ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనేది ఆయన కోరిక
క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ది కి ప్రభుత్వం కృషి చేస్తోంది
బాల్కొండ నియోజకవర్గంలోని క్రిస్టియన్లు నాపై చూపే ప్రేమ మరువలేనిది
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కొరా ఏఎన్జి ఫంక్షన్ హాల్లో జరిగిన బాల్కొండ నియోజకవర్గంలోని క్రిస్టియన్ మైనారిటీ చర్చ్ ల అభివృద్ధి కొరకు మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఆయా చర్చ్ కమిటీ ల సభ్యులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సుమారు 40 చర్చిలకు 2.75 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. కులాలకు,మతాలకు, వర్గాలకు అతీతంగా ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలనేది కేసిఆర్ ధ్యేయమని,ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనేది ఆయన కోరిక అన్నారు. క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ది కి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని క్రిస్టియన్లు తనపై చూపే ప్రేమ మరువలేనిదన్నారు.
గతంలో చర్చ్ ల అభివృద్ది కోసం 1.50 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు మళ్లీ సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి 2.75 కోట్ల రూపాయలతో చర్చిల అభివృద్ధి చేసుకోవడానికి నిధులు మంజూరు చేసుకున్నామని తెలిపారు. క్రైస్తవ మతం విశ్వాసానికి,త్యాగానికి,ప్రేమకు ప్రతీక అని అన్నారు.
ఏ మతం కూడా ఒకరిని ఇబ్బంది పెట్టాలని చూడదని ఇతరుల మంచి కోరుకుని వీలైతే సహాయం చేయాలని చెప్తుందని అన్నారు. అందుకే అందరినీ గౌరవిస్తూ సమానంగా నియోజకవర్గంలోని గుడులు,మసీదులు,చర్చిలకు నిధులు మంజూరు చేసి అభివృద్ది చేస్తున్నామని అన్నారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన క్రిస్టియన్ సోదర,సోదరీమణులకు,దైవజనులకు మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి సుమారు 2వేల మంది క్రిస్టియన్లు హాజరయ్యారు. తమకు మంచి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటామని నినదించారు. రానున్న ఎన్నికల్లో విజయం ఖాయమని ఆయన విజయం కోసం ముక్త కంఠంతో అందరూ ప్రార్థించి ఆశీస్సులు అందించారు. వేలాది మంది క్రిస్టియన్లు తరలివచ్చి తనపై చూపుతున్న ప్రేమకు వేముల మంత్రముగ్దులయ్యారు. తన తల్లి ఆరోగ్యం మెరుగుపడాలని అక్కడికి వచ్చిన వారందరూ ప్రార్థించడంతో వారు చూపిన అభిమానానికి మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయా గ్రామాల సంఘాలకు ప్రొసీడింగ్స్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు,తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మధుశేఖర్ ,కోటపాటి నరసింహ నాయుడు,హైదరాబాద్ నుండి వచ్చిన దైవ జనులు మోహన్ బాబు,జోనాథన్ గారు,నియోజకవర్గ సీనియర్ ఫాస్టర్ షడ్రక్ గారు,ఆనంద పాల్ మరియు అన్ని చర్చ్ ల ఫాస్టర్ లు పాల్గొన్నారు.
క్షతగాత్రులకు బాసటగా నిలిచి మరోసారి తన మానవత్వం చాటుకున్న మంత్రి వేముల
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వస్తుండగా మేడ్చల్ నుండి కొంపల్లి రూట్లో చిన్నారి తో కలిసి బైక్ పై వస్తున్న జంట బైక్ స్కిడ్ ఐ కింద పడడం చూసి వెంటనే తన కాన్వాయ్ ఆపి వారి వద్దకు వెళ్ళి యోగ క్షేమాలు అడిగారు. చిన్నారిని గట్టిగా పట్టు కోవడంతో బైక్ పై నుండి పట్టుతప్పి పడి మహిళకు స్వల్ప గాయాలయ్యాయని గమనించిన మంత్రి వెంటనే వారిని దగ్గరుండి తన ఎస్కార్ట్ వాహనం ఎక్కించి బాధితులను హాస్పిటల్ పంపించారు. వారికి మంత్రి మనోధైర్యం చెప్పారు. తమ కోసం మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి వేములకు బాధితులు చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.