కూర్చోవాలి.. ఒక్క క్షణం అన్న ఆశ.. కోట్ల మంది ఆడబిడ్డలు ఈ ఆశ నెరవేరాలని కాళ్ళ నొప్పులు కళ్ల లో నింపుకొని ఆశ గా, దీనం గా ఎదురు చూశారు.
అసంఘిటిత వ్యాపార రంగంలో.. ముఖ్యం గా వస్త్ర వ్యాపార, షాపింగ్ మాల్స్ ల లో 5 కోట్ల మంది ఆడవారు పనిచేస్తున్నారు. మనిషి కూర్చుంటే సుఖమ్ మరిగి పనిచేయదు, కూర్చునే వీలు లేకుంటేనే పనిమనిషి గా ఉండగలరు అనేది మృగ వ్యాపార సూత్రం – కార్పొరేట్ వ్యాపార మాఫియా ది. ఈ దారుణం మౌనం గా భరించిన కేరళ తల్లులు ” right to sit ” అంటూ 2018 లో ఉద్యమం చేశారు.
2019 లో వీరి కృషి ఫలించి కేరళ ఎస్టాబ్లిష్ యాక్ట్ ను ప్రభుత్వం సవరించి అందరూ కూర్చొనే ఏర్పాట్లు చేసింది. ఆ తరువాత తమిళనాడు రాష్ట్రం లో కూడా ఇలానే చేశారు. కానీ మిగిలిన రాష్ట్రం ల లో మహిళా హక్కులు నాయకులు మౌనంగా వుండి మన ఆడ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు.
నెలసరి నొప్పి తో కూడా రోజు కూలీ పోతుంది అన్న భయం తో అలానే నిలబడి బాధ పడే మన ఆడవాళ్ళ బాధలు గుర్తించాలి. వారికి వాష్ రూమ్, కాసేపు కూర్చొనే హక్కులు కల్పించాలి.
ఇటువంటి విషయాల్లో సోషల్ మీడియా యాక్టీవ్ అయి మన ఆడబిడ్డ లకు న్యాయం చేయాలి
– సోమేపల్లి శ్రీనివాస్