మద్యం సేవించి సోయలేకుండా మాట్లాడే వ్యక్తి జోగి రమేష్

0
37

మాజీ మంత్రి జవహర్

జోగి రమేష్ తన స్థాయిని మరిచి అన్న ఎన్టీఆర్ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలుతున్నాడు. మద్యం సేవించి సోయలేకుండా మాట్లాడే వ్యక్తి జోగి రమేష్. చరిత్ర ఉన్నంత వరకు అన్న ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.తండ్రి శవం ముక్కులు కూడా పోగేయకుండానే చిద్విలాసంతో ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి ఎవరో జోగి రమేష్ గుర్తిచేసుకుంటే మంచిది. జోగి రమేష్ కు మతిమరపు వచ్చినట్లు ఉంది. గతంలో జరిగిన ఏ అంశాలను ప్రస్తావించకుండా కేవలం అన్నని, అన్నకుటుంబాన్ని తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టాడు. జోగి రమేష్ నాటి పరిస్థితులు గుర్తించుకుంటే చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పొడవలేదని తెలుస్తుంది. ఆరోజు ఉన్న పరిస్థితుల్లో పార్టీని రక్షించుకోవడానికి అన్న కుటుంబ సభ్యలైన హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకున్నారు. జోగిలా తాగి ఊగే వాళ్లను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పావురాల గుట్టలో శవం దొరక్క ముందే సంతకాలు ఎవరు సేకరించారో జోగి గుర్తించికోవాలి