ఒక జాతి అవసరం…
ఒక నీతి అవసరం…
ఒక న్యాయ అవసరం…
ఒక బతుకు అవసరం..
??? ప్రశ్నలు
!!! ఆశ్చర్యాలు లేకుండా వచ్చారు వాళ్లంతా??!!
ఏళ్ళ పాటు తల్లడిల్లిన తెలంగాణ గుండె చప్పుడు మేమే… అంటూ ముందుకు వచ్చారు.
గుండెలే కాదు.. పల్లెలూ ఎండి పోతున్నాయని ఏకరువు పెట్టారు.
జనమంతా నమ్మారు.. జయకేతనం అయ్యారు
తెలంగాణ రాష్ట్రం గాక ముందే… రాష్ట్ర సమితి అయ్యింది.
మళ్ళీ అదే జనం రాష్ట్రం వచ్చిందనుకునే… ముందుకు నడిచి… టీఆర్ఎస్ తెలంగాణ కోసం అనుకున్నారు.
కుర్చీలోకి ఎక్కినోళ్ళకి… అవకాశాలు వచ్చాయి. దురాశలు పెరిగాయి. అంచనాలు తప్పాయి. జనం తలకిందులయ్యారు.
పరుగులో దూరం తెలియలేదు
పార్టీ పేరూ మారిపోయింది
నమ్మకం అమ్మకం అయింది
అపనమ్మకం పెరుగుతూ పోయింది
ఇంకేముంది…
యుగాలుగా వస్తున్నదే…
మనుగడ కోసం పోరాటం
ఆస్థిత్వం కోసం ఆరాటం
అయినవాళ్లు…కాని వాళ్ళు!
ప్రియమైన వాళ్లు…శత్రువులు?
ఒకటే లాజిక్…
డబ్బు శాశ్వతం కాదు…
కానీ శాశ్వతం కాని సంబంధాలన్నీ
డబ్బుతోనే!
మరణానికి చివరి పేజీలు కూడా ఆస్తులు అంతస్తులతోనే… కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం క్లైమాక్స్
ప్రస్తుతానికి… సంక్షిప్తం
– విసు
(విప్పగుంట సురేష్)