లక్ష మంది రైతులకు 20 వేల కోట్ల లబ్ది చేకూర్చేలా చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన సీఎం జగన్ మోహన రెడ్డికి థన్యవాదాలు
20 వేల కోట్ల విలువ చేసే 2,06,170.92 ఎకరాలపై 87,560 వేల మంది రైతన్నలకు సంపూర్ణ హక్కు..
ప్రధానంగా
నెల్లూరు జిల్లా 43,271
ప్రకాశం జిల్లా 37,615
YSR కడప 31,399
అనంతపురం 28,882
పల్నాడు 25,278
శ్రీ సత్యసాయి 22,011
బాపట్ల 7,917
తిరుపతి 7,832
నంద్యాల 652
గుంటూరు 601
కర్నూల్ 339
అనంతపురం 269
చిత్తూరు 96
Dr BR అంబేత్కర్ 8
ఎకరాల… చుక్కల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో తగిన మార్పులు చేసి రైతులకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22–ఏ నుంచి వాటిని తొలగించింది. ఇన్నాళ్లూ 22–ఏ లో ఉన్న ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ దాదాపు రూ.8 వేల కోట్లు. బయట వీటి మార్కెట్ విలువ కనీసం రూ.20 వేల కోట్లు ఉంటుంది…
రెవెన్యూ రికార్డుల్లో అంటే రీ సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్)లో ఆ పట్టాదారుడి గడిలో చుక్కలు పెట్టి వదిలేశారు. బ్రిటీష్ వారి కాలంలో ఇలా చుక్కలు పెట్టి లెక్కలు తేల్చకుండా వదిలేసిన భూములను రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ వస్తున్నారు.. తరతరాలుగా సాగు చేస్తున్నా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరగని అధ్వాన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి…
రైతన్నల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పరిష్కారం చూపాల్సిన చంద్రబాబు ప్రభుత్వం 2016లో పుండుమీద కారం చల్లినట్లుగా రిజిస్ట్రేషన్లు జరగకుండా ఒక మెమో ద్వారా 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చి అన్నదాతల జీవితాలతో ఆడుకుంది. ఇలా అన్యాయానికి గురైన రైతులు తమ పిల్లల పెళ్లిళ్లు, వైద్యం, ఇతర అవసరాలకు భూమిని విక్రయించేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది…