(చాకిరేవు)
జోగి రమేష్ కథ! కల్తీ దందాలో బుక్ అయ్యేలా దోస్త్ లీకులు!
ఆఫ్రికా స్టైల్ క్యాపిటల్ సిటీస్ ఆదర్శం అంటూ అసెంబ్లీలో చెప్పేది వైకాపా. ఇబ్రహీంపట్నంలో గత వైకాపా పాలనలో ఆఫ్రికా స్టైల్ కల్తీ లిక్కర్ ట్రయిల్ రన్ వేసి, బాగా ఆర్జించారు.
జనార్దన్ రావు చెప్పినదాన్ని బట్టి చూస్తే, జోగి రమేష్ గారు ఏకంగా అంతర్జాతీయ ‘లిక్కర్ డాన్’ లెవెల్‌కు ఎదిగిపోయినట్టు ఉన్నారు. తరువాత అదే ‘దోస్త్’తో ములకలచెరువులో నకిలీ దందా చేయిస్తూ, “భయం లేదురా, మనమేం ఆషామాషీ కాదు, ఆర్థికంగా చితికిపోతే ఏకంగా 3 కోట్లు సాయం చేస్తా, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకో!” అని ఊరించారట. అబ్బో! ఎంతటి దార్శనికత! మనవాడు లోకల్ దందాకు పరిమితం కాకూడదని, ఆఫ్రికా లెవెల్లో ఎదగాలని కోరుకునే మంచి మనసు జోగి గారిది!
మరి ముఖ్యమంత్రి చంద్రబాబును బద్నాం చేయాలనే ‘మహత్తర లక్ష్యం’ కోసమే ఈ స్కీమ్ ప్లాన్ చేశారట. అంటే… జోగి రమేష్ గారు కేవలం రాజకీయ నాయకుడు కాదు, పక్కా “పొలిటికల్ అండ్ ప్యూర్ స్పిరిట్” మిక్సర్ అని తేలిపోయింది. కల్తీ మద్యం తయారు చేసి, అది కూటమి ప్రభుత్వం వచ్చాకే జరిగిందని ప్రచారం చేయాలనే ‘రివర్స్ స్కామ్’ ఐడియా జోగి గారిది. ఇది కదా అసలైన ‘విస్డమ్ ఆఫ్ వైసీపీ’!
పాపం జనార్ధన్ రావు! జోగి రమేష్ ప్రలోభాలకు లొంగి, ఆఫ్రికా కలలు కంటూ, ఇక్కడ డూప్లికేట్ సరుకు తయారు చేయబోతే… సౌతాఫ్రికా వెళ్లాక, అక్కడి నుంచే జోగి రమేష్ తన మనుషులతో ఈ దందా గుట్టు రట్టు చేయించాడట!
“దోస్త్… అబద్ధం ఆడకు… నేను ఎవరో నీకు తెలియదు…” అన్నట్టుగా జోగి గారు ఆడిన ఈ ‘అద్భుత దేవుని ప్రమాణాల నాటకం’ తరువాత వచ్చిన దోస్తు పక్కన చిత్రాలతో ముసుగు తొలగింది. అలా అవతల దోస్త్ పక్కన లేకపోతే తోచడం లేదని జనార్ధన్ రావు కస్టడీలో నోరు విప్పాడేమో!
మొత్తానికి, ఏ 1 జనార్ధన్ రావు, ఏ 2 జగన్ మోహన్ రావు కస్టడీలో ఉన్నారు. అధికారులు మాత్రం ‘ఆర్థిక మూలాలు, సూత్రధారుల’పై విచారణ అంటూ జోగి రమేష్ వైపే చూస్తున్నారు. జోగి రమేష్ గారూ, ఆ ఇబ్రహీంపట్నం దోస్త్ కుట్రను మీరే నోరు విప్పారు. ఆయనకు బాసు కం దోస్త్ అయిన నీ కుట్ర గుట్టును విప్పాడు.
ఇప్పుడేమంటారు? మీరు ఇచ్చిన ‘ఆఫ్రికా స్కెచ్’ నిజంగానే “ఉపయోగపడింది” కదా? కాకపోతే, అది మీ మెడకే చుట్టుకుంది! కింకర్తవ్యం, పరారీ. లేదా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు లగెత్తడం. రేపు ఆదివారం, అరెస్ట్ అయితే.. పొన్నవోలు గారికి వీకెండ్ డ్యూటీ.
ఈ ఏడాది ‘బెస్ట్ ఇంటర్నేషనల్ స్కామ్ స్కెచ్’ అవార్డు జోగి రమేష్ గారికే. Jury: దోస్త్, ములకలచెరువు, ఇబ్రహీంపట్నం & సౌతాఫ్రికా డిస్టిలరీ.