Suryaa.co.in

Features

జనవరి 1.. ఒక అవగహన

జాన్యూఅరి(జనవరి) 1 నుంచి డిసెంబర్ 31 వఱకూ ఉన్న క్యాలెండర్ ఒక Civil calendar. ఇది‌‌ Solar year, Siderial year, Lunar year కాదు.‌ దీనికి ఖగోళపరమైన ప్రాతిపదిక లేదు. Encyclopedia of Britanica ఈ నిజాన్ని స్పష్టంగా చెబుతోంది. ఈ వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం (BCE) 45వ సంవత్సరం నుంచి ఈ civil calender చలామణిలో కొచ్చింది‌.

ఏ కారణంవల్లా అర్థరాత్రి 12.01 కి రోజు మారదు. Solar day, Lunar day, Sidereal day ఏదీ కూడా అర్థరాత్రి మొదలవదు. మనం అనుసరిస్తున్నది Civil day. దీనికీ భౌతికమైన ప్రాతిపదిక లేదు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న రోజు, నెల, సంవత్సరాలు సౌకర్యార్థమైన వాడుక కోసం ఏర్పఱుచుకున్నవి (Convention of convenience).

రోజు అనేది సూర్యోదయం తోనే మొదలవుతుంది. ఒక పగలు, ఒక రాత్రి కలిసి ఒక రోజు అవుతుంది. అర్థరాత్రిలో రోజు ఎలా మొదలవుతుంది? మొదలవదు.

ఒకప్పుడు ఈజిప్ట్ దేశంలో 10 రోజుల వారం ఉండేది. గ్ర్రీక్ దేశంలో 10 నెలల సంవత్సరాన్ని పాటించేవారు. ఆ తరువాత జాన్యూఅరి, ఫెబ్రుఅరి(ఫిబ్రవరి) లను కలిపి 12 నెలల సంవత్సరం చేశారు. గ్రీక్ ప్రజలకు ‘జేనస్’ ఆది దేవత. మనకు వినాయకుడు లాగా. కనుక ఆ జేనస్ పేరుతో ఉన్న 11వ జాన్యూఅరి నెలను మొదటి నెలగా చేశారు.

ప్రస్తుతం 9 వ నెలగా ఉన్న సెప్టెంబర్ నెల ఒకప్పుడు 7 వ నెలగా ఉండేది. సప్త-అంబర్ 7వ ఆకాశం అన్నదాన్ని సూచిస్తోంది. అలాగే అష్ట- అంబర్- అక్టోబర్, నవ-అంబర్ – నవంబర్, దశ-అంబర్- డిసెంబర్. ఇతర నెలల పేర్లు కూడా ఇలాంటి అర్థాలతోనే ఉండేవి. కాలక్రమేణా వేర్వేఱు కారణాల వల్ల వాటి పేర్లు మారాయి. జూలై అన్నది జూలియస్ సీసర్ పేరుతోనూ, ఆగష్ట్ నెల అగస్టస్ పేరుతోనూ మార్పు చెందాయి.

12×30= 360 రోజులు, ఇంకా 5 రోజులు కావాలి కనుక కొన్ని నెలలకు 31 రోజులు చేశారు. వీటికి ఏ ప్రాతిపదికా లేదు.
మనం అనుసరిస్తున్న ఈ గ్రెగోరియన్ కాలండర్ సౌకర్యం కోసం ఏ ఖగోళ, భౌతిక ప్రాతిపదిక లేకుండా ఏర్పఱుచుకున్నదే. దీన్ని ఎప్పటికీ ఒక Civil calendar గానే పరిగణించాలి.

365.25 రోజులు ఒక సంవత్సరానికి అని మనం చదివిందే. కానీ నిజానికి ఒక సంవత్సరానికి 365.2422 (365.2425 కాదు) రోజులు.

వ్యావహారిక శకానికి ముందు (BCE) 45వ సంవత్సరం నుండీ ఈ గ్రెగరిఅన్ కాలండర్ వాడుకలో ఉంది. రోమన్ రిపబ్లిక్ కాలండర్ దీనికి మూలం. రోమన్ రిపబ్లిక్ కాలండర్‌లో అప్పట్లో ఒక గ్రీక్ చాంద్రమాన కాలండర్ ఆధారం అయి ఉండచ్చని The new encyclopaedia Britanica (volume 7) తెలియజేస్తోంది.

రోమన్ కాలండర్‌లో 10 నెలల సంవత్సరమే ఉండేది. మార్చ్ నెల మొదటి నెలగా ఉండేది. జాన్యుఅరి‌ (January)ని 11వ నెలగానూ, ఫెబ్రుఅరి (February)ని 12వ నెలగానూ వ్యావహారిక శకానికి పూర్వం (BC)650వ‌ సంవత్సరంలో కలిపారు. వ్యావహారిక శకానికి ముందు (BCE) 45వ సంవత్సరానికి ముందు 46 లో సంవత్సరానికి 445 రోజులున్నాయి.

1582లో స్కాట్‌లండ్ (Scotland) లో పొప్ గ్రెగరి XIII (Pope Gregory) ఈ కాలండర్‌ను వాడుకలోకి తీసుకురావడం జరిగింది. అందువల్ల దీనికి గ్రెగరిఅన్ కాలండర్ అనే పేరు వచ్చింది. 1582లో అక్టోబర్ 5వ తేదిని 15గా మార్చారు. 1752లో ఇంగ్లండ్ ఈ కాలండర్‌ను తీసుకుని అనుసరించడం మొదలు పెట్టింది. 1752లో ఈ క్యాలెండర్ లో సెప్టంబర్ 3 ను సెప్టెంబర్ 14 గా మార్చి 11 రోజులను మినహాయించారు.

అంటే 1753 జాన్యూఅరి 1, 11 రోజుల ముందు వచ్చింది. అప్పటి నుంచి ఇవాళ్టి దాకా ఏ మార్పూ లేకుండా కొనసాగుతోంది. 1752, జాన్యూఅరికి 1753 జాన్యూఅరికి తేడా ఉంది. ఇది మన అధిక మాసాలలా ఖగోళ అధారిత వ్యత్యాసం కాదు. 1582 లోనూ అక్టోబర్ 4 ను 15 గా మార్చారు.
నిజానికి ఒక రోజుకు ఖచ్చితంగా 24 గంటలు కాదు. తేడా ఉంటుంది. ఒక వారం రోజుల పాటు మనం సూర్యోదయ సమయాలను గమనిస్తే ఈ విషయం తెలిసిపోతుంది.

కాల గమనం మనం తయారు చేసుకున్న గడియారం కాదు. యాంత్రికంగా నడవడానికి. ఉగాదిలాగా, విషులాగా జాన్యూఅరి 1 లేదా సంవత్సరాదికి ఖగోళ, భౌతిక ప్రాతిపదికలు లేవు.‌ అది నిజమైనఆం గ్ల సంవత్సరాది కాదు.
జాన్యూఅరి 1 మనం అలవాటుపడ్డ కాలండర్ ఆరంభం రోజు మాత్రమే. ఒక సివిల్ సంవత్సరానికి అది ఆరంభం అంతే. జాన్యూఅరి 1 సంవత్సర ఆరంభం అనుకుంటున్న పిచ్చితనాన్ని ‘చదువు’తో నయం చేసుకోవాలి. తమను తాము ఉన్నతంగా ఊహించుకుంటున్న యూరప్ దేశాలు జాన్యూఅరి 1 సంవత్సరారంభ ఉత్సవం అన్న పిచ్చితనాన్ని విడనాడాలి.

– రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE