• నాడు బాదుడే బాదుడని దుష్ర్పచారం చేసిన జగన్ రెడ్డి, నేడు ప్రజల్ని వీరబాదుడు బాదుతూ.. తన ఖజానా నింపుకుంటున్నాడు
• జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. పేద, మధ్యతరగతి వర్గాల ఆదాయం, జీవనం అధ్వాన్నంగా మారింది
• టీడీపీ ప్రభుత్వంలో బాదుడే బాదుడని గగ్గోలు పెట్టిన జగన్ రెడ్డి…తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు
• పెట్రోల్.. డీజిల్, గ్యాస్, నిత్యావసరాలు, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు భారంతో పాటు, మద్యంధరలు పెంచి, పిచ్చిపన్నులేస్తూ ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నాడు
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
రాష్ట్రంలో నిత్యావసరాలు అమ్మాలంటే అడవి…కొనాలంటే కొరివి అన్న విధంగా తయారయ్యాయని, జగన్ రెడ్డి అప్పులపిచ్చి, దోపిడీతో ప్రతి కుటుంబంపై రూ.2.80 లక్షల అప్పుల భారం పడిందని, వైసీపీ ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం అత్తెసరుగా మారిందని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే …
“ టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే జగన్ రెడ్డి హాయాంలో నిత్యావసరాలు.. ఇతర ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోల్ డీజిల్ తో సహా గ్యాస్..కూరగాయలు…పాలు.. పప్పు దినుసుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయనే చెప్పాలి.
జగన్ ప్రభుత్వంలో సరుకుల ధరలు (మచ్చుకు కొన్ని)
చింతపండు (కేజీ) : రూ.240లు.
ఎండుకారం (కేజీ) : రూ.500లు.
కందిపప్పు (కేజీ) : రూ.200లు.
నూనె ప్యాకెట్ (పామాయిల్) : రూ.100లు.
సన్ ఫ్లవర్ ఆయిల్ (కేజీ ప్యాకెట్) : రూ.120లు.
వేరుశనగనూనె (కేజీ) : రూ.180లు.
పంచదార (కేజీ) : రూ.48లు.
టీడీపీప్రభుత్వంలో బాదుడే బాదుడని గగ్గోలు పెట్టిన జగన్ రెడ్డి…తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు
నిత్యావసరాల ధరలకు అదనంగా పెట్రోల్, డీజిల్ ధరలను దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా జగన్ రెడ్డి పెంచేశాడు. టీడీపీ ప్రభుత్వంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడా లేని విధంగా పెంచారని ప్రజల్ని బాదేస్తున్నారని బాదుడేబాదుడు అంటూ ప్రతిపక్షనేత హోదాలో నానా గగ్గోలు పెట్టిన జగన్ రెడ్డి..ఇప్పుడు తన ప్రభుత్వంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భారీస్థాయిలో ధరలు పెంచి, ప్రజల్ని వీరబాదుడు బాదుతున్నాడు.
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో జగన్ రెడ్డి ప్రజలపై రూ.500కోట్ల భారం మోపాడు. అలానే గ్యాస్ సిలిండర్ ధర కూడా రెండు రెట్లు పెరిగింది. గతంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.600లు ఉంటే, ఇప్పుడు రూ.1100లకు పైగా ఉంది. సైకో ముఖ్యమంత్రి విద్యుత్ వ్యవస్థను నాశనంచేసి గతంలో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.500లు వచ్చే విద్యుత్ బిల్లుని అమాంతం రూ.2 వేలకు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 20శాతం పెంచిన సైకో జగన్ రెడ్డి.. మొత్తంగా రాష్ట్రప్రజలపై రూ.1000 కోట్ల భారం మోపాడు.
చంద్రబాబునాయుడు ఇసుకను ప్రజలకు ఉచితంగా అందిస్తే అది తప్పంటున్న ఇసుకాసురుడు జగన్ రెడ్డి.. నదుల్లో ఎక్కడా ఇసుక దొరక్కుండా దోపిడీ చేస్తు న్నాడు. ప్రభుత్వమే స్వయంగా ఇసుక అమ్మకాలు సాగిస్తూ..వైసీపీ నేతలతో భారీ ఇసుకమాఫియానే నడుపుతోంది. కేవలం ఇసుక అమ్మకాల ముసుగులోనే జగన్ రెడ్డి నాలుగేళ్లలో రూ.40వేలకోట్లకు పైగా దిగమింగాడు.
మద్యాన్ని నిషేధిస్తానని మాటిచ్చి.. తన దోపిడీకోసం కల్తీమద్యం అమ్మిస్తూ మహిళల మాన ప్రాణాలతో జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నాడు
అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్ రెడ్డి పిచ్చి మద్యాన్ని..కల్తీమద్యాన్ని అధికధరకు అమ్మిస్తూ ఆడబిడ్డల మానప్రాణాలతో చెల గాటమాడుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అమ్మేదే కల్తీ మద్యం.. అదికూడా నాలుగు రెట్లు అధికధరకు. జగన్ రెడ్డి ధనదాహానికి.. అతని ప్రభుత్వంలో పేట్రేగిపోతున్న మద్యం మాఫియాతో రాష్ట్రంలో నేరాలు ఘోరాలు అధికమయ్యాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులనే తేడా లేకుండా మద్యం మత్తులో కామాంధులు దురాగ తాలకు పాల్పడుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదు. కల్తీ మద్యానికి తోడు ముఖ్యమంత్రి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను కూడా విచ్చలవిడిగా అమ్మిస్తున్నాడు.
పేదలు కడుపునిండా తినడాన్ని జీర్ణించుకోలేకనే జగన్ రెడ్డి అన్నాక్యాంటీన్లు మూసేశాడు
చంద్రబాబునాయుడు పేదల కడుపు నింపడం కోసం రూ.5లకే రుచికరమైన భోజనం పెట్టేలా అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదలు సంతోషంగా పండుగ లు జరుపుకోవాలని ఆనాడు టీడీపీ ప్రభుత్వం రంజాన్ తోఫా.. క్రిస్మస్..సంక్రాంతి కానుకల రూపంలో పండుగ సరుకులు అందించింది. జగన్ రెడ్డి వచ్చీరావడంతో ధరలు పెంచి.. పేదలకు పండుగలు లేకుండా చేశాడు. వారు కడుపునిండా తినడం చూసి ఓర్వలేక, వారి సంతోషాన్ని జీర్ణించుకోలేకే అన్నాక్యాంటీన్లు మూసేశాడు. పేదలకు అందుబాటులో లేకుండా అన్నిధరలు పెంచాడు. ఇలాంటి సైకో ముఖ్యమంత్రి ఇంకా సిగ్గులేకుం డా తాను పేదలపక్షమని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు.
ధరల నియంత్రణలో మంత్రులు అధికారులు ఘోరంగా విఫలమయ్యారు
ధరల్ని నియంత్రించి నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించడంలో కూడా జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మంత్రులు.. అధికారులు ధరల పెరుగుదల.. వస్తువులు నాణ్యత.. ఆహారపదార్థాల నాణ్యతపై అసలు దృష్టిపెట్టడం లేదు. పర్య వేక్షణా లోపంతో దళారుల జోక్యం పెరిగి, బ్లాక్ మార్కెట్ విక్రయాలు అధికమై… పేద, మధ్యతరగతి ప్రజల జీవనం చెప్పలేనంత కష్టంగా మారింది. ఆఖరికి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని కూడా వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు అమ్ముకునే దుస్థితికి దిగజారారు.
తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారు. ప్రజల సంతోషం.. తన సంతోషంగా భావించే ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కడే
తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే.. అన్ని ధరలు అదుపులో ఉంటాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పేదలకు కడుపునిండా తిండి…చేతినిండా పని.. ఉండటానికి మంచి అధునాతనమైన ఇళ్లు లభిస్తాయి. భవిష్యత్ కు గ్యారెం టీ లో భాగంగా ఇప్పటికే చంద్రబాబు మహిళలు…రైతులు.. యువతకు అందించే సంక్షేమం, ఇతర ప్రయోజనాల గురించి ప్రజలకు చెబుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి. విద్యుత్ ఛార్జీ లు నామమాత్రంగా ఉంటాయి. నాణ్యమైన విద్యుత్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కల్తీ మద్యం బెడద లేకుండా పోతుంది. ప్రజల సంతోషం.. సంక్షేమమే తన సంతోషంగా భావించే ఏకైక నాయకుడు చంద్రబాబు ఒక్కడేననే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి.” అని సౌమ్య హితవుపలికారు.