రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది

– తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ & అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పత్తిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క అవకాశం అని అడిగితే ప్రజలు 151 ఇచ్చారు. ముఖ్యమంత్రి గా ఎక్కిన వారంలోనే ప్రజావేదిక కూల్చాడు. ఆ తర్వాత మూడు రాజధానులు నిర్ణయం తీసుకొని అమరావతి రాజధాని నాశనం చేశారు. రాజధాని సమస్య ఒక కులం, మతం, వ్యక్తి , ప్రాంతానికి సంబంధించింది కాదని, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిందని లక్ష్మయ్య అన్నారు. విశాఖ కర్నూలు వాసులు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అని అంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, భూములను కబ్జా చేసుకోవడానికి విశాఖలో రాజధాని ఏర్పాటు చేస్తామంటున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు తాగునీటి అందిస్తే అభివృద్ధి చెందుతాయి అన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వం శిరసావహంచాలని లక్ష్మయ్య డిమాండ్ చేశారు.

Leave a Reply