Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రాష్ట్రం విడిచి పారిపోవడం ఖాయం

• జగన్ రెడ్డి దురహంకారంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులే దొరకరు తనకు, తనపార్టీకి ఎదురైన పరాభవం భరించలేక జగన్ రాష్ట్రం విడిచి పారిపోతాడు
• బ్రిటీష్ వారిని ఆదర్శంగా తీసుకున్న జగన్ రెడ్డి ప్రజలిచ్చిన అధికారంతో రాష్ట్రాన్ని దోచేసి, దేశంలోనే గొప్ప ధనవంతుడిని కావాలన్న తన కోరికను నెరవేర్చుకోవడం కోసం 5ఏళ్లు దుర్మార్గపు పాలన సాగించాడు
•జగన్ రెడ్డి విచ్చలవిడి దోపిడీ, అధికారం తలకెక్కిన అహంకారంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే పక్కచూపులు చూస్తున్నారు.
• వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీకి అభ్యర్థులు దొరక్క పార్టీ మూసేసి జగన్ రెడ్డే రాష్ట్రం విడిచి పారిపోతాడు
– మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ జోస్యం

2019 ఎన్నికల్లో గెలవడంకోసం జగన్ రెడ్డి అబద్ధాలు, మోసపు హామీలతో ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని నమ్మించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక బ్రిటీష్ వారి కంటే దారుణంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, ప్రజలు, రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి మొత్తం తానే దోచుకోవాలన్న దురాశతో వెంపర్లాడుతున్నాడని, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భారతదేశంలోనే తానే గొప్ప ధనవంతుడిని కావాలని జగన్ రెడ్డి భావించేవాడని, తనకలను నిజం చేసుకోవడం కోసం ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే … “ వ్యాపారం పేరుతో భారతదేశంలోకి అడుగుపెట్టిన బ్రిటీష్ వారు, తర్వాత సొంత సైన్యం సమకూర్చుకొని మొత్తం దేశాన్నే ఆక్రమించే స్థాయికి ఎదిగారు. అదే మాదిరిగా జగన్ రెడ్డి కూడా అవినీతికేసుల్లో జైలుకెళ్లి వచ్చాక ఈ రాష్ట్రాన్ని పాలిం చాలని భావించి, అందుకోసం సొంతతల్లిని, చెల్లిని కూడా తన స్వార్థానికి వాడుకు న్నాడు. చివరకు తండ్రి తర్వాత తండ్రి అయిన బాబాయ్ ను కూడా హతమార్చి, తాను అనుకున్నది సాధించాడు.

బ్రిటీష్ వారు ఏవిధంగా అయితే భారతీయుల్ని హింసించి, ఈ దేశసంపదను కొల్లగొట్టారో, అదే విధంగా అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి దోచుకున్న సంపదలో వాటాలు ఇవ్వాల్సి వస్తుందని భావించి తల్లిని, చెల్లిని కూడా తరమేసి, తన చుట్టూ ఎవరూ లేకుండా చేసుకొని మరీ రాష్ట్ర సంపదను కొల్లగొట్టడం ప్రారంభించాడు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో దోపిడీయే లక్ష్యంగా తన దుర్మార్గపు, విధ్వంస పాలన సాగిస్తున్నాడు. జగన్ రెడ్డి బాటలోనే ఆయన పార్టీనేతలు కూడా తమకున్న మార్గాల్లో ఎక్కడికక్కడ దొరికింది దోచుకోవడం ప్రారంభించారు .

స్థానాల మార్పిడి పేరుతో  బంతాట ఆడుతున్నాడు
తన దోపిడీని, అవినీతిని, దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే చివరకు ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు సహా, అనేక మంది టీడీపీ నేతల్ని జైలుకు పంపాడు. ఆఖరికి ఇప్పుడు సొంతపార్టీ నేతలపై కూడా తన దురహంకా రం ప్రదర్శిస్తూ, గెలవరని చెబుతూ స్థానాల మార్పిడి పేరుతో వారితో బంతాట ఆడుతున్నాడు. ఒక నియోజకవర్గంలో గెలవరని చెబుతున్న తన పార్టీ నేతలు, మరోచోట ఎలా గెలుస్తారో జగన్మోహన్ రెడ్డే చెప్పాలి.

తన బొమ్మ చూపిస్తే ప్రజలు ఓటేస్తారు అనే అహంకారం ఇంకా జగన్ రెడ్డి బుర్రనుంచి తొలగినట్టు లేదు. 2019 నుంచి 2024 వచ్చేసరికి జగన్ రెడ్డి వెంట ఎవరూ లేకుండా పోయారు. తనపార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటే దాన్ని బట్టే జగన్ రెడ్డి, అతని పార్టీ పరిస్థితి ఎంతగా దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.

జగన్ ఒక్కడే మొత్తం దోచుకుంటుంటే, ఆయన్ని గెలిపించడానికి పెట్టుబడి పెట్టిన మేం కూడా ఏదో మార్గంలో సంపాదించుకోవాలి కదా అన్న వైసీపీనాయకుడి మాటలు జగన్ దోపిడీ పాలనకు అతికినట్టు సరిపోతాయి
అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం విక్రయించే ఒక వైసీపీ నాయకుడు, ఒక సందర్భంలో మాట్లాడుతూ, ‘మేం పెట్టిన డబ్బుతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మా వరకు రాకుండా తానే సంపాదించుకుంటుంటే, పెట్టుబడి పెట్టిన మేం కూడా బతకాలి కదా.. అందుకోసం ఏదో మార్గంలో మా డబ్బులు మేం రాబట్టుకోవాలి కదా’ అని ఒక జర్నలిస్ట్ మిత్రుడితో తన మనసులో ఉన్నది చెప్పాడు. ఆ జర్నలిస్ట్ మిత్రుడు కొన్నేళ్ల క్రితం వైసీపీ నాయకుడి మాటల్ని నాతో చెప్పాడు.

ఏది ఏమైనా ఆ నాయకుడి మాటలు నాలుగున్నరేళ్లగా సాగుతున్న జగన్ రెడ్డి దుర్మార్గపు, దోపిడీ పాలనకు అతికినట్టు సరిపోతాయి. ఆ నాయకుడు చెప్పిన దాన్ని బట్టి, జగన్ రెడ్డి సంపాదనే ధ్యేయంగా ఆఖరికి సొంత పార్టీ నేతల్ని కూడా కాదని మూర్ఖంగా తానే అంతా అన్నట్టు అహంకారంతో ముందుకెళ్తు న్నాడు. జగన్ రెడ్డి చర్యలతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేయడానికి ఎవరూ ముందుకు రారు. నాయకులు లేక, ప్రజల తిరుగుబాటుతో చివరకు ఏం చేయాలో తెలియక జగన్ రెడ్డి కూడా రాష్ట్రం నుంచి పారిపోతాడు.” అని కన్నా జోస్యం చెప్పారు.

LEAVE A RESPONSE