4 ఏళ్లలో సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచి ప్రజలపై రూ.17వేలకోట్లకు పైగా భారం వేయడమేనా జగన్ చేసిన స్ట్రీమ్ లైన్?
• విద్యుత్ డిస్కంలపై రూ. రూ.34,776కోట్ల బకాయిలు భారం మోపడమేనా స్ట్రీమ్ లైన్ చేయడమంటే?
రాష్ట్ర విద్యుత్ రంగం స్థితిగతులు, విద్యుత్ కొనుగోళ్లు, ప్రజలపై పడిన భారంపై శ్వేతపత్రం విడుదలచేయాలి
– విద్యుత్ రంగాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి సాగించిన దోపిడీ ప్రజలకు తెలియాలంటే, తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి.
• రాష్ట్ర విద్యుత్ రంగంలో జరిగిన గోల్ మాల్ పై సీబీఐ విచారణ కోరే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉన్నాయా?
• ప్రతిపక్షం ఆరోపణలుచేస్తోందా..నిజాలు చెబుతోందా తెలియాలంటే స్వతంత్రసంస్థలతో దర్యాప్తు జరిపించాలి!
• ప్రభుత్వఅధీనంలోని దర్యాప్తు సంస్థలు విచారణ ఎలాచేస్తాయో బాబాయ్ హత్యకేసులోనే చూశాం
– మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రజల్ని తప్పుడు హామీలతో నమ్మించిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, రాష్ట్ర విద్యుత్ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడని, చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 9529 మెగావాట్లుగా ఉంటే, 2019నాటికి దాన్ని19,080 మెగావాట్లకు పెంచి, ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే …
“చంద్రబాబు మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని అప్పగిస్తే, ఈ నాలుగేళ్లలో జగన్ విద్యుత్ రంగాన్ని సర్వనాశనంచేశాడు. చంద్రబాబు విద్యుత్ ఛార్జీలుపెంచకుండా, ప్రజలపై డిస్కంలపై భారం లేకుండా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి 4ఏళ్లల్లో ఒక్కమెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచకుండా, 7సార్లువిద్యుత్ ఛార్జీలుపెంచి, రూ.17,093 కోట్ల భారాన్ని ప్రజలపై, పారిశ్రామిక వేత్తలపై మోపాడు. తన అవినీతికోసం విద్యుత్ డిస్కంలకు రూ.34,776కోట్ల బకాయిల భారం మోపాడు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చినఅప్పులు, హిందుజాసంస్థకు చెల్లించేందుకు చేసిన అప్పులు రూ.37,495కోట్లు. తన కమీషన్లు, అక్రమార్జనకోసమే జగన్ ఈ విధంగా విద్యుత్ రంగాన్ని ఛిన్నాభిన్నంచేశాడు.
కేంద్రప్రభుత్వసంస్థలు యూనిట్ విద్యుత్ రూ.5కు ఇస్తుంటే, కమీషన్లకోసం జగన్ ప్రైవేట్ విద్యుత్ సంస్థలనుంచి యూనిట్ రూ.9కి కొంటున్నాడు. కేసులభయంతో సోలార్ విద్యుత్ వ్యవస్థని అదానీపరం
కేంద్రప్రభుత్వసంస్థల నుంచి యూనిట్ విద్యుత్ రూ.5లకు లభిస్తుంటే, వాటినికాదని జగన్ ప్రైవేట్ సంస్థలనుంచి యూనిట్ విద్యుత్ రూ.9లకు కొంటూ రూ.6వేలకోట్ల కమీషన్లు దండు కున్నాడు. 2014కు ముందు రూ.61వేలు ఉండే ట్రాన్స్ ఫార్మర్ ధరను జగన్ రూ.1,30,00 0లకు పెంచాడు. దానివల్ల జగన్ తనబినామీ కంపెనీ అయిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కు లభ్ది చేకూర్చాడు. వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని రైతులకు అందుబాటులో ఉంచకుండా, మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు జగన్ ప్రభుత్వంసిద్ధమైంది. స్మార్ట్ మీటర్ల బిగింపు, వాటి నిర్వహణకు మహారాష్ట్రవంటి రాష్ట్రాలు రూ.18వేలు మాత్రమే వసూలుచేస్తుంటే, జగన్ ప్రభు త్వం మాత్రం రూ.30వేల ధరను నిర్ణయించింది. రూ.13వేల కోట్లు ఖర్చుపెట్టి మరీ జగన్ ప్రభుత్వం, మీటర్ల బిగింపుకాంట్రాక్ట్ ను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి, మంత్రిపెద్దిరెడ్డి బినా మీ కంపెనీ అయిన రాఘవ కనస్ట్రక్షన్స్ కంపెనీకి కట్టబెట్టింది. అలానే తనకేసుల మాఫీకోసం జగన్ రాష్ట్రంలోని సోలార్ విద్యుత్ కాంట్రాక్ట్ లను గంపగుత్తగా అదానీకంపెనీకి అప్పచెప్పారు.
రూ.9లక్షలకోట్ల అప్పులసొమ్ము, రూ.7లక్షలకోట్ల బడ్జెట్ కేటాయింపులు కలిపి రూ.16లక్షలకోట్లలో రూ.2లక్షలకోట్లు ప్రజలకు ఖర్చుపెడితే, మిగిలిన రూ.14లక్షలకోట్ల సొమ్ము జగన్ ఖజానాకు చేరిందా?
జగన్ ప్రభుత్వం ఇప్పటికే రూ.9లక్షలకోట్ల అప్పులుచేసింది. 4ఏళ్లల్లో మూడుబడ్జెట్లు ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.7లక్షలకోట్లుగా చూపింది. అప్పులు, బడ్జెట్ కేటాయింపులు కలిపి మొత్తంగా రూ.16లక్షలకోట్లు. ప్రజలసంక్షేమానికి ఇప్పటివరకు రూ. 2లక్షలకోట్లు ఖర్చుపెట్టినట్టు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, వైసీపీనేతలు, మిగిలిన రూ.14ల లక్షలకోట్లను ఎటుదారిమళ్లించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నిధులవ్యయం, ఖర్చుల పై ప్రజలముందు వాస్తవాలు ఉంచుతూ, తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని ముఖ్య మంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలతలలు తాకట్టుపెట్టి అప్పులుతెచ్చిన జగన్, ఆ సొమ్ము ని తనఖజానాకు తరలించుకుంటుంటే ప్రజలు, బాధ్యతగల ప్రజాప్రతినిధులుగా తాము చూస్తూఊరుకోము. రాష్ట్రభవిష్యత్, ప్రజలనమ్మకం తానేనని ప్రచారంచేసుకుంటున్న జగన్మో హన్ రెడ్డికి ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేఅర్హతలేదు. జగన్ ఒక్కరోజు సీఎం పదవిలోఉన్నా అదిప్రజలకు శాపమే.
4ఏళ్లలో జగన్ విద్యుత్ రంగానికిచేసిన మేలేంటో, ప్రజలకు ఒరిగిందేమిటో వెల్లడిస్తూ ప్రభుత్వం తక్షణమే విద్యుత్ రంగస్థితిగతులపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయాలి
పరువునష్టం దావాకేసులు వేయడం.. తప్పుడుకేసులు పెట్టడం వైసీపీప్రభుత్వానికి పరిపాటి గా మారింది. రాష్ట్ర విద్యుత్ రంగం దుస్థితిపై, ప్రజలపై జగన్ వేసిన భారం, అప్పులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే ప్రజలకు వాస్తవాలుతెలుస్తాయి. ప్రభుత్వఅధీనంలోని విచారణ సంస్థల పనితీరుని ప్రజలు విశ్వసించడంలేదు. దానికి పెద్దఉదాహరణ సొంత బాబాయ్ హత్యకేసు నిందితుల్ని పట్టుకోలేని జగన్అసమర్థతే. విద్యుత్ రంగంలో తానెలాంటి తప్పుచేయకపోతే జగన్ తక్షణమే సీబీఐవిచారణ జరిపించి, తనచిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ప్రభుత్వ విద్యు త్ ఉత్పత్తి సంస్థలనుంచి విద్యుత్ కొనకుండా, ప్రైవేట్ సంస్థలనుంచి కొనడం.. సోలార్ విద్యు త్ కాంట్రాక్టులు, రైతులమోటార్లకు మీటర్లు బిగించేకాంట్రాక్ట్ లు, డిస్కంలపై పడిన అప్పుల భారం ఇలా అన్నీవ్యవహారాలపై జగన్ తక్షణమే సీబీఐ విచారణజరిపించాల్సిందే. ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోందని ఉత్తుత్తిమాటలుచెప్పడం, చిల్లరగాళ్లతో బూతులు తిట్టించడం కాదు. టీడీపీ లేవనెత్తిన అంశాలు ఆరోపణలో, వాస్తవాలో తెలియాలంటే ప్రభుత్వంలో ఉన్నవారు విచారణకు ఆదేశించి, వారిసచ్ఛీలతను నిరూపించుకోవాలి. అంతేగానీ చీప్ టాక్ టిక్స్ తో, చిల్లరమాటలతో తప్పించుకోవాలని చూడటం మంచిపద్ధతికాదు. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా, పైసావిద్యుత్ ఛార్జీ పెంచకుండా, మిగులు విద్యుత్ ఉత్పత్తి తో కూడినరాష్ట్రాన్ని చంద్రబాబు అప్పగిస్తే, జగన్మోహన్ రెడ్డి ఇలా సర్వనాశనంచేయడం ఎంతవరకు సబబు? జగన్ అవినీతికి, కమీషన్ల కక్కుర్తికి విద్యుత్ రంగం నాశనమైపోతే, తాము ప్రశ్నించకూడదా ? జగన్ విద్యుత్ రంగాన్ని ఏం స్ట్రీమ్ లైన్ చేశారోచెప్పాలి. గతప్రభుత్వం కంటే విద్యుత్ రేట్లు తగ్గించారా? గతప్రభుత్వంకంటే అదనంగా విద్యుత్ఉత్పత్తిచేశారా? రైతులకు 9గంటల నాణ్య మైన విద్యుత్ ఇచ్చారా? ఏంచేశారో చెప్పాలి.” అని కన్నా డిమాండ్ చేశారు.