ప్రెస్‌అకాడమీ చైర్మన్ దేవిరెడ్డిని కలిసిన జర్నలిస్టు యూనియన్ నేతలు

విదేశీ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ని సీనియర్ పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ఏపీ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో కలసి అభినందనలు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి అంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జయరాజ్, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష్యులు చావా రవి, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష్యులు నిమ్మరాజు చలపతిరావుతో పాటు ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ లు పాల్గొని దుశ్శాలువతో సత్కరించారు. జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను కొనసాగించాలని… జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్ళాలని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ సానుకూలంగా స్పందించారు.