ఆదానీకి ఇచ్చిన భరోసా రైతాంగానికి ఎందుకు ఇవ్వరు ?
నినాదాలు రైతుల కడుపు నింపవు
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
అసోచామ్ (అసోసియెటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అఫ్ ఇండియా)
ఆధ్వర్యంలో నోవాటెల్ హెచ్ ఐ సీసీలో నిర్వహిస్తున్న 2023 చిరుధాన్యాల సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జయేష్ రంజన్ , ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్. రైతుకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడింది కేసీఆర్.నినాదాలు రైతుల కడుపు నింపవు.ఎనిమిదేళ్లలో రూ.4.50 లక్షల కోట్లు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.లోకమున్నంత వరకు మానవాళికి అవసరమైన ఆహారం భూమి నుండే వస్తుంది .. దానిని రైతే పండించాలి. ఆ రైతును గుర్తించిన పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్.
రేపటి భవిష్యత్ తరాలకు ప్రపంచానికి అవసరమైన ఆహారం తెలంగాణ ఇవ్వగలదని బలంగా నమ్ముతున్నాం అందుకే ఈ రంగం మీద దృష్టిసారించి రైతులకు అండగా నిలుస్తున్నాం.పంటల వైవిధ్యీకరణ, పంటల సాగు ప్రణాళిక, పంటల కొనుగోలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. మనిషి ఏది లేకున్నా బతకగలడు .. కానీ ఆహారం లేకుండా ఉండలేరు.గ్రామ గ్రామానికి విస్తరించిన బీఎస్ఎన్ఎల్ ను నిర్వీర్యం చేసి జియో కంపెనీకి జవసత్వాలు కల్పించి వంద కోట్ల మంది చేతిలో సెల్ ఫోన్లు పెట్టి వాడక తప్పనిసరి పరిస్థితి తీసుకువచ్చారు.మరి మీరు పంటలు పండించండి మేము ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం అని రైతులకు ఎందుకు భరోసా ఇవ్వరు ?
ఆదానీకి ఇచ్చిన భరోసా రైతాంగానికి ఎందుకు ఇవ్వరు ?మీరు పండించండి కేంద్ర ప్రభుత్వంగా మేము సాయం అందిస్తాం .. రాష్ట్రంగా మీరు కొంత సాయం చేయండి అని కేంద్రం ఎందుకు చెప్పదు ?స్కాట్లాండ్ లాంటి చిన్న దేశం తమ ఉత్పత్తులు ప్రపంచంలో మార్కెటింగ్ చేసుకుంటున్నది.140 కోట్ల మందిని పాలిస్తున్న పాలకులకు ఎందుకు ఆలోచన ఉండదు ?మార్కెటింగ్ సమస్యలే రైతాంగం నష్టాలకు ప్రధాన కారణం .. మన రైతుల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేయాలని ఎందుకు ఆలోచించరు? మనుషులు తీసుకునే ఆహారం యొక్క అలవాట్ల తీరు మారుతూ వస్తున్నది.వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ద్వారా ఆ ప్రాసెస్డ్ ఆహారం అందించగలగాలి.పల్లీలు, చిరుధాన్యాలు, చిక్కీల వంటి పదార్థాలు తయారుచేసి దేశంలోని విద్యార్థులకు అందించగలిగితే దేశంలో ఎంత ఆరోగ్యవంతమయిన సమాజం నిర్మాణమవుతుంది.సమశీతోష్ణ మండలాలలోనే చిరుధాన్యాల ఉత్పత్తికి అనుకూలం.
తెలంగాణ ప్రాంతం చిరుధాన్యాల సాగుకు అత్యంత అనుకూలం.ఇక్రిశాట్ ఇక్కడ ఏర్పడింది ఇక్కడి వాతావరణ పరిస్థితుల మూలంగానే.మానవులు, అధిక మొత్తం జీవాలు భుజించే అత్యధిక శాతం ఉత్పత్తులు చిరుధాన్యాలే.సంచార వ్యవసాయం నుండి స్థిర వ్యవసాయం ఏర్పడి పదివేల ఏళ్లయింది. విష్ణు కుండినులు, కాకతీయుల కాలం నుండే నీటిని నిల్వచేసి వాటి ద్వారా పంటలు పండించే సాంప్రదాయం మొదలయింది.ఒక నాడు జొన్న, సజ్జ, రాగి, రొట్టెలతో పాటు వరి తెలంగాణలో ప్రధాన ఆహారం. … భక్ష్యాలు వంటి ప్రత్యేక వంటకాలకు మాత్రమే గోధుమ పిండి వినియోగించేది.ఉత్తర భారతదేశంలో గోధుమల వినియోగం ఎక్కువ .. వరి వినియోగం తక్కువ.
వెనకటి ప్రజల ప్రధాన జీవన ఆధారం వ్యవసాయం.పనిచేసే వారికి చిరుధాన్యాల వంటకాలే ప్రధాన ఆహారం .. వారు అన్నం తింటే పనిచేయడానికి శక్తి సరిపోయేది కాదు. చిరు ధాన్యాల ఆమారం బలమెక్కువ.వేరుశెనగ, జొన్న, సజ్జ, రాగి వంటి పంటల ఉప ఉత్పత్తులను తయారుచేసి మార్కెటింగ్ పెంచాలి. పేదరికం లేని, ఆకలి లేని సమాజాన్ని తయారుచేయడమే నిజమైన దేశభక్తి.అన్నిరకాల వనరులు, శక్తి ఉన్న భారత్ ప్రపంచం మీద ఎందుకు ఆధారపడుతుంది .. ప్రపంచమే భారత్ మీద ఆధారపడాలి కదా !చిరుధాన్యాల విస్తృత వినియోగానికి ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు సమన్వయంతో పనిచేయాలి.
అసోచామ్ (అసోసియెటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అఫ్ ఇండియా)
ఆధ్వర్యంలో నోవాటెల్ హెచ్ ఐ సీసీలో నిర్వహిస్తున్న 2023 చిరుధాన్యాల సదస్సులో (Future Super Food For The World) , పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జయేష్ రంజన్ గారు, ఎస్బీఐ సీజీఎం అమిత్ జింగ్రాన్ , అసోచామ్ తెలంగాణ కౌన్సిల్ చైర్మన్ కటారు రవికుమార్ రెడ్డి , న్యూట్రిహబ్ సీఈఓ డాక్టర్ దయాకర్ రావు, ఐపీపీ సీఈఓ డాక్టర్ రంగయ్య , అసోచామ్ అడిషనల్ డైరెక్టర్ మచ్చ దినేష్ బాబు పాల్గొన్నారు.