– ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశం
– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో భేటీ అయి బిజెపికి పూర్తి మద్దతు ప్రకటించారు.
రెండు పార్టీల నాయకులు రేపు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ భవిష్యత్ కార్యాచరణను వివరించనున్నారు. హైదరాబాద్ లోని సాగర్ సొసైటీలో జరిగిన ఈ భేటీలో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తో పాటు రెండు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీ జనసేన అధ్యక్షులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జరిగినట్టు నాయకులు తెలిపారు