Suryaa.co.in

Andhra Pradesh

జనసేనకు 3, బీజేపీకి 2 మంత్రి పదవులు?

– బాబు క్యాబినెట్‌లో జనసేన-బీజేపీ?
– కేంద్ర క్యాబినెట్‌లో టీడీపీ?
– ఏపీ నుంచి పురందేశ్వరి లేదా సీఎం రమేష్?

తాజా ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి అధికారపగ్గాలు అందుకోనుంది. ఈనెల 9న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి కూటమి పార్టీలను భాగస్వాములను చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు 20 స్థానాలు సాధించిన జనసేనకు మూడు, 7 స్థానాలు గెలిచిన బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నుంచి సుజనాచౌదరి, సత్యకుమార్‌కు క్యాబినెట్‌లో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయే క్యాబినెట్‌లో టీడీపీకి 2 నుంచి 3 కేంద్రమంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎంపి సీఎం రమేష్‌లలో ఒకరికి కేంద్రమంత్రి పదవి లభించవచ్చుంటున్నారు.

LEAVE A RESPONSE