Suryaa.co.in

Andhra Pradesh

సచివాలయాల్లో జగనన్న విద్యా దీవెన జాబితాలు

అమరావతి : ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన 3వ విడత నిధులు విడుదల చేసేందుకుగాను అర్హుల జాబితాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 28న అర్హుల జాబితాను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. 28 నుంచి నవంబరు 4 వరకు సవరణలకు అవకాశం ఇస్తారు. అర్హులైన విద్యార్థులు, వారి తల్లులు ఈ నెల 27 నుంచి నవంబరు 10 వరకు బయోమెట్రిక్‌ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అర్హులు, అనర్హుల తుది జాబితాను నవంబరు 5న సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

LEAVE A RESPONSE