Suryaa.co.in

Andhra Pradesh

దేశం కోసం…ధర్మం కోసం…వికసిత భారత్ కోసం బిజెపిలో చేరండి

-దగ్గుబాటి పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపీ శ్రీనివాస్ అధ్యక్షతన విజయవాడ భవానిపురం శాసనసభ్యులు సుజనా చౌదరి కార్యాలయం నందు బిజెపి ఓబీసీ మోర్చా సదస్యత అభియాన్ కార్యశాల లో ముఖ్య అతిధులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇంచార్జ్ పూస రాజు పాల్గొన్నారు. ముందుగా వన మహిత్సవం సంధర్భంగా మొక్కలు నాటిన పురందేశ్వరి ఉద్యమంగా మొక్కలు నాటి పెంచాలని పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు.

దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ ప్రకారం సమూలమైన ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకి సభ్యత్వం చేయబడుతుంది 2014న కార్యకర్తలు యొక్క కృషి ఫలితంగా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది సభ్యుల్ని పార్టీలో చేర్చడం జరిగింది. 2019లో మధ్యంతర సభ్యత్వ నమోదులో కార్యక్రమంలో సాధారణంగా ఇంకొక 10% వాతనంగా తెచ్చుకోవాలి అని చెప్పి భావించి రెండున్నర కోట్ల మందిని అదనంగా చేర్చి బిజెపి అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేశారు.

కార్యకర్తల పని విధానమే బిజెపికి బలమన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా సంపూర్ణంగా అంకితమై ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియచేసి బిజెపి సిద్దాంతాలు తెలిపి సర్వ స్పర్శి సర్వ వ్యాప్తి ధ్యేయంగా పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేయాలని ఒక బిసి ప్రధానిగా నరేంద్ర మోదీ మూడవ సారి ప్రధాని అవ్వడమే కాకుండా వికసిత భారత్ కోసం పని చేస్తున్నారని బిజెపి బిసి లకు చేసిన మేలుని వివరించాలని ఒబిసి కమిషన్ చట్టభద్దత, ఓబీసీ సబ్ ప్లాన్ నిధులు, పారిశ్రామిక నిధులు, విదేశీ విద్యా,అవినీతి లేని సంక్షేమ పధకాలు ప్రజలకు వివరించాలి అన్నారు. సెప్టెంబర్ 2 సాయంత్రం 5 గంటలకు నరేంద్ర మోదీ సభ్యత్వం తీసున్నాక అందరు సభ్యత్వాలు పొంది అందరితో సభ్యత్వాలు చేయించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొని సెప్టెంబర్ 2 నుండి నలభై రోజులు జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాటానికి కార్యాచరణ చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర సభ్యత్వ ప్రముఖ్ గా కంటుబుక్త శ్రీనివాస్ సహా ప్రముఖ్ లుగా రాయలసీమ నుండి పడుకోట పద్మావతి, కృష్ణా జోనల్ నుండి బలివాడ శివకుమార్ పట్నాయక్, గోదావరి జోనల్ నుండి మోడేపల్లి నాగు, ఉత్తరాంద్ర నుండి పల్లి శ్రీనివాసులు నాయుడు లను ప్రకటించారు జిల్లాల్లో ప్రముఖులను నియమించి లక్ష్యాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE