తల్లి, చెల్లిని మోసం చేసిన జగన్…బాబాయిని కూడా చంపేశాడు

Spread the love

– అందరికీ ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు
– పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని జగన్…మూడు రాజధానులు కడతాడా?
– రంగులు కొడితే పిల్లలకు చదువు వస్తుందా
– విజయనగరం జిల్లా నెల్లిమర్లలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో

ప్రభుత్వ విధ్వంసానికి అడ్డుపడాలి అంటే పోరాటమే మార్గం.ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఇంటి పన్ను, మరుగుదొడ్డిపై, చెత్త పై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం.చెత్త మీదbabu2 పన్ను వేసిన వైసిపి ని చెత్తలో కలిపేద్దాం.చెత్త, దద్దమ్మ, పనికి రాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం.ఒటిఎస్ కు డబ్బులు కట్టాల్సిన పని లేదు….టిడిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం.

గత 20 ఏళ్లలో రాని విధంగా పదోతరగతి ఫలితాలు వచ్చాయి. కారణం ఎవర?.వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అని పాఠశాలలు రంగులు కొట్టాడు. రంగులు కొడితే పిల్లలకు చదువు వస్తుందా.మీ జిల్లాలో ఒక
babu4 పనికిమాలిన మంత్రి…సారా వ్యాపారం చేసుకునే బొత్స చదువుల మంత్రిగా అర్హుడా. తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఫెయిల్ అయ్యారని అంటారా…దద్దమ్మ మంత్రి, ముఖ్యమంత్రి వల్ల పిల్లలు ఫెయిల్ అయ్యారు.విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం నాశనం చేసింది. టీచర్లను సారా దుఖానాల దగ్గర కాపలా పెట్టినప్పుడే ఈ రాష్ట్రం పరువు పోయింది.

జగన్ నాసిరకం మద్యం తయారు చేస్తున్నాడు….అది తాగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యం రేట్లు పెంచి ప్రజల నుంచి దోచుకుంటున్నారు.అందరికీ ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం కనీస ధర్మాన్ని పాటిస్తారు. ఎన్నికల సమయంలో మద్య నిషేధం అని చెప్పిన జగన్…ఇప్పుడు ఆడబిడ్డల తాళిబొట్లు తాకట్టు పెట్టి మద్యం పై అప్పు తెచ్చాడు.

జగన్ కు మానవత్వం ఉందా…బాబాయ్ హత్య కేసు ఏమయ్యింది?కళ్లుమూసుకుని పాలు తాగుతున్న పిల్లి జగన్…కర్ర తీసుకుని చితకబాదితే పిల్లి దారికి వస్తుంది. తల్లికి, చెల్లికి మోసం చేసిన జగన్…బాబాయిని కూడా చంపేశాడు. రాష్ట్రంలో ఇసుక దొరుకుతుందా…దీనికి కారణం ఎవరు?

విజయనగరం జిల్లాలో మూడేళ్లలో ఒక్క పని అయ్యిందా? విజయనగరం మెడికల్ కాలేజ్ ఏమయ్యింది. తారకరామ తీర్థ ప్రాజెక్ట్ ఏమయ్యింది? పోలవరం నీళ్లను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఇక్కడికి తీసుకువద్దాం అనుకున్నా. దాన్ని నిలిపివేశారు. శభాష్ నెల్లిమర్ల….తమ్ముళ్లు ఉత్సాహంగా తరలివచ్చారు. విదేశీ విద్య ఏమయ్యింది….జాబ్ క్యాలెండర్ ఏమయ్యింది. జగన్ ఉద్యోగాలు అంటే మటన్ మార్ట్ లు, ఫిష్ మార్టులు పెట్టాడు.

పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని జగన్…మూడు రాజధానులు కడతాడా/? మూడు లక్షల కోట్ల విలువైన రాజధానిని నాశనం చేశారు. 8 లక్షల రూపాయల అప్పులు చేశారు. దేశంలో ఎక్కువ వడ్డీ కట్టే రాష్ట్రంbabu3 మన రాష్ట్రం. 1994లో నాటి ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోయిన పరిస్థితి నుంచి ఉత్తమ ఫలితాలు సాధించాం. మళ్లీ ఎపికి పునర్నిర్మాణం చెయ్యాలి….దానికి నేను సిద్దంగా ఉన్నా 2019 లో తిరిగి టిడిపి గెలిచి ఉంటే దేశంలో అభివృద్దిలో ప్రధమ రాష్ట్రంగా ఉండేది.

ఆటోడ్రైవర్ల నుంచి నరేగా కూలీల వరకు ఎవరూ బాలేదు. అశోక్ గజపతి లాంటి వారిపై కేసులు పెడతారా? రామతీర్థం వస్తే మాపై కేసులు పెడతావా….మీ గుండెల్లో నిద్రపోతా. మనం కట్టిన టిడ్కో ఇళ్లు ఇచ్చారా… 90 శాతం పూర్తి అయిన ఇళ్లు కూడా పూర్తి చెయ్యలేదు. నాకు సీఎం పదవి కొత్తకాదు….babu5 ఇంటికొకరు ముందుకు రండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఆ నాడు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు….రాష్ట్రం కోసం ఏదో మేలు జరగాలనే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడారు. ఈ రాష్ట్రాన్ని బాగుచేసే శక్తి సామర్థ్యతో పాటు బాధ్యత నాకు ఉంది.

పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్ అయ్యేలా పని చేస్తా.ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే….నేను ఆత్మ విశ్వాసం ఇచ్చాను. రాష్ట్రంలో టిడిపి మద్దతు దారులు అని పెన్షన్ తీసివేసినా…పథకాలు తీసివేసినా కోర్టులోbabu6 కేసులు వేసి న్యాయం చేస్తా.

Leave a Reply