హిందూ మతాన్ని నాశనం చేయడమే జగన్ లక్ష్యం

– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య

అధికారం చేపట్టింది మొదలు ఇప్పటివరకూ ఏపీ ప్రజల జీవితాలతో సీఎం జగన్ రెడ్డి చెలగాటమాడుతున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. బ్రాహ్మణులను, అర్చకులను తుదముట్టించి హిందు మతాన్ని నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు.

జగన్ రెడ్డి పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుళ్ల విగ్రహాలు కూలగొట్టారు. శ్రీరాముని తల నరికారు. వెంకన్న విగ్రహం పడగొట్టారు. దుర్గమ్మ సింహాసనాలు చోరీ చేశారు. అంతర్వేది రథం తగలబెట్టారు. కాకినాడ భీమేశ్వరాలయంలో అర్చకునిపై వైసీపీ నేత దాడి ఘటన …జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం. గర్భగుడిలో అర్చకుడిని కాలితో తన్నారు.

భగవంతునికి ప్రత్యక్షరూపమైన అర్చకుడిని కాలితో తన్నారంటే భగవంతుడిని తన్నినట్టే కదా. జగన్ రెడ్డీ …నీ పాలన ఎంత దుర్మార్గంగా ఉందో అర్ధమైంది. యథా నాయకుడు-తథా క్యాడర్ అన్న చందంగా వైసీపీ నేతలు అధికార మదంతో విర్రవీగుతున్నారు. వేదాలు చదివి భగవంతుని సేవలో తరించే అర్చకులపై దాడి చేయడం, వారిని బెదిరింపులకు గురిచేయడం రాక్షసత్వమే అవుతుంది. ఎలాగూ గొడ్డలి పార్టీ రాక్షస సమూహం కాబట్టే ఇంతటి ఘోరానికి ఒడిగట్టింది.

భగవంతుని సన్నిధిలో అందరూ ఒక్కటే అనే ఇంగిత జ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేకపోవడం బాధాకరం. తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగా పోయలేదని అర్చకుడిని వైసీపీ నేత చంద్రరావు దాడి చేశాడు. చెంపపై కొట్టి కాలితో తన్నాడు. అడ్డుకోబోయిన మరో అర్చకుడిపైనా దాడి చేసి బూతులు తిట్టాడు. మీరు చెప్పినట్టు చెయ్యకపోతే కొడతారా? మరి రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసిన జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలందరినీ ప్రజలు ఏం చేయాలి? దేనితో కొట్టాలి?

విజయవాడ సత్యనారాయణ పురంలో నండూరి ఉమామహేశ్వర శర్మ గారి తల్లి స్థలాన్ని …వైసీపీ నేత గౌతం రెడ్డి కబ్జా చేశారు. వీరా ప్రజా నాయకులు? హిందూ ఆలయాలు, ఆస్తులపై పూర్తి ఆధిప్యం చెలాయించే క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం దారుణాలకు ఒడిగడుతోంది.

ఈ ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి శూన్యం.అర్చకులకు వేతనాలు పెంపు మాటే లేదు. ఆదుకోకపోగా వారిపై దాడులకు దిగుతున్నారు. కాళ్లతో తన్నడం, కొట్టడం, బూతులు తిట్టడం వంటి అపచారాలకు పాల్పడుతున్నారు. కరోనా సమయంలో విధి నిర్వహణలో చనిపోయిన అర్చకుల కుటుంబాలను కూడా జగన్ రెడ్డి ఆదుకోలేదు.

జగన్ రెడ్డి పాలనలో అర్చకులపై వరుస దాడులు:
జగన్ రెడ్డి పాలనలో హిందూ దేవాలయాలపై అర్చకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. స్వయంగా బాధిత అర్చకులు ఫిర్యాదు చేసినా ఈ ఐదేళ్లలో ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆలయ అర్చకుడి యజ్ఞోపవీతాన్ని వైసీపీ నేత యుగంధర్ తెంచేశాడు.

ఆ దారుణంపై ప్రశ్నించిన అర్చకునిపై దాడి చేశాడు. కార్తీక పౌర్ణమి సంద్భంగా కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో భక్తుల రద్దీ దృష్ట్యా టికెట్ జారీ విషయంలో గొడవ జరిగి అర్చకులపై ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దాడి చేశాడు. పలువురు వైసీపీ నేతలు అర్చకులను చెర్రాకోలుతో చితక బాదారు. నరసరావుపేట శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన ఓ వైసీపీ నేత …ఆలయ అర్చకుడు తనకు సరిగా మర్యాద చేయలేదంటూ దాడి చేశాడు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి అర్చకుడు ఆలయానికి చెందిన భూమిని సాగుచేసుకుంటున్నాడు. ఆ భూమిపై కన్నేసిన స్థానిక వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో పూజారి భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులో రామలింగాచారి అనే అర్చకుడి ఇంటిని అధికార పార్టీ నేతలు కూల్చేయడంతో ఆ బాధ తట్టుకోలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఇలాంటి ఘటనలు ఈ ఐదేళ్లలో లెక్కపెట్టలేనన్ని జరిగాయి. కొన్ని ఆలయాల్లోనైతే కారణం లేకుండానే అర్చకులపై వైసీపీ నేతలు దాడులకు దిగిన ఘటనలున్నాయి. గుంటూరు జిల్లా గోరంట్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ఆరోగ్యం బాగోలేక శెలవు అడిగితే…ఏకంగా అధికారులే అతనిపై దాడి చేసి గాయపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, అర్చకులపై వైసీపీ ప్రభుత్వ చేస్తున్న దాడులను సహించేంది లేదు. 47 రోజుల్లో జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలను చిత్తుచిత్తుగా ఓడించి రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి.

Leave a Reply