– నాడు జగన్‌గారిపై నిందలేసినప్పుడు ఏమైంది మీ బుద్ధి..?
– మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును దోషిగా నిర్ధారించి సీఐడీ అదుపులోకి తీసుకుంది. అరెస్టు చూపించి ఏసీబీ కోర్టు ముందుకు తీసుకెళ్లింది. అక్కడ చంద్రబాబు తరఫున హేమాహేమీ న్యాయవాదులు ఒకవైపు, సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాదులు ఎవరివాదనలు వారు వినిపించారు. చివరికి, న్యాయమూర్తి గారి తీర్పుతో ఆయన్ను రిమాండ్‌కు తరలించారు.
ప్రభుత్వం మీద, జగన్మోహన్రెడ్డి మీద టీడీపీతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి ఏవేవో నిందలేస్తున్నారు. ఏపీ సీఐడీ చేయరాని పని ఏదో చేసినట్లుగా.. జగన్ప్రభుత్వం ఏదో తమ నాయకుడ్ని కావాలని అరెస్టు చేసిందంటూ ఎవరికి వారు మాట్లాడుతున్నారు.
చంద్రబాబు అరెస్టు పట్ల ప్రజల్లో సానుభూతి లేదు. ప్రజలు ఆయన్ను నమ్మడంలేదు. ఆయన అబద్ధాలకోరు, మోసగాడు అని అందరూ విశ్వసిస్తున్నారు. ప్రజాధనాన్ని దోపిడీ చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని తేలిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
టీడీపీ, జనసేన కలిసి రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తే.. రాష్ట్రంలో ఎక్కడా ఏ ఒక్క వ్యక్తి స్వచ్ఛందంగా రోడ్డుమీదకొచ్చి మద్ధతు తెలిపే పరిస్థితిలేదు. తమ నాయకుడు చంద్రబాబు పెద్ద మహానాయకుడని మీరు చెప్పుకోవడమే గానీ ప్రజల్లో మాత్రం అలాంటి అభిప్రాయమైతే లేదని తెలిసిపోయింది.
నిన్నటిదాకా చంద్రబాబు సభలకు విపరీతంగా జనాల్ని డబ్బులిచ్చి తోలి.. ప్రజల్లో నాకెంత బలముందో చూశారా..? అంటూ విర్రవీగారు కదా..?
చంద్రబాబు కూడా ఈ స్కామ్‌పై మాట్లాడుతూ.. ఇది నాకు సంబంధంలేదు. కేబినెట్ తీర్మానించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పెట్టాం.. కాబట్టి, శాసనసభ్యులంతా దీనికి బాధ్యులని చెప్పుకొచ్చారు. అంటే, తాను చేసిన తప్పును కేబినెట్, శాసనసభ మీదకు చంద్రబాబు రుద్దే ప్రయత్నం చేశాడు.
గతంలో ఇదే కేబినెట్ నిర్ణయాలు, శాసనసభ తీర్మానాలను జగన్‌గారికి అపాదించి అవినీతి చేశారంటూ నువ్వెందుకు నిందలేశావు..? నీకో న్యాయం. ఇంకొకరికి ఇంకో న్యాయమా?