-సింగరేణి పరిస్థితి, అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలి
-రూ.20 వేల కోట్లను దారి మళ్లించి సింగరేణిని దివాళా తీస్తున్న ఘనత కేసీఆర్ దే
-త్వరలో సింగరేణి ఎన్నికలు రాబోతుండటంతోనే టీఆర్ఎస్ నేతలు బొగ్గు గనుల వేలంపై సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం
– సింగరేణిపై టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఫైర్
ఈ రోజు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ సింగరేణి విషయంలో మంత్రి కేటీఆర్ కు ప్రధాని లేఖ రాయడంపై మండిపడ్డారు. ఈ విషయంలో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై ధీటుగా స్పందించారు. కుమార్ మాట్లాడిన వ్యాఖ్యల్లోని ముఖ్యాంశాలు..
రాజ్యాంగాన్ని తిరగరాస్తానంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం కావడంతో వాటిని దారి మళ్లించేందుకు టీఆర్ఎస్ నేతలు సింగరేణి పై రాజకీయం చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. సింగరేణిలో ఒక్క ఓపెన్ కాస్ట్ ను కూడా రానీయ్యబోమని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏకంగా 17 ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతి ఇచ్చి మాట తప్పిండు.
అధికారంలోకి వచ్చాక సింగరేణి మొత్తాన్ని ఆర్దికంగా దివాళా తీయిస్తున్నరు. సంస్థకు చెందిన నిధులను దారి మళ్లించి రూ.20 వేల కోట్ల బకాయి పడ్డ మాట వాస్తవం కాదా? లాభాల్లో ఉన్న సంస్థను దివాళా తీయించి జీతాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే స్థితికి సింగరేణిని చేర్చిన విషయం నిజం కాదా?
టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సంస్థలో 62 వేల మంది కార్మికులుంటే… అందులో 22 వేల ఉద్యోగాలను కోత విధించి…. కేవలం 40 వేల మంది కార్మికులకే పరిమితం చేసింది వాస్తవం కాదా? యూపీఏ-2 హయాంలో 218 బ్లాక్ లను అప్పనంగా తనకు నచ్చిన సంస్థలకు రాసిస్తుంటే… సుప్రీంకోర్టు తప్పు పడుతూ వాటిని రద్దు చేసిన మాట నిజం కాదా?
సుప్రీంకోర్టు తీర్పు మేరకు బొగ్గు గనుల వేలంపై 2015లో పార్లమెంట్ యాక్ట్ చేసిన సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు మద్దతిచ్చిన మాట నిజం కాదా? నాడు కేసీఆర్ కూతురు కవిత ఎంపీగా ఉంటూ ఎన్డీఏకు మద్దుతిచ్చిన విషయం మరిచిపోయారా? ఇతర రాష్ట్రాల్లో ఉన్న గనులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు కేంద్రం కేటాయిస్తున్న సమయంలో ఏనాడూ సింగరేణి బ్లాకులను కేటాయించాలని సీఎం కేసీఆర్ ఎందుకు కోరలేదో సమాధానం చెప్పగలరా? ఆనాడు సోయి లేకుండా ఉండి… ఇప్పుడు బీజేపీపై బురదచల్లడం సిగ్గుచేటు.
ఏఎమ్మార్ పేరిట తాడిచర్ల బొగ్గు గనులు అధికార పార్టీలో ఉన్న నేత బినామీ పేర్లతో కాంట్రాక్ట్ తీసుకున్న విషయం వాస్తవం కాదా? మైన్స్ యాక్ట్ ప్రకారం… ప్రైవేటు వ్యక్తులతో గనులను తవ్వించరాదని నిబంధలున్నా…. అందుకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చివరకు సింగరేణి కార్మికులకు సంబంధించి సీఎస్సార్, డీఎమ్మార్ ఫండ్ ను స్థానికంగానే ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ అందుకు భిన్నంగా సిద్దిపేటకు, ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో 30 శాతం మాత్రమే ఇతర ప్రాంతాలకు ఖర్చు చేసేందుకు కేంద్రం అనుమతిస్తే… అందుకు భిన్నంగా రూ.500 కోట్లు డ్రా చేసి నిబంధనలకు కేసీఆర్ ప్రభుత్వం తూట్లు పొడిచింది.
బొగ్గు గనుల వేలం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ. గతంలో ఒరిస్సాలోని 9 బ్లాకులను తెలంగాణ తీసుకుంది. అందులో భాగంగానే నేడు సింగరేణిలోనూ 4 బ్లాక్ లు వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్లు వేసి కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ టీఆర్ఎస్ నేతలు ఈ అంశాన్ని తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపెట్టడం సిగ్గు చేటు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైంది. వైఎస్, రోశయ్య, చంద్రబాబు హయాంలో ఏనాడూ సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం లేదు. కేసీఆర్ హయాంలో మాత్రం అందుకు భిన్నంగా రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి.
•సింగరేణి విషయంలో కేసీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం చిత్తుశుద్ధి ఉన్నా తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలి. టీఆర్ఎస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సింగరేణి లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలి. సింగరేణిలో మరో 150 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వున్నాయి. వాస్తవానికి దేశంలో డిమాండ్ కు తగ్గ బొగ్గు ఉత్పత్తి చేయం లేదు. లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తూ ఇంకా బొగ్గు దిగుమతి చేసుకుంటున్నం. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు పార్లమెంట్ లో బొగ్గు గనుల బ్లాకులను వేలం వేస్తూ చట్టం తెచ్చారు.
సింగరేణిలో బ్లాకుల కేటాయింపుపై ఏనాడూ నోరు మెదపని కేసీఆర్ ఈనాడు బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. త్వరలో సింగరేణి ఎన్నికలు రాబోతుండటంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి గెలవాలని ప్రధానికి లేఖల పేరుతో టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారు. సింగరేణి కార్మికులకు టీఆర్ఎస్ నేతల భాగోతం తెలిసిపోయింది. ఇక టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఇచ్చిన హామీ మేరకు సింగరేణిలో అండర్ మైనింగ్ కు అనుమతి ఇవ్వాలి. సింగరేణి బకాయిలను తక్షణమే చెల్లించడంతోపాటు గతంలో మాదిరిగా 62 వేల మంది కార్మికులుండే నియామకాలు చేపట్టాలి. కార్మికులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సింగరేణి ప్రయోజనాల విషయంలో బండి సంజయ్, కిషన్ రెడ్డ్ ఆధ్వర్యంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుంది.