Suryaa.co.in

Andhra Pradesh

ఇది దున్నపోతు ప్రభుత్వం

– బాధితులకు నష్టపరిహారం ఏదీ?
– ఇంతమంది చనిపోయినా కళ్లు తెరవరా?
– డయేరియా మృతుల కుటుంబాలను పరామర్శించిన కన్నా

గుంటూరు : రాష్ట్రంలో ఆరోగ్యశాఖ పడకేసింది. జగన్ ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు అనారోగ్యంతో చనిపోవడం క్షమించరాని నేరమని మాజీ మంత్రి, టీడీపీ సతె్తనపల్లి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ప్రబలిన డయేరియాను అరికట్టి, ప్రజల ప్రాణాలను కాపాడటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తాతాచారి కాలనీ డయేరియా బారిన పడి మృతి చెందిన, బాధిత కుటుంబాలను కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు.

నగరంలోని అనారోగ్య పరిస్థితులు, అపరిశుభ్ర వాతావరణంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈ ప్రభుత్వానికి దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉందని విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ వైఫల్యం వల్లే 5గురు చనిపోవడంతోపాటు, 250 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని విమర్శించారు. ఇవి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని కన్నా ఆగ్రహం వక్తం చేశారు.

ఇంతవరకూ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలన్న కనీస జ్ఞానం కూడా లేని ఈ అహంకార ప్రభుత్వాన్ని, గద్దెదింపాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఎస్‌ఈ తప్పుల వల్లే ఇవి జరుగుతున్నాయని, అవినీతికి పాల్పడేందుకే ఎస్‌ఈని తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ నజీర్ అహ్మద్, గుంటూరు తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE