– దశాబ్దాల నుంచి భూములు సాగుచేసుకుంటున్నవారి వివరాలు బయటపెట్టకుండా, హైకోర్ట్ నియమించిన కమిటీ నివేదిక వచ్చేవరకు ఆగకుండా చుక్కలభూముల చిక్కులను ఎలా విప్పుతుందో ప్రభుత్వం చెప్పాలి
• 22 ఏ పరిధిలోని భూముల్ని ఏళ్లనుంచి సాగుచేసుకుంటున్నవారికి కాకుండా వైసీపీవారికి కట్టబెట్టాలన్నదే ప్రభుత్వ దురాలోచన
• రికార్డుల్లో నమోదుకాని భూముల్ని దశాబ్దాలనుంచి సాగుచేసుకుంటున్నవారికి కాకుండా ఎవరిపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారో పాలకులు ప్రజలకు చెప్పాలి
– టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని భూముల్ని పంచభక్షపరమాన్నాలుగా భుజిస్తున్నాడని, ముఖ్య మంత్రికి భూములంటే ఎంతోమోజని, వై.ఎస్.రాజారెడ్డి మైన్స్ ఉన్నవ్యక్తిని చంపి, అతని భూముల్ని లాక్కుంటే, అతనిబాటలోనే మనవడు జగన్ నడుస్తున్నాడని, విజయసాయి రెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జల వంటివారిసాయంతో రాష్ట్రంలో యథేచ్ఛగా భూకబ్జాలు చేస్తున్నాడని, టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …!
“తన భూములస్వాహాలో భాగంగా జగన్ చుక్కలభూములకు ఎసరుపెట్టాడు. ఆ భూముల్ని సాగుచేసుకుంటున్న అసైన్డ్ దారులకు చుక్కలుచూపిస్తున్నారో, వైసీపీ భూకబ్జాదారులకు చుక్కలభూముల్ని, దేవాదాయభూముల్ని అప్పనంగా కట్టబెడుతున్నారో ప్రభుత్వం సమా ధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వేలాదిఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. భూములు సాగుచేసుకుంటున్నవారిని భయపెట్టి అధికారులసాయంతో ఆభూముల్ని వైసీపీనేతలు వారిపేర్లతో రికార్డుల్లోకి ఎక్కించుకున్న ఘ టనలు కోకొల్లలు.
విశాఖపట్నం చుట్టుపక్కల విజయసాయి మొదలు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర వ్యాప్తంగా అయినకాడికి భూముల్ని స్వాహా చేశారు
వైసీపీ గ్రామస్థాయి నేతనుంచి రాష్ట్రస్థాయి నేతవరకు అందరూ భూకబ్జాల్లో ముని గితేలుతు న్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వందలఎకరాల భూమిని కబ్జా చేసినట్టు టీడీపీయువనేత నారాలోకేశ్ మొన్ననే గూగుల్ మ్యాప్ ద్వారా బయటపెట్టాడు. ప్రజలముందు తానేదో పెద్ద నీతిమంతుడిలా పోజులుకొట్టే కేతిరెడ్డి, లోకేశ్ కు సమాధానంచె ప్పలేక పిచ్చిప్రేలాపనలు పేలుతున్నాడు. కేతిరెడ్డి బాటలోనే మంత్రి ఉషశ్రీచరణ్ అనంతపు రం జిల్లా కనగానపల్లెలో 160ఎకరాలు ఆక్రమించారు.
జగన్మోహన్ రెడ్డి వేలఎకరాలు భూ కబ్జాలుచేస్తుంటే, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, బంధువులు వారివారిస్థాయిల్లో అయిన కాడికి హాంఫట్ చేస్తున్నారు. కడపజిల్లా ఇడుపులపాయ, బయ్యవరంలో వేలఎకరాలు జగ న్ మింగేశాడు. విశాఖపట్నం, చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 15వేలఎకరాల బాక్సైట్ భూముల్ని విజయ సాయి అతని బృందం కాజేసింది. 22 ఏ పరిధిలోని భూములు, రుషికొండభూములు, దేవా దాయ భూములు, దసపల్లా భూములుసహా అనేకరకాల భూములు ఏ2 పరమయ్యాయి. మాజీమంత్రులు కొడాలినాని, గుమ్మనూరు జయరామ్ లు కూడా భూకబ్జాల్లో ప్రధానపాత్రధా రలుగా ఉన్నారు. కర్నూలుజిల్లా అస్పిరిలో గుమ్మనూరు జయరామ్ 180ఎకరాలు కొల్ల గొట్టాడు. కొడాలినాని గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇచ్చినభూముల్ని కబ్జాచేశా డు. మైదుకూరు వైసీపీఎమ్మెల్యే రఘురామిరెడ్డి అటవీభూముల్ని కొల్లగొట్టాడు.
అటవీభూములు, చెరువు, పోరంబోకు భూములు, దేవాదాయభూములు అన్నీకొట్టేసిన జగన్ అండ్ కో తాజాగా చుక్కలభూములపై కన్నేశారు. 22ఏ (1) బీ పరిధిలోని భూముల్ని దళితులు, గిరిజనులు ఎక్కువగా సాగుచేసుకుంటున్నారు. 22ఏ (1)సీ లోని దేవాదా యభూములు, 22ఏ (1) ఈ లోని కేంద్రప్రభుత్వఅధీనంలోని భూములపై జగన్ కన్నుపడిం ది. లక్షలఎకరాల్లో ఉన్న చుక్కలభూములకు విముక్తికల్పించే నెపంతో వాటిపై వైసీపీప్రభు త్వం కన్నేసింది. ప్రభుత్వం చుక్కలభూముల సమస్యను ఎలా పరిష్కరిస్తోందో చెప్పాలి. వాటిని ఎన్నోఏళ్లనుంచి సాగుచేసుకుంటున్నవారికే ఇస్తున్నారా..లేక వైసీపీవారికి కట్టబెడు తున్నారా అనేది ప్రభుత్వంచెప్పాలి. చుక్కల భూములకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద కొన్నిలక్షల దరఖాస్తులు పెండింగ్ లోఉన్నాయి. వాటికి పరిష్కారంచూపే ప్రయత్నం జగన్ ఏనాడూచేయలేదు. భూసమస్యల ఫిర్యాదులపై గతంలోనే ఈ ప్రభుత్వంచేతులెత్తేసింది కానీ ఇప్పుడు భూరక్షపేరుతో చుక్కలభూముల్ని కైంకర్యం చేయడానికి పావులు కదుపు తున్నారు. చుక్కలభూముల చిక్కులు విడగొడుతున్నామని ప్రభుత్వంచెబుతున్న మాట లు నమ్మశక్యంగా లేవు.
చుక్కలభూముల సమస్య పరిష్కారానికి, హైకోర్ట్ నియమించిన కమిటీ విచారణ పూర్తికాకముందే ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది?
హైకోర్ట్ ద్వారా నియమింపబడిన ఒకకమిటీ ఇప్పటికే చుక్కలభూముల సమస్యపరిష్కారం పై విచారణ జరుపుతుంటే, సదరుకమిటీ దర్యాప్తు పూర్తికాకముందే, జగన్ చుక్కల భూము ల్ని ఆక్రమించడానికి కొత్తనాటకానికి తెరలేపాడు. రాష్ట్రంలో 1.81లక్షలఎకరాల అసైన్డ్ భూ మి ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవలే సాక్షిపత్రికలో ప్రకటనఇచ్చింది. 22 ఏ (1)బీ కింద, 22 ఏ (1) సీకింద, 22ఏ(1) ఈ కింద ఉన్నభూములు చాలావరకు చిన్నచిన్నకమతాలుగా పేదలు సాగుచేసుకుంటున్నవే. శిస్తుకట్టలేని రైతులు భూములసర్వేకు విముఖతచూపడంతో ఆ భూములు ఎవరివో రికార్డుల్లో నమోదుకాలేదని చెబుతున్నారు. రికార్డుల్లో నమోదుకాని ఆ భూముల్ని ఏళ్లతరబడి సాగుచేసుకుంటున్న పేదలకు ఇస్తారా..లేక వైసీపీనేతలకు కట్టబెడ తారా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్నప్రశ్న.
22ఏ పరిధిలోని భూముల్ని ఎవరుసాగుచేసుకుంటున్నారో, వారివివరాలు బయటపెట్టాకే ప్రభుత్వం చుక్కలభూముల సమస్యపరిష్కారానికి పూనుకోవాలి
జగన్మోహన్ రెడ్డి ప్రతి అంశంలో పైకి ఒకటిచెబుతూ, అంతర్లీనంగా తనకు, తనపార్టీ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు చుక్కలభూముల వ్యవహారంలోకూడా అలానే వ్యవహరిస్తాడన్నది ప్రజల భయం. ఆ భూముల్ని తనపరం, తనపార్టీ వారిపరం చేయడమే జగన్ లక్ష్యమని భయపడిపోతున్నారు. రాష్ట్రంలోని చుక్కలభూములు, దేవాదాయ భూము లు, అటవీభూములు, ఇతరత్రా ప్రభుత్వ పోరంబోకు భూముల్ని ఎవరైతే సాగుచేసుకుంటు న్నారో, వారిపేర్లు వివరాలు బయటపెట్టి, హైకోర్టు భూములస్థితిగతుల విచారణపై నియమిం చిన కమిటీ నివేదిక వచ్చాకే, జగన్ ప్రభుత్వం చుక్కలభూముల సమస్యను పరిష్కరించాలి. ” అని టీడీపీ తరుపున మాణిక్యరావు డిమాండ్ చేశారు.