హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్, సీనియర్ నాయకులు ఆశీస్ కుమార్ యాదవ్, పుస్తె శ్రీకాంత్ తదితర ప్రముఖులతో కలిసి యూసఫ్ గూడలో మంగళవారం సాయంత్రం కాలినడకన విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఎంపీ రవిచంద్ర, పద్మారావు గౌడ్, ఆశీస్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ లు పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో వెంట రాగా యూసఫ్ గూడ డివిజన్ లక్ష్మీనరసింహ నగర్, కృష్ణానగర్ తదితర చోట్ల పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గల్లీ గల్లీ తిరుగుతూ ఇంటింటికి,షాపుల వద్దకు వెళ్లి గోడలు,గేట్లకు స్టికర్స్ అంటిస్తూ,కరపత్రాలు పంచుతూ, నమూనా ఇవీఏంలలో 3వ నంబరులో ఉన్న బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓట్లు వేసి విజయం చేకూర్చాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కార్పోరేటర్ హేమ,పార్టీ సీనియర్ నాయకులు వాసాల వెంకటేష్, పర్వతం సతీష్, పవన్ రెడ్డి, మీర్ రహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.