Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం

– అకాల వర్షం రైతుకి తీరని నష్టం
-విత్తనం దగ్గర నుండి పురుగుల మందుల వరకూ అన్ని రేట్లు జగన్ పాలనలో విపరీతంగా పెరిగిపోయాయి
-కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తాం
-గాజులదిన్నె లో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న మునగ తోటను పరిశీలించిన నారా లోకేష్
– కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గాజులదిన్నె విడిది కేంద్రం నుండి 87వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్

5 లక్షలు పెట్టుబడి పెట్టాను. అకాల వర్షాలతో చెట్లు మొత్తం పడిపోయాయి, పూత రాలిపోయింది. విత్తనం, ఎరువులు, పురుగుల మందులు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.5 లక్షలు పెట్టుబడి పెడితే 50 వేలు మాత్రమే వచ్చింది.గత నాలుగేళ్లుగా పంట నష్ట పరిహారం అందలేదు.రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. పంట నష్ట పరిహారం అందకపోతే వ్యవసాయం కొనసాగించలేని పరిస్థితి ఉంది.కౌలు రైతులకు ఎటువంటి సాయం అందడం లేదు. – ప్రకాశం జిల్లా నుండి వచ్చి గాజులదిన్నెలో 5 ఎకరాలు కౌలు కి తీసుకొని మునగ తోట వేసిన రైతు నాగిరెడ్డి.

లోకేష్ మాట్లాడుతూ..
జగన్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వం.అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే సిఎం జగన్ కి కనీసం సమీక్ష చేసే ఖాళీ లేదు.అసలు పంట నష్టం అంచనా కూడా వేసే పరిస్థితి లేదు.టిడిపి హయాంలో నష్టం అంచనా, పరిహారం సమయానికి అందించాం.ఉన్న క్రాప్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసాడు.విత్తనం దగ్గర నుండి పురుగుల మందుల వరకూ అన్ని రేట్లు జగన్ పాలనలో విపరీతంగా పెరిగిపోయాయి.
అకాల వర్షాలతో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం ఇప్పుడైనా మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకోవాలి.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం.భూమి యజమానులకు ఇబ్బంది లేకుండా కౌలు రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తాం.

LEAVE A RESPONSE