Suryaa.co.in

Telangana

ఇన్నోవేషన్ ఏదైనా సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలనేది కేసీఆర్ ఆలోచన

-ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన యంగ్ మినిస్టర్ కేటీఆర్
-కేసీఆర్ నాయకత్వంలో 8 ఏళ్ళలోనే ఐటి ఎగుమతుల్లో -తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగింది
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: జేఎన్టీయూ లో జరిగిన “ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ2022” కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటి , పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్,రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…. ఇన్నోవేషన్ ఏదైనా సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన,తరచూ ఆయన ఆ అంశాన్ని ప్రస్తావిస్తారని,యువత కూడా తమ ఇన్నోవేషన్ ఐడియాల్లో అది పరిగణలోకి తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన యంగ్ మినిస్టర్ కెటిఆర్ అని మంత్రి వేముల కొనియాడారు.

కెటిఆర్ నాయకత్వంలో 8 ఏళ్ళలోనే ఐటి ఎగుమతుల్లో ఐదు రెట్లు పెరిగి తెలంగాణ నెంబర్ వన్ గా ఎదిగిందన్నారు. ఐటి లో 2 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 6 లక్షల ఉద్యోగాలు పెరిగాయని తెలిపారు. విదేశాల కంపెనీలను ఒప్పించి వేల కొత్త పరిశ్రమలు తెలంగాణకు తీసుకువచ్చారని అన్నారు. కొత్తగా 16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని గుర్తు చేశారు. కెటిఆర్ తీసుకువచ్చే టి-వర్క్స్ అనే కొత్త సంస్కరణ ద్వారా మెకానికల్ ఇంజనీరింగ్ వారికి ఎంతో ఉపయోగం కానుందని తెలిపారు.

LEAVE A RESPONSE