కేసీఆర్ కిట్, కంటి వెలుగు దేశానికే ఆదర్శం

Spread the love

– ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గం అమీర్ పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాలులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతిలు పాల్గొన్నారు.

ఖమ్మంలో ఘనంగా కంటి వెలుగు ప్రారంభమైందని అన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. “రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలు టెస్ట్‌లు చేస్తాయి. అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తాం. ప్రతి ఒక్కరి దగ్గరికి మా బృందాలు వెళ్తాయి.రాష్ట్ర వ్యాప్తంగా 16533 కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు నిర్వహించనున్నాం. గ్రేటడ్ కమ్యూనిటీ,అపార్ట్మెంట్ వాళ్ళు కావాలంటే జీహెచ్ ఎంసీ కి ట్విట్టర్, వెబ్ సైట్ లో రిక్వెస్ట్ పెడితే మీ దగ్గరికి కంటి వెలుగు బృందాలు వస్తాయి.ఒక్కో బృందం లో 8 మంది సిబ్బంది వుంటారు. రోజు ఒక్కో బృందం 120 నుంచి 130 మందికి పరీక్షలు చేస్తాయి.

నివారించదగిన అంధత్వ సమస్యలు నిర్ములించాలన్నదే మా లక్ష్యం. 2018 మొదటి విడత కార్యక్రమం 8 నెలలో పూర్తి చేశాం. ఈసారి తెలంగాణలో తయారైన కళ్లద్దాలు పంపిణీ చేయనున్నాం. 20 లక్షల కళ్ళజోళ్ళు పంపిణీ చేసే అవకాశముంది. ప్రెస్ క్లబ్ లో కూడా కంటి వెలుగు కార్యక్రమం పెడతాం జర్నలిస్ట్ లు, వారి కుటుంబాలకు టెస్ట్ లు. చేస్తాం. స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా అంత కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కంటి వెలుగును అభినందించారు. ఈ కార్యకమాన్ని తమ ప్రాంతల్లోనూ అమలు చేస్తామన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసిందే దేశం అనుసరించేది… ఇప్పుడు తెలంగాణను అనుసరిస్తుంది.కల్యాణ లక్ష్మీ, ప్రభుత్వ మెడికల్ కాలేజి, రైతు బంధు, కేసీఆర్ కిట్ ఇలాంటివి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి” అని చెప్పారు.

Leave a Reply