– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను కప్పించుకోవడానికి జర్నలిస్ట్ ప్రశాంత్ ను అరెస్టు చేయడం పట్ల బిజెపి రాష్ట్ర శాఖ తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల వ్యవహారం పూర్తిగా లీకలమయం కావడంతో అప్రతిష్టను మూట కట్టుకున్నది. లీకైన విషయాన్ని బయటకు రాకుండా, లీకు విషయాన్ని బయట పెట్టిన వారిపై బిజెపి నాయకులకు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు సంబంధాలను అంటగట్టడం సరికాదు.
జర్నలిస్టులకు రాజకీయ నాయకులతో సంబంధాలు వ్యవహారికమే అన్న విషయం గుర్తించుకోవాలి. పత్రికా ప్రజాస్వామ్యం గురించి ఈ మధ్యకాలంలో టిఆర్ఎస్ నాయకులు గొప్పగా మాట్లాడిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. జర్నలిస్టుగా తన విధిని నిర్వహించిన ప్రశాంత్ ను అరెస్టు చేయడం పత్రికా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివి. తన చేత గానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నెపం మోపి బయటపడాలని చూస్తున్నది. జర్నలిస్ట్ ప్రశాంత్ తో పాటు ఇతరులను అరెస్టు చేయడం దుర్మార్గం. కార్పొరేట్లకు దాసోహమైన టిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్యులను దోషులుగా చూపెట్టి అరెస్టు చేయడానికి తీవ్రంగా నిరసిస్తున్నాం.
తెలంగాణ ప్రజానీకం టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంతో ఉన్నారన్న విషయం వాస్తవం. ఇంటర్మీడియట్ విషయాల్లో గాని టీఎస్పీఎస్సీ విషయంలో గాని పదవ తరగతి పరీక్షల విషయంలో గాని రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు దీని వెనుక ఉన్నారనేది నిఘాడమైన స్పష్టమైన వాస్తవం. ప్రజల దృష్టి మార్చడానికి చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు గ్రహిస్తున్నారు వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి. దోషులను వదిలిపెట్టి బయటకు తీసుకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేయడం జైలు పంపడం సరికాదు దీనికి తగిన మూల్యం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబ సభ్యులు అనుభవించక తప్పదు.