– పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల
– షర్మిలకు కాపు జేఏసీ వినతి పత్రం
విజయవాడ: కాపుల సమస్యలపై ఇటీవల ప్రతిపాదించిన 12 తీర్మానాలను కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్ధన్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం, పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో అందజేశారు.
రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్ధన్ వైయస్ షర్మిల కు కాపుల సమస్యలను వివరించి చెప్పగా వైయస్ షర్మిల సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాపులను అక్కున చేర్చుకున్న చరిత్ర కాంగ్రెస్ దేనని.. కాపులకు పూర్తి న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆమె అన్నారు. కాపు జేఏసీ బలపరిచిన 12 తీర్మానాలకు వైఎస్ షర్మిల సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో జే ఏ సి నాయకులు ఆకుల శ్రీనివాస్,నరహరి శెట్టి నరసింహారావు, కొండి శెట్టి రాజేంద్ర, సుంకర సాంబశివరావు (అల్లుడు), గంటా సాయి వర ప్రసాద్,చందు భావ నారాయణ, మాసా బత్తుల శ్రీనివాస్, మిరియాల శ్రీనివాసరావు, జొన్నా రాజేష్, శశి భూషణ్,పేర్ని దామోదర్, అలా తారక రామారావు, ఓటుకోలు మార్కండేయులు, తన్నీరు శివ శంకర్, లంకారాంబాబు, ఆకుల తిరుమలరావు పాల్గొన్నారు.