Suryaa.co.in

Telangana

ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ

– మొదటినుంచి మహిళా వ్యతిరేకి కేసీఆర్
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్

గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ ఓటమి ఖాయం. అవినీతిలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కు దోస్తీ.తన అవినీతి ఎక్కడ బయట పడుతుందో అన్న భయంతోనే.. సిట్టింగులకు తిరిగి మళ్లీ కేసీఆర్ అవకాశం కల్పించారు.బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు ఎందుకు అత్యధిక సీట్లు కేటాయించలేదు? మొదటినుంచి మహిళా వ్యతిరేకి కేసీఆర్.

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కేసీఆర్ ఎందుకు పాటించడం లేదు?మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ బిజెపి నే. కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాతోనే… బీజేపీ గెలుపుకి మార్గం సుగమం అయింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బిజెపి దే.

LEAVE A RESPONSE