Home » జయహో బీసీ.. జయ జయహో జగన్

జయహో బీసీ.. జయ జయహో జగన్

– బీసీల ఆత్మబంధువు వైఎస్ జగన్
– బీసీల పట్ల రాబందు చంద్రబాబు
– బీసీల తోకలు కత్తిరిస్తానంటే.. బాబు పిలకనే బీసీలు కత్తిరించారు
– సంస్కర్తలా రాష్ట్రంలో సామాజిక విప్లవం తెస్తున్న సీఎంజగన్
– జడ్జిలుగా బీసీలు పనికిరారన్న టీడీపీకి, 2024లో బీసీలు సమాధి కడతారు
– 2024 ఎన్నికల్లో బీసీల దమ్మేంటో చూపిస్తాం
– నాలుగు గీసుకునే పదవులు అంటే.. అచ్చెన్న, అయ్యన్నలకు టంగ్ తెగుద్ది..
– బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వెల్లడి

విజయవాడ: “జయహో బీసీ – వెనుకబడిన కులాలే వెన్నెముక” అన్న నినాదంతో విజయవాడలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన బీసీల మహాసభ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఓ పండుగ వాతావరణం కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది బీసీ ప్రజాప్రతినిధులతో బెజవాడలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడింది. జయహో బీసీ నినాదం.. విజయవాడలో హోరెత్తింది. చిత్తూరు నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్ని జిల్లాల నుంచి దాదాపు 85 వేల మంది బీసీ ప్రతినిధులు ఈ సభకు హాజరై జయహో బీసీ- జయహో జగనన్న అంటూ నినదించారు. గ్రామ పంచాయతీలోని వార్డు స్థాయి సభ్యుడి నుంచి రాజ్యసభ సభ్యుల వరకూ సుమారు 85 వేల మంది ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. జయహో బీసీ- జై జగన్, జయహో జగన్.. అన్న నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది.

గతంలో చంద్రబాబు ప్రభుత్వం- బీసీలకు ఇస్త్రీ పెట్టెలు, కత్తెర పెట్టెలు తాయిలాలుగా ఇస్తే… బీసీల ఆత్మబంధువు వైఎస్‌ జగన్‌ మాత్రం అన్ని రంగాల్లో బీసీలను ఉన్నత స్థాయికి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని బీసీ మహాసభలో వక్తలు కొనియాడారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకునే రోజులy2 నుంచి బీసీలు రాజ్యాధికారం చేపట్టే రోజులకు వచ్చామని, ఇదంతా ఒక సంఘ సంస్కర్తగా నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమం-అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమైందని పలువురు బీసీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.

175కు 175 స్థానాల్లోనూ ఆఖండ విజయం సాధించి, వైయస్ఆర్ సీపీని గెలిపించి జగన్ కి కానుకగా ఇస్తామని వక్తలు మాట్లాడారు. రాష్ట్రంలోని బీసీలంతా ఎప్పుడో టీడీపీకి దూరమయ్యారని, ఆ పార్టీ డీఎన్ ఏలో ఉంది చంద్రబాబు సామాజికవర్గంలోని కొద్దిమందే తప్ప మరోవర్గంవారెవరూ లేరన్నారు. చంద్రబాబు మాయమాటలను బీసీలెవరూ నమ్మరన్నారు. బీసీ మహా సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు.

బీసీలు వెనుకబడిన కులాలు కాదని, వెన్నెముక కులాలని ఆయన అన్నారు. బీసీలకు రాజ్యాధికారంతో పాటు ఆ వర్గాల సమగ్రాభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని సిఎం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముందుగా మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. జయహో బీసీ మహాసభ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ వి. విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రికి స్వాగతం పలికి, వేదికపైకి తెచ్చారు. సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.జయహో బీసీ సభలో వక్తలు మాట్లాడుతూ ఏమన్నారంటే.. వారి మాటల్లోనే…

తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్‌ః
బీసీలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కి ధన్యవాదాలు. చరిత్ర తెలియని చంద్రబాబు లాంటి వాళ్లు బీసీలకు తోకలు కత్తిరిస్తామంటున్నారు…ఒక్కసారి పురాణాల్లో శ్రీకృష్ణుడు నుంచి చూసుకుంటే అందరూ బీసీలే. బీసీలకు తెలివితేటలు లేవు…బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లేఖలు రాసిన వాళ్లు మళ్లీ మారు వేషాల్లో మన దగ్గరకు వస్తున్నారు…తస్మాత్‌ జాగ్రత్త. బీసీలకు తెలివితేటలు ఉన్నాయో లేదో…బీసీల తఢాకా ఏంటో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు చూస్తాడు. చంద్రబాబు తోకలు కత్తిరిస్తాను అంటే 2019 ఎన్నికల్లో ఆయనకు పిలకలు కత్తిరించి, గుండు గీయించిన పరిస్థితిని గుర్తుంచుకోవాలి. అచ్చెన్నాయుడు బీసీల పదవులు నాలుక గీసుకోడానికి కూడా పనికి రావు అంటున్నాడు…‘‘. పనికిరావని అచ్చెన్నాయుడు పొరపాటున నాలుక గీసుకునే ప్రయత్నం చేస్తే…..నీ టంగ్‌ తెగుద్ది అన్నది గుర్తుంచుకోవాలి. రాబోయే ఎన్నికల్లో ఈ బీసీలు చరిత్రగతిని తిరగరాస్తారు.

బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సిఎంః
బీసీ డిక్లరేషన్‌ ద్వారా ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనలో బీసీలంతా క్షేమంగా ఉన్నారు. బీసీలకు పెద్ద పీట వేసిన నాయకత్వాన్ని బీసీలంతా బలపరచాలి. మోసపు మాటలు చెప్పే చంద్రబాబులాంటి వారిని నమ్మొద్దని ప్రజల్ని చైతన్యవంతులుగా చేయాలి.

సభాధ్యక్షుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తిః
బీసీలకు రాజకీయ సాధికారికత అందించిన నాయకుడు వైఎస్‌ జగన్‌. దేశ చరిత్రలో ఇంత మంది బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు ఎప్పుడూ, ఎక్కడా లేవు. కింది స్థాయిలో ఉన్న గ్రామ పంచాయతీల వార్డు సభ్యుల నుంచి శాసన సభాపతి వరకూ, రాజ్యసభ సభ్యుల వరకూ ఎంతో మందికి రాజ్యాధికారం దక్కిందంటే అది బీసీల ఆత్మబంధువు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వల్లనే. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెనుకబడిన కులాలకు వెన్నెముకగా పనిచేస్తుంది. ఏలూరులో జరిపిన బీసీ గర్జన సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో బీసీల అభ్యున్నతికి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇదే. అప్పటి వరకూ టీడీపీ కబంధ హస్తాల్లో ఉన్న బీసీలు వాస్తవాలు తెలుసుకుని వైఎస్సార్సీపీ జెండా ఎత్తుకున్నారు. వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర ద్వారా బీసీల ఆర్ధిక స్థితిగతులు, విద్యా ప్రమాణాలు, సాంఘిక పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేశారు. సంచార జాతులను కూడా గుర్తించిన నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి . జగన్ గారి పరిపాలనలో – బీసీల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. బీసీలను బ్యాక్‌ వర్డ్‌ కులాలుగా కాకుండా…బ్యాక్‌ బోన్‌ వర్గాలు అని నిరూపించి, వారి అభ్యున్నతికి జగన్ బాటలు వేశారు.

ఆర్‌ కృష్ణయ్య, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులుః
ఈ సభకు వచ్చింది కార్యకర్తలు కాదు… 85 వేల మంది ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు మాత్రమే. వీళ్లందరినీ తయారు చేసింది మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి . బీసీ ఉద్యమనేతగా నేను బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేసినా కానీ… బీసీల వాటా బీసీలకు ఇస్తానని చేసి చూపించిన దమ్మున్న నాయకుడు మాత్రం వైఎస్‌ జగన్‌. రాజకీయాల్లో, బడ్జెట్‌లో, విద్యలో…ఇలా అనేక రంగాల్లో బీసీలకు 50 శాతం వాటా ఇచ్చి చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. బీసీలకు ఆత్మగౌరవంలో కూడా వాటా ఇచ్చాడు.

దేశంలోనే మొట్టమొదటి సారిగా బీసీల వాటా బీసీలకు ఇచ్చిన దమ్మున్న నాయకుడు, సామాజిక సంస్కర్త  వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. రాష్ట్రానికి 24 మంత్రిపదవులు మాత్రమే ఉంటే వాటిలో 11 పదవులు బీసీలకు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రికే చెందుతుంది. నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ…ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాత్రమే 11 మందికి మంత్రి పదవులు ఇచ్చారు. అదీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాదు..కేవలం ఇంత చిన్న రాష్ట్రంలోనే 11 మందికి స్థానం కల్పించడంy3 సామాన్యమైన విషయం కాదు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుంటే…సుప్రీం కోర్టు 20 శాతం రిజర్వేషన్‌ ఇచ్చింది. అయితే ఒకే ఒక్క జగన్‌ మాత్రం పార్టీ పరంగా 44 శాతం మేర బీసీలకే రిజర్వేషన్లు ఇచ్చారు. అలా ఇవ్వబట్టే ఇక్కడికి వచ్చిన వారంతా నాయకులయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాజకీయ నాయకుడు కాదు…సంఘ సంస్కర్త…సమాజంలో అణగారిన వర్గాలు, దోపిడీకి, అణచివేతకు గురవుతున్న బీసీలకు విద్య ద్వారా సామాజిక ఎదుగుదలకు తోడ్పడ్డారు.

చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సమాచార శాఖ మంత్రిః
జయహో బీసీ అని జగనన్న అంటే…జయహో జగనన్న అని బీసీలంతా అంటున్నారు. బీసీల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్న నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌. ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పెద్ద భూతం. బీసీలను వాడుకుని వదిలేసిన దుర్మార్గుడు. బీసీ మంత్రులకు అధికారాలు లేవన్న చంద్రబాబు ఒక్కసారి ఈ సభవైపు చూడాలి…మా బీసీ నాయకుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సుమారు 16 వేల కోట్లు బీసీ విద్యార్థుల కోసం ఖర్చు పెడుతున్నాడు. మరో బీసీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మా బీసీలకు 50 శాతం రేషన్‌ కార్డుల ద్వారా బియ్యం అందిస్తున్నాడు. ఇలా 85 వేల మంది బీసీ ప్రజాప్రతినిధులు సేవలందిస్తుంటే చంద్రబాబుకు మాత్రం అవేమీ కనిపిచడం లేదు. నిజం నిత్యం ప్రచారంలో లేకపోతే… అబద్దం ఎప్పుడూ నిజమైపోదన్న విషయం చంద్రబాబు గుర్తించాలి. నిజమంటే జగన్‌…జగన్‌ అంటే నిజం…అబద్ధం అంటే చంద్రబాబునాయుడు. ఇన్నాళ్లు బీసీల వెనుకబాటుకు కారకుడు చంద్రబాబే. ఆయన తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా కనీసం బీసీలకు ఫీజ్‌ రీఇంబర్స్‌మెంట్‌ పథకం పెట్టి విద్యను అందించి ఉంటే అగ్రవర్ణాలకు దీటుగా ఇప్పటికే బీసీలు ఎదిగి ఉండేవారు. చంద్రబాబు తన హయాంలో బీసీలు జడ్జిలుగా పనికిరాడన్నాడు…ఎమ్మెల్యేలుగా గెలవలేరని రాజ్యాధికారం ఇవ్వలేదు. తోకలు కత్తిరిస్తాను..తోలు తీస్తాను అన్న చంద్రబాబుకు బీసీలు సరైన గుణపాఠం చెప్పారు.

ఉషశ్రీ చరణ్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిః
మహాత్మ జ్యోతీరావు పూలే కలలుగన్న సమాజాన్ని నిజం చేస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పనిచేస్తున్నారు. బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో సైతం 11 మంది బీసీలకు మంత్రిపదవులు ఎక్కడా ఇవ్వలేదు. 56 బీసీ కార్పొరేషన్లతో పాటు అనేక కమిటీల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇచ్చిన నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌. ప్రతి కులంలోనూ కులవృత్తి బాగుండాలి.. వారు కుటుంబాలు బాగుండాలి అని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు బీసీలు జడ్జిలుగా పనికి రారన్నట్లే.. బీసీలకు టీడీపీ పనికిరాదని, ప్రతి ఒక్క బీసీ కూడా వచ్చే ఎన్నికల్లో తిరుగులేని జడ్జిమెంట్‌ ఇవ్వాలి. గడప గడపకు జగనన్న సందేశాన్ని తీసుకెళ్లడంలో బీసీలంతా సమైఖ్యంగా పనిచేయాలి. వెనుకబడి కులాల వెనుక వెన్నెముకగా నిలిచిన జగనన్నను మనం గెలిపించుకోవాలి.

జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రిః
సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైయస్‌ జగన్‌ అయితే నయవంచకుడు చంద్రబాబు. నయవంచకులతో జరుగుతున్న యుద్ధానికి బలహీనవర్గాలమంతా సిద్ధంగా ఉండాలి. 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ జెండా ఎగురవేసి బీసీల సత్తా చాటాల్సిన సమయం వచ్చేసింది. 85 వేల మంది బలహీనవర్గాల ప్రజాప్రతినిధుల సైన్యాన్ని తయారు చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు పాదాభివందనం. విలువలు, విశ్వసనీయత గల నాయకుడికి…వెన్నుపోటు, కుట్రదారుడికి మధ్య జరిగే యుద్ధానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. సామాజిక న్యాయ నిర్మాత సీఎం వైయస్‌ జగన్‌ అయితే కేవలం తన సామాజికవర్గ నిర్మాతగా చంద్రబాబు నిలిచారు. కుట్రలు, కుతంత్రాలతో 14 సంవత్సరాల పాటు బీసీలను బానిసలుగా చేసిన చంద్రబాబుకు, బీసీలను బలవంతులను చేసిన జగనన్నకు ఏ మాత్రం పోలికలేదు. 139 కులాలు ఉంటాయని బీసీలుగా ఉన్న మనకే తెలియదు. ఈరోజు మనందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, నేను మీ ఆత్మబంధువుగా, మీ వెన్నంటే ఉంటాను.. మిమ్మల్ని బ్యాక్‌బోన్‌ క్లాసులుగా చేస్తానని చెప్పి, ఆచరణలో చేసి చూపిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు బీసీలంతా రుణపడి ఉంటారు. టీడీపీకి చెందిన అయ్యన్నపాత్రుడు 175 స్థానాలు వస్తాయని చెబుతున్నాడు. ఏం పీకారని టీడీపీకి 175 స్థానాలు వస్తాయి..? 2019 ఎన్నికల్లో టీడీపీని పీకిపాతరేశాం. 2024 ఎన్నికల్లో మా బలహీనవర్గాల దమ్ము ఏంటో చూపిస్తాం. 175 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ జెండా ఎగురవేసేలా ప్రతీ ఒక్కరూ కంకణబద్ధులవుదాం. జగనన్న కోసం మనందరం సిద్ధంగా ఉండాలి. మూడున్నర సంవత్సరాల్లోనే బీసీలను బలవంతులను చేసిన జగనన్న వెంట నడవడానికి మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం. జగనన్న చెప్పినట్టుగా 175 స్థానాల్లో గెలిచి బలహీనవర్గాల సత్తా చాటుదాం.

కారుమూరి నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రిః
ఇక్కడకు వచ్చిన వారిలో 85 వేల మంది వివిధ ప్రభుత్వ పదవుల్లో ఉన్న వాళ్లే వచ్చారు…ఇక్కడకు రాని సైనికులు లక్షలాది మంది ఇంకా ఉన్నారని చంద్రబాబు గుర్తించాలి. చంద్రబాబుకు బీసీలమని చెప్పుకుంటూ మాట్లాడుతున్న నలుగురైదుగురు నేతలు మాత్రమే మిగిలారు. బీసీలకు ఆత్మగౌరవాన్నిచ్చిన గొప్ప మనసున్న నాయకుడు వైఎస్‌ జగన్‌. ఐటీని కనిపెట్టానని నిత్యం గొప్పలు చెప్పుకునే చంద్రబాబు మాత్రం తన కొడుకును పప్పుని చేశాడు. రాష్ట్రంలో దుర్మార్గాలు చేయడానికి దుష్టచతుష్టయం సిద్దమైంది…బీసీలంతా సైనికుల్లా నిలిచి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక శాఖ మంత్రిః
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, తోలు తీస్తా…తొక్క తీస్తా..బీసీలు జడ్జిలుగా పనికిరారని అన్న రోజులు చూశాం. ఈ రోజు అక్కున చేర్చుకుని, పక్కన కూర్చోబెట్టుకున్న 85 వేల మంది వివిధ హోదాల్లో రాజ్యాంగ బద్ధమైన రాజ్యాధికారం ఇచ్చిన మనసున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను చూస్తున్నాం. బీసీలు ఎప్పుడూ పాలితులుగానే ఉండకూడదని, పాలకులుగా మారాలని కలలు కని, వాటిని సాకారం చేసిన నాయకుడు మన జగనన్న. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పేదవాడికి విద్యా వైద్యంతో పాటు అనేక సంక్షేమాలు అందించాలనే ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. మీరిచ్చిన ఇస్త్రీ పెట్టెలు, కత్తెర పెట్టెల వల్ల మా జీవితాలు మారడం లేదని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. మా పిల్లలకు విద్యాకానుక, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య వంటి పథకాలు ఇచ్చిన మా జీవితాలను మారుస్తున్నారని గుర్తించాలి.

విడుదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిః
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతి బీసీకి ఆత్మగౌరవం లభించిందంటే దానికి కారణం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి . బీసీలంతా నేడు మహాత్మా జ్యోతిరావు పూలేతో పాటు  వైఎస్‌ జగన్‌ ని కూడా గుర్తుచేసుకుంటున్నారు. సామాజిక విప్లవం రావాలని మహానుభావులు ఏదైతే ఆశించారో దాన్ని నిజం చేసి చూపించిన నేత జగనన్న. బీసీలకు బ్యాక్‌ బోన్‌గా ఉండి జగనన్న నడిపిస్తున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే బీసీలకూ వెన్నుపోటు పొడిచారు. తోకలు కత్తిరిస్తానన్నాడు…అంతు తేలుస్తా అంటూ బీసీలను అవమానించాడు. కేవలం ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. రాజ్యసభలో సగానికి పైగా సీట్లను బీసీలకు ఇచ్చిన నాయకుడు మన జగనన్న అయితే…బీసీల పట్ల రాబందువు..బీసీల ద్రోహి చంద్రబాబు. ఒక ఫెయిల్యూర్‌ సిఎం చంద్రబాబు, మరో ఫెయిల్యూర్‌ పవన్‌ కళ్యాణ్‌ తో పాటు ఎంత మంది దుష్టచతుష్టయం కలిసి వచ్చినా.. జగనన్న గెలుపును మాత్రం ఎవ్వరూ ఆపలేరు.

గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రిః
ఈ రోజు బీసీల పండుగ. 85 వేల మంది బీసీ నేతల తలరాతలు మార్చిన నాయకుడు మన జగనన్న. బీసీలకు డీబీటీ- నాన్ డీబీటీ ద్వారానే రూ. 1.70 లక్షల కోట్ల సంక్షేమ పథకాలకు ఖర్చు చేశారు. ఈ డబ్బంతా ఇచ్చింది ముఖ్యమంత్రి జగనన్న. అలాంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ ఇంకా ముప్పై ఏళ్లు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం సువర్ణయుగంగా మారుతుందనడం సందేహం లేదు. బీసీ సోదరులు అంతా బీసీల ఆత్మబంధువు శ్రీ వైఎస్‌ జగన్‌ గారి వెంటే నడుస్తారు.

అనిల్‌ కుమార్‌ యాదవ్, మాజీ మంత్రిః
బీసీలకు ఇన్ని పదవులు ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు శ్రీ వైఎస్‌ జగన్‌. 18 లక్షల మంది మహిళలకు చేయూత, 20 లక్షల మంది మహిళలకు అమ్మ ఒడి వంటి అనేక పథకాలు అందించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌. ఇది ట్రాక్‌ రికార్డ్‌ కాదు…ఆల్‌ టైం రికార్డ్‌…గా జగనన్న లిఖించిన చరిత్ర. ఇదే సభ నుంచి చంద్రబాబుకు చెప్తున్నా…‘ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ ఫలాలను బీసీలకు అందించిన జగనన్న డీఎన్‌ఏలో బీసీలున్నారా..? చంద్రబాబు డీఎన్‌ఏలో బీసీలు ఉన్నారా..? అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలి. కుళ్లు కుతంత్రం, మోసం, కుట్ర తప్ప చంద్రబాబు వద్ద ఏమీలేదు. గొర్రెలు కాసుకునేవారు, బర్రెలుy1 కాసుకునే వారు మంత్రులవుతారా అని మాట్లాడిన చరిత్ర టీడీపీది అయితే…అదే కులాల నుంచి రాజ్యసభకు పంపిన చరిత్ర జగనన్నది. మత్స్యకారులను తోలుతీస్తా అని చంద్రబాబు అంటే..అదే మత్స్యకారులను రాజ్యసభకు పంపిన ఘనత జగనన్నది. కృష్ణుడిలో బుద్ధిబలం, అర్జునిడిలో ఉన్న వీరత్వం, కర్ణుడిలోని కరుణ, భీముడిలోని ధైర్యం, ధర్మరాజులోని ధర్మం, చాణుక్యుడిలోని రాజనీతి కలబోసుకున్న నేత వైఎస్‌ జగన్‌. చంద్రబాబు గుండెల్లో బీసీలు ఎలా ఉన్నారంటే.. రాత్రింబవళ్లు ఆయన గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. బెజవాడ కనగదుర్గమ్మ వారి పాదాల సాక్షిగా జరుగుతున్న ఈ సభ సాక్షిగా చెప్తున్నాం…ఊరూ వాడా తిరుగుతాం..వై నాట్‌ 175 అంటూ బీసీల గుండె చప్పుడు వినిపిస్తాం.

సభకు హాజరైన బీసీ ప్రతినిధుల కోసం ప్రత్యేకమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. 9రకాలతో అల్పాహారం, 21 రకాల వంటకాలతో భోజనాలు వడ్డించారు. బీసీ మహాసభలో ఇంకా రాజ్యసభ సభ్యులు పిల్లి సుబాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ,  బీదా మస్తాన్‌ రావు, ఎంపీ మార్గాని భరత్, బీసీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, గ్రామ స్థాయి వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు వరకు వివిధ పదవుల్లో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply