Suryaa.co.in

Andhra Pradesh

కరో కరో జల్సా.. జనం సొమ్ముతో దర్జా

( వెంకట్)

విశాఖ సాగర తీరాన అంద చందాల రుషి కొండపై జనం కప్పం కట్టిన రూ. 500 కోట్లతో వెలసిన జల్సా ప్యాలెస్.. రాజ మహల్ ను మరిపిస్తోంది.. ఎన్నికల్లో గెలిచిన ఆనందంతో.. మాజీ సీఎం జగనయ్య ప్రేమగా కట్టించిన ఈ భవనాన్ని చూడాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కుతూహలంతో తెగ ఆరాట పడ్డారు. ఇప్పటి వరకూ ఇతరులకు నో ఎంట్రీ పేరిట సెక్యూరిటీ గార్డుల విజిల్స్ విని దూరంగా పారిపోయారు.

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుకు ప్రోటోకాల్ దక్కటంతో.. ఆదివారం ఉదయం రుషికొండపై విలాస భవనాలను వీక్షించి.. ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. ఆ ఫ్యాలెస్ లో స్నానాల గదిని చూసి.. అక్కడకు వెళ్లినోళ్లందరు మూర్చతో తూలి పోయారు. అదృష్టవశాత్తు పడ లేదు.. అందులో స్నానం చేసే బాత్ టబ్ ఖర్చు ఎంతో తెలుసా..? జస్ట్ రూ. 26 లక్షలే.. ఇందులో ఎవరు జలకాలుతారో..? కరో కరో జల్సా.. ఇదీ జనం సొమ్ముతో మాజీ సీఎం దర్జా అంటే!

LEAVE A RESPONSE