిలోల గంజాయిని తగలబెట్టిన వార్తను, వైసీపీ ముఖ్యనేతలే గంజాయిసరఫరా, విక్రయాల్లో కొనసాగుతున్న వైనాన్ని, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గతంలో రాష్ట్రంలో పెచ్చుమీరిన గంజాయిపై మాట్లాడిన మాటల్ని లోకేశ్ తన లే ఖలకు జతపరిచారు. అలానే ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి 2.45లక్షల టన్నుల గంజాయి ని 2022లో సీజ్ చేసినట్టు చెప్పినవార్తను కూడా తనలేఖకు జతపరిచారు.

రాష్ట్రంలో గంజా యిసాగు, సరఫరా, అమ్మకాలపై ప్రభుత్వపెద్దలు, డీజీపీలు, పొరుగురాష్ట్రాల పోలీస్అధి కారులు, స్వయంగా కేంద్రమంత్రి వంటివారు మాట్లాడినా, తిరుపతి ఎస్పీ నిస్సిగ్గుగా లోకే శ్ ని తప్పుపడుతూ, ఆయన ఆరోపణలన్నీ నిరాధారాలని, రాష్ట్రంలో గంజాయికి తావేలేదని చెప్పడం సిగ్గుచేటు. 2021లో దేశవ్యాప్తంగా 7.94లక్షల టన్నుల గంజాయిపట్టుబడితే, దానిలో ఏపీలోనే 2లక్షల టన్నులకు పైగా పట్టుబడింది. లక్షలటన్నుల గంజాయి రాష్ట్రంనుంచి ఇతరరాష్ట్రాలకు, దేశా లకు తరలిపోతున్నా, రాష్ట్రపోలీస్ యంత్రాంగం గంజాయికి సంబంధించి, ఇప్పటివరకు 1700 కేసులు మాత్రమే పెట్టింది.

రాష్ట్రంలో గంజాయే లేదంటున్న తిరుపతి ఎస్పీకి ఎన్.సీ.ఆర్.బీ, డీ.ఆర్.ఐ నివేదికలు కనిపించడంలేదా? రాష్ట్రంలో పట్టుబడిన 18,268కిలోల గంజాయి గాల్లో నుంచి వచ్చిందని ఎస్పీ అనుకుంటున్నారా? ఎన్.సీ.ఆర్.బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) 2021-22 నివేదిక 571మంది యువత మత్తుకు బానిసలై ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పింది. మత్తు, మాదకద్రవ్యాలకు బానిసలై, ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత జాబితాలో ఏపీనే ముందు వరుసలో ఉందని కూడా సదరు నివేదిక అభిప్రాయపడింది. అలానే డీ.ఆర్.ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్) 2020-21నివేదిక ఆంధ్రప్రదేశ్ లో 18,268కిలోల గంజాయి సీజ్ అయినట్టు చెప్పింది. అదిమొత్తం గాల్లోనుంచి వచ్చిందని తిరుపతిఎస్పీ అనుకుంటున్నారా? రాష్ట్రంలో 15 నుంచి 20వేలఎకరాల్లో గంజాయి సాగు జరుగుగుతోంది. పాఠశాలల్ని కూడా గంజాయి కేంద్రాలుగా మార్చేశారు, గంజాయితోపాటు, మద్యం, గుట్కాప్యాకెట్లు కూడా పాఠశాలల్లో దర్శనమిస్తున్నాయి. చిత్తూరుజిల్లాలో కొన్నిపాఠశాలల్లో పిల్లలు గంజాయితో పట్టుబడితే, వారితల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదుచేస్తే, ఆయా ఘటనల పై పోలీస్ శాఖ ఒక్క కేసుకూడా కట్టిందిలేదు.

తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఐపీఎస్ అధికారిలా కాకుండా, వైసీపీఅధికారప్రతినిధిలా మాట్లాడారు
గంజాయిసాగు, సరఫరా, విక్రయాల్లో మునిగితేలుతున్న వైసీపీనేతల్ని అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ఉన్నాయా అని మీడియాసాక్షిగా సవాల్ విసురు తున్నాం. ఆయన బాధ్యతగల ఐపీఎస్ అధికారిలా కాకుండా, వైసీపీనేతలా మాట్లాడుతు న్నారు. యువగళం పాదయాత్రలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. అవే ఆంక్షలు, నిబంధనలు గంజాయిసాగు, అమ్మకాలపై ఎందుకు పెట్టలేకపోతున్నారు. గంజాయి సమస్య పెద్ద సమస్యేకాదన్నట్లు తిరుపతి ఎస్పీ మాట్లాడటం సిగ్గుచేటు. తిరుపతి ఎస్పీ నిన్న మీడియాతో మాట్లాడిన తీరుచూస్తే, ఆయన వైసీపీఅధికారప్రతినిధిలా మాట్లాడి నిస్సి గ్గుగా,గంజాయి, ఇతరమాదకద్రవ్యాలను పెంచిపోషిస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చా రు. గంజాయి, మాదకద్రవ్యాల సమస్యపై లోకేశ్ గారు మాట్లాడితే, ఆయన వ్యాఖ్యల్ని ఖండిం చడానికి పరమేశ్వర్ రెడ్డి ఎవరు? తిరుమలలో గంజాయికేసు ఒక్కటే నమోదైందని ఎస్పీ చెప్పారు. తిరుమలలో 2014-19మధ్యలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కేసులు 7మాత్ర మే నమోదయ్యాయని కూడా ఆయనచెప్పారు. తిరుపతి జిల్లాలో 2014-19మధ్య 51కేసులు నమోదయ్యాయని చెప్పారు. అదేఎస్పీ 2020 నుంచి 2023 మధ్య (ఇప్పటివరకు) తిరుపతి జిల్లాలో 194కేసులు నమోదైనట్టు చెప్పారు. కేసులనమోదునిబట్టే, పోలీస్ వ్యవస్థ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎంతబాగా పనిచేస్తుందో చెప్పొచ్చు. అదే ఎస్పీ పరమేశ్వరరెడ్డి మరలా రెండ్రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిజిల్లాలో నమోదైన గంజాయికేసుల్లో తమిళనాడు, కేరళకు సరఫరాచేస్తూ పట్టుబడినవారే ఎక్కువని చెప్పారు. రాష్ట్రంలోని వారిని వదిలేసి, పొరుగురాష్ట్రాలవారిని పట్టుకున్నామని ఎస్పీ మాటల్లోనే తేలిపోయింది.

రాష్ట్రంలో గంజాయిసమస్య లేకపోతే, ఉమ్మడి చిత్తూరుజిల్లాలో యువగళం పాదయాత్ర మొదలైనప్ప టినుంచీ తల్లిదండ్రులు తమబిడ్డలు గంజాయికి బానిసలై పాడైపోతున్నారని లోకేశ్ తో ఎందుకు మొరపెట్టుకుంటున్నారో, వారికి తానేంసమాధానం చెబుతాడని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వకార్యక్రమంలో వైసీపీఎమ్మెల్యే ఇంటింటికీ వె ళ్లి, తిరుపతిచుట్టుపక్కల గంజాయిసమస్య ఎక్కువైందని అన్నది నిజమో..కాదో ఎస్పీ చెప్పా లి. యువగళం పాదయాత్రలో టీడీపీనేతలు, లోకేశ్ పెట్టినన్నీకేసులు కూడా తిరుపతి ఎస్పీ గంజాయిపై పెట్టలేదు. పాఠశాలల్లో గంజాయిపొట్లాలు దొరికినా, పిల్లలు అదిసేవిస్తున్న వీడి యోలు సోషల్ మీడియాలో వచ్చినా తిరుపతిఎస్పీ గంజాయిసమస్యేలేదని ఎలా చెబుతాడు ? పక్కరాష్ట్రాల పోలీస్ అధికారులు తమరాష్ట్రాల్లోకి వస్తున్న గంజాయిమొత్తం ఏపీనుంచే వస్తుందని చెబుతున్న మాటలు తిరుపతి ఎస్పీకి వినిపించడంలేదా? రాష్ట్రంలోని గంజాయి, ఇతర మాదకద్రవ్యాల గురించి జాతీయస్థాయి దర్యాప్తు సంస్థలు వెలువరిస్తున్న నివేదిలకపై పరమేశ్వరరెడ్డి ఏంసమాధానం చెబుతారు? లోకేశ్ పోలీసుల్ని దూషిస్తున్నారని, భయపెడు తున్నారని పిచ్చిపిచ్చిగా మాట్లాడటానికి పరమేశ్వరరెడ్డి ఎవరు? లోకేశ్ కు లేనిపోనివి ఆపా దించి, ఆయన్ని పలుచనచేయడానికే పరమేశ్వరరెడ్డి ఐపీఎస్ పూర్తిచేశారా?

టీడీపీప్రభుత్వం లో పోలీసులకు, ఆశాఖకు ఉన్నగౌరవమర్యాదలు ఇప్పుడున్నాయని తిరుపతి ఎస్పీ చెప్ప గలరా? వైసీపీప్రభుత్వం పోలీసులకు చెల్లించాల్సిన టీ.ఏ డీ.ఏలు ఎందుకు చెల్లించడంలేదని, మెడికల్ రీయింబర్స్ మెంట్ నిధులు, సరెండర్ లీవులతాలూకా పేమెంట్స్ కూడా చెల్లించలేద ని లోకేశ్ పలుసందర్భాల్లో మాట్లాడారు. వీక్ ఆఫ్ లీవులు, నిజాయితీపరులైన అధికారుల్ని వీఆర్ కు పంపడంపై, పనిభారం, ఆర్థికసమస్యలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న కొందరు పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్ల వెతలపై లోకేశ్, తెలుగుదేశంపార్టీ అనేకసార్లు స్పం దించాయి. అదేమాదిరి ఐపీఎస్ అధికారిగా పరమేశ్వరరెడ్డి ఒక్కసారైనా పోలీసుల సమస్య లపై, వారిజీతభత్యాలపై ముఖ్యమంత్రితో మాట్లాడారా…అలా మాట్లాడేధైర్యం ఆయనకు ఉం దా అని ప్రశ్నిస్తున్నాం. మహిళల్ని రక్షించడానికి పెట్టామని ప్రభుత్వం చెప్పుకుంటున్న దిశా పోలీస్ స్టేషన్లలో కావాలనే వైసీపీసానుభూతిపరుల్ని నియమించారనే ఆరోపణలపై తిరుపతి ఎస్పీ ఏంచెబుతారు? బ్రిటీష్ హాయాంలో కొందరు భారతీయులు స్వాతంత్ర్యం కోసం పోరాడు తున్న సాటిభారతీయులపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినట్టే, జగన్ ప్రభుత్వంలో చీడపు రుగుల్లాంటి కొందరు పోలీస్ అధికారులు సాటిపోలీసుల్ని హింసిస్తూ, టీడీపీపై కక్షసాధిం పులకు పాల్పడుతున్నారు.

లోకేశ్ పై నిరాధారఆరోపణలు చేయకుండా, ఆయనిచ్చిన ఫిర్యాదులపై తానేం చర్యలు తీసు కున్నాడో తిరుపతి ఎస్పీ చెప్పాలి. పరమేశ్వరరెడ్డి మాటలుచూస్తే, ఆయన అధికారపార్టీకి, గంజాయిసరఫరా, క్రయవిక్రయదారులకు వత్తాసుపలికినట్టు అర్థమవుతోంది. పబ్లిక్ సర్వెంట్ అయిన ఐపీఎస్ అధికారి, పబ్లిక్ ను అవహేళనచేసేలా, ప్రభుత్వాన్న, అధికారంలో ఉన్నవారి ని సమర్థించేలా ఎలా మాట్లాడతాడు? ఐపీఎస్ స్థానంలో తనకు అందే జీతభత్యాలు అన్నీ ప్రజలసొమ్ము నుంచి వస్తున్నవే అని పరమేశ్వరరెడ్డి తెలుసుకోవాలి. ఐపీఎస్ హోదాకు మ చ్చతెచ్చేలా వ్యవహరించకుండా, రాజకీయప్రకటనలు చేయకుండా, అధికారంలో ఉన్నవారి కి కొమ్ముకాయకుండా పరమేశ్వరరెడ్డి తానువేసుకున్న ఖాకీయూనిఫామ్ పరువు తీయ కుండా, రాజ్యాంగబద్దంగా నడుచుకోవాలని, ప్రజలకు న్యాయంచేయాలని కోరుతున్నాం. సంవత్సరంక్రితం వైసీపీ రాజ్యసభసభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజా యి వ్యాపారం లో కేశ్ చేయిస్తున్నాడని ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. లోకేశ్, టీడీపీనేతలు గంజాయి అమ్మితే, అధికారంలో ఉన్నజగన్మోహన్ రెడ్డి, అతనిప్రభుత్వం ఏంచేస్తోందో విజయ సాయిరెడ్డి సమాధానంచెప్పాలి.”

Leave a Reply