మన మోదీ గ్యారంటీ..మరోసారి మన మోదీ సర్కార్

– బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ..మరోసారి మన మోదీ సర్కార్ పోస్టర్ ను ఆవిష్కరణ
– వచ్చే ఎన్నికల కోసం రూపొందించే మేనిఫెస్టోలోనూ.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. వారందరి ఆలోచనల మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అభిప్రాయ సేకరణ కోసం రూపొందించిన వికసిత్ భారత్ సంకల్ప పత్రం ను ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

భారతీయ జనతా పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా వచ్చే 5 సంవత్సరాలకు గాను ఒక ఎజెండాను రూపొందించుకొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ స్వతత్రంగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయేకు 400 సీట్లను చేరుకోవడమే లక్ష్యం. తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది.

భారతదేశం ఇవాళ సాధిస్తున్న ప్రగతికి, మారుమూల ప్రాంతాల వరకు సంక్షేమపథకాలు చేరుతున్న తీరుతో.. బీజేపీ జెండాను చూడగానే ప్రజలే స్వచ్ఛందంగా.. ‘ఇదే మన మోదీ గ్యారంటీ’ అని చెబుతున్నారు. 5 విభాగాలుగా విజయసంకల్ప యాత్ర కొనసాగుతోంది. కొమురంభీమ్ క్లస్టర్, శ్రీ రాజరాజేశ్వర క్లస్టర్, భాగ్యలక్ష్మి క్లస్టర్, కాకతీయ-భద్రకాళి క్లస్టర్, కృష్ణమ్మ క్లస్టర్ల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విజయసంకల్ప యాత్రలు జరుగుతున్నాయి.

జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, అనేక మంది నాయకులు యాత్రలో పాల్గొన్నారు. ఈ విజయ సంకల్ప యాత్రకు అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విప్లవాత్మక నిర్ణయాలు, సాధించిన ప్రగతిని ప్రజల ముందు వివరిస్తున్నాం. రెట్టింపు ఉత్సాహంతో యాత్రను నిర్వహిస్తున్నాం. వికసిత్ భారత్ కోసం ప్రజల సలహాల కోసం అభిప్రాయాలు సేకరించాం.

రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్న తీసుకొని 2047లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా, విశ్వగురు స్థానంలో నిలిపేలా కృషిచేయాలి. అవినీతి రహిత ప్రభుత్వం, నిస్వార్థంగా సేవ చేసే నాయకత్వం, అన్ని రంగాల్లో విద్య, వైద్యం సౌకర్యాలను మెరుగుపర్చాలి. ఉపాధి అందరికీ అందుబాటులో ఉండాలి. 2047లో విద్య, ఉపాధి, పెట్టుబడుల కోసం ప్రపంచంలో భారతదేశం మార్క్ గా నిలవాలి.
•భారతీయ జనతా పార్టీ ‘GYAN’ అనే అజెండాతో ముందుకెళ్తోంది.
• G – గరీబ్ కల్యాణ్ – పేదల సంక్షేమం
• Y – యువత
• A – అగ్రికల్చర్ – వ్యవసాయం
• N – నారీ శక్తి

ఈ వర్గాలకు సంపూర్ణ సాధికారత కల్పిస్తూ.. వీరిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేస్తున్నాం. రానున్న ఐదు సంవత్సరాల పాటు ‘GYAN’ అనే అజెండాతో ముందుకెళ్తాం. ఈ సందర్భంగా రెండు రకాల మేనిఫెస్టోలు రూపొందిస్తాం. 2047 సంవత్సరానికి గాను భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం. రానున్న ఐదేళ్ల పాటు పేదలు, యువత, వ్యవసాయం, మహిళలను సాధికారత కల్పిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయడం.

పదేళ్లుగా.. ప్రజల నుంచి వివిధ మార్గాల్లో సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి.. వాటి ఆధారంగా పథకాలను రూపొందించి.. ప్రధాని మోదీ ప్రజాసేవ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యతను కల్పిస్తూ దేశాభివృద్ధిలో పెద్దపీట వేస్తూ.. ‘సబ్ కా సాథ్, సబ్ కా •వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ నినాదాన్ని కార్యరూపంలో చూపిస్తున్నారు. అదే స్ఫూర్తితో.. వచ్చే ఎన్నికలకోసం రూపొందించే మేనిఫెస్టోలోనూ.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. వారందరి ఆలోచనల మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా.. మా పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో – సంకల్ప్ పత్ర కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం.

ఈ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలకు సంబంధించి వివిధ వర్గాలు, భిన్న రంగాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేలా ‘వికసిత్ భారత్ మోదీ కీ గ్యారంటీ’ (అభివృద్ధి చెందిన భారతానికి మన మోదీ గ్యారంటీ) అనే పేరుతో ప్రజాభిప్రాయ సేకరణకు కార్యక్రమాన్ని రూపొందించాం. అందుకే ప్రజలు కూడా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారిని ప్రజలు తమ మనిషిగా భావిస్తున్నారు.

అదే స్ఫూర్తితో.. వచ్చే పార్లమెంటు ఎన్నికలకోసం రూపొందించే మేనిఫెస్టోలోనూ.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని.. వారందరి ఆలోచనల మేరకు దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా.. ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో – సంకల్ప్ పత్రం కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాం.

వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను తీసుకుని.. నేరుగా మోదీ గారికి తెలియజేసేలా ఏర్పాట్లు చేశాం. నేరుగా ప్రజలతో..వివిధ గ్రూపుల సమావేశాలు, (మిలన్ & సంవాద్) ఇంటింటికీ వెళ్లడం, (డోర్ టు డోర్)
• వివిధ ప్రోగ్రామ్ సెల్స్
• పార్టీ నిర్వహించే వివిధ కార్యక్రమాలు,
• డిజిటల్ మాధ్యమం
• నమో యాప్.
• మిస్ కాల్ నెంబరు (90-90-90-20-24)

సోషల్ మీడియా (వాట్సాప్) ద్వారా.. ప్రచార, ప్రసార (ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా) మాధ్యమాల ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తాం.అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో సూచనల పెట్టె (సజెషన్ బాక్స్) ఏర్పాటు ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించబోతున్నాం. వివిధ గ్రూపులతో సమావేశాలకు సంబంధించి.. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో మార్చి 15 వరకు జరిగే ఈ కార్యక్రమం చేపడుతాం. ఆ తర్వాత ఆయా వర్గాల అభిప్రాయాలను ఢిల్లీలోని ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీకి చేరవేస్తాం.

ఆశా, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాలు, రైతులు, సహకార సంఘాలు, కార్మికులు, జాతీయ అవార్డుల విజేతలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, కళాకారులు ట్రేడర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని రకాల చేతి వృత్తుల కళాకారులు, సఫాయీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అన్ని రకాల ప్రార్థనా మందిరాల్లో పనిచేసే పూజారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, దళిత సంఘాల నాయకులు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు.. ఇలా అన్ని వర్గాలతోనూ ఇంటింటికి వెళ్లి సమావేశమై అభిప్రాయాలు తీసుకుంటాం.

మీడియా మిత్రులు రాజకీయాలకు అతీతంగా, దేశం కోసం సలహాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఇంటింటికీ వెళ్లి.. ప్రభుత్వ పథకాలను చెబుతూనే.. వారి సలహాలు స్వీకరిస్తాం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి వివిధ మోర్చాలకు సంబంధించిన వారితో అభిప్రాయాలు తీసుకుంటాం. మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలుండాలో వారిని అడిగి తెలుసుకుంటాం.

వచ్చే ఎన్నికల్లో ఫిర్ ఏక్ బార్ .. మోదీ సర్కార్ నినాదంతో ముందుకెళ్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజలతో స్థాపించబడింది. ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలతో నడిచే పార్టీ. పార్టీ కోసం ప్రజల శక్తికి తగ్గట్లుగా ఆర్థిక సాయం చేయాలని అన్ని వర్గాల ప్రజలను కోరుతున్నాం. డిజిటల్ యాప్ .. (నమో యాప్) ద్వారా మాత్రమే పార్టీకి ఆర్థిక సహాయం చేయాలి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మార్చి 4, 5 తేదీలలో తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం రూ.15,718 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. 5వ తేదీన ఉదయం బేగంపేట విమానాశ్రయంలో రూ.400 కోట్లతో ఏర్పాటు చేసిన పౌర విమానయాన పరిశోధన సంస్థ (కారో)ను ప్రారంభిస్తారు.

అలాగే, పలు హైవేల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.సంగారెడ్డి లో రూ. 9, 021 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. మూడవ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు… రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల ప్రాజెక్టును ఇప్పటికే ప్రధాని ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ ప్లాంటులో నిర్మించిన 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రంలోని రెండో యూనిట్ ను 4వ తేదీన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

రూ.3,339 కోట్లతో ఏర్పాటు చేసిన పారాదీప్– హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ను.. రూ.1,165 కోట్లతో హైదరాబాద్, సికింద్రాబాద్లలో 103 కిలోమీటర్ల మేర చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్ 2ను ప్రారంభిస్తారు.ఘట్ కేసర్-లింగంపల్లి మధ్యన కొత్త రైలును ప్రారంభిస్తారు. తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని విధాలు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి అన్ని వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరుతున్నాం.

డిజిటల్ మాధ్యమం ద్వారా పార్టీకి ఆర్థిక సహాయం చేయాలని ప్రజలందినీ కోరుతున్నాం.దేశ సంక్షేమం కోసం, నీతివంతమైన పాలన కోసం అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో చాలాకాలంగా రక్షణశాఖ భూముల బదిలీ విషయంలో నెలకొన్న సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది. దాదాపు 6.9లక్షల చదరపు మీటర్ల (దాదాపు 170 సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో చాలాకాలంగా రక్షణశాఖ భూముల బదిలీ విషయంలో నెలకొన్న సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది.

హెచ్ఎండీఏలోని.. కంటోన్మెంట్ పరిధిలోకి వచ్చే ఏరియాలో.. జాతీయ రహదారి-44 (కామారెడ్డి మార్గంలో, రాష్ట్ర రహదారి-1 (సిద్దిపేట మార్గంలో) విస్తరణ, అభివృద్ధికోసం ఎలివేటెడ్ కారిడార్, టన్నెల్స్ నిర్మాణానికి సంబంధించి.. దాదాపు 6.9లక్షల చదరపు మీటర్ల (దాదాపు 170 ఎకరాలు) రక్షణశాఖ భూములను.. హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ)కు బదిలీ చేస్తున్నట్లు (మార్చి 1న) స్పష్టం చేసింది.

రాష్ట్రపతి ఆదేశాల మేరకు భూ బదలాయింపునకు సిద్ధమని తెలియజేస్తూ.. ఓ లేఖను రక్షణ శాఖ విడుదల చేసింది.ప్రజల అవసరాలను, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు చొరవతీసుకుని ఈ భూమి బదలాయింపునకు అనుమతులు జారీ చేసినందుకు గాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

ఈరోజు విజయసంకల్ప యాత్ర చివరిరోజు. అంబర్ పేటలో జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని ప్రజలందరినీ కోరుతున్నాం. మార్చ్ 2 నుంచి 5 వరకు.. పీపుల్స్ ప్లాజా, హైదారాబాద్ వేదికగా జాతీయ సంస్కృతీ మహోత్సవాలు జరగనున్నాయి.

అదేవిధంగా రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవం చివరిరోజు (మార్చ్ 5వ తేదీ).. భారత సాంస్కృతిక వైవిధ్యతను తెలియజేసేలా ఆయా ప్రాంతాల చీరకట్టుతో నేతన్నల నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటేలా కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ‘శారీ వాకథాన్’ కార్యక్రమంలో మహిళలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోకుతున్నాను. పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ వేదిక గా జరగనున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం.

Leave a Reply