అరాచక శక్తి సీఎంగా ఉండటం ప్రజల దౌర్భాగ్యం

– సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జి , మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

2014 – 19 తెలుగుదేశం పార్టీలో అధికారం ఉండగా పల్నాడు ప్రాంతానికి తాగునీరు సమస్య తీర్చేందుకు.. గోదావరి పెన్నా అనుసంధానం చేసేందుకు..లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 6000వేల కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. టెండర్స్ ఫైనలైజ్ అయింది. వర్క్ కూడా స్టార్ట్ అయిన తర్వాత మనకు దురదృష్టం జగన్ మోహన్ రెడ్డి రూపంలో అరాచక శక్తి ప్రవేశించింది. విధ్వంసకుడు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ప్రజాధనాన్ని కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాసంపద మట్టిపాలయింది. అలాంటి దుర్మార్గుడిని రాష్ట్రం నుంచి తరిమివేయడం ప్రజల బాధ్యత. అరాచకశక్తి పాలకుడిగా ఉంటే అభివృద్ధి ఏవిధంగా పడకేస్తుందో చెప్పడానికి, సత్తెనపల్లి లోని ఈ దృశ్యం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి వైఫల్యాలు అన్ని జిల్లాల్లో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఇక మేలుకోవలసింది ప్రజలే.

Leave a Reply