Suryaa.co.in

Andhra Pradesh

సీఎం రాడు..మంత్రులు లేరు..అధికారులు రారు

-చేతగాని, చేవలేని జగన్ ప్రభుత్వం
-జాబ్ క్యాలెండర్ అన్నారు.. కానీ ఇప్పుడు సాక్షి కేలండర్ అయింది
-మెగా డిఎస్సి కాదు దగా డీఎస్సీ
-ఎపిసిసి చీఫ్ షర్మిలారెడ్డి

నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన మమ్మల్ని ఈ చేతగాని, చేవలేని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం పిరికితనమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. ‘జగన్ ప్రభుత్వానికి ఏపీ చేతకాదు. ఏమీ చేయలేదు. ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం, అడ్డంగా అబద్ధాలు ఆడటం తప్ప’ అని ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే…

ఆంధ్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వానికి?

కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో అరెస్టు చేయించటం మాత్రమే ఈ ప్రభుత్వానికి వచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏం చేశారు ప్రత్యేక హోదా విషయంలో ఏం చేశారో చెప్పగలరా? అధికార, ప్రతిపక్ష పార్టీలు బానిసలుగా మారారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రశ్నిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది.

2 లక్షల 50 వేల పోస్టుల భర్తీ చేస్తా అన్న వారు, ఇప్పటికి ఎన్ని పోస్టులు ఇచ్చారో చెప్పండి?2 వేల నాలుగు వందల ఉధ్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. మెగా డీఎస్సీ ఎక్కడ. మెగా డిఎస్సి కాదు దగా డీఎస్సీ. ఉద్యోగాలు ఇచ్చే తీరు ఇదేనా? ప్రతి ఏటా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పుడు సాక్షి కేలండర్ అయింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రశ్నిస్తున్న మాపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు స్వయంగా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

వైఎస్సార్ ఆత్మ క్షోబిస్తుంది.ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుంది. వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమే. సచివాలయం లో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ కూడా లేదు. జర్నలిస్ట్ లకు స్వేచ్చ లేదు. సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట. సీఎం రాడు..మంత్రులు లేరు..అధికారులు రారు. వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం. వీళ్లకు ఏది చేతకాదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం చేతకాలేదు. ఒక అడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం పాపం.

LEAVE A RESPONSE