– హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ వెడల్పు పనులను అనుకున్న వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి
– వెడల్పు పనుల పూర్తితో 1,450 క్యూసెక్కుల నుంచి 3,400 క్యూసెక్కులకు పెరగనున్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నీటి ప్రవాహం సామర్థ్యం
– జిల్లాలో మొదటి ఫేజ్ ప్యాకేజీ-2 పనులు పూర్తి
– ఫలించిన మంత్రి పయ్యావుల కేశవ్ కృషి
– ఉరవకొండ నియోజకవర్గంలోని రాగులపాడు లిఫ్ట్ కు చేరుకున్న కృష్ణా జలాలు.. అక్కడి నుంచి నేడు ఉదయం జలాలు విడుదల
– మూడు పంపుల ద్వారా 850 క్యూసెక్కుల నీరు విడుదల
– కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన హెచ్ఎన్ఎస్ఎస్ రైతులు, నాయకులు, అధికారులు
అనంతపురం : రాష్ట్ర ఆర్థిక – ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అనుకున్నది సాధించి చూపించారు. తాము అధికారంలోకి వస్తే హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను చేపడతామని మాట ఇచ్చి.. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాలువ వెడల్పు పనులను మొదలుపెట్టించారు.
ఆ తర్వాత పనులను ఈ సీజన్లోనే ఎన్నడూలేని విధంగా కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పి.. ఇరిగేషన్, రెవెన్యూ, ఏపిఎస్ఈబి, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ వాయువేగంతో పనులు పూర్తి చేసేలా మంత్రి పయ్యావుల కేశవ్ అనునిత్యం దృష్టి సారించారు.
ఇప్పటికే హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ సీజన్లో కాలువలో నీరు ప్రవహించే సమయానికల్లా మేజర్ పనులను పూర్తి చేయడంతో నీరుపారేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పోయింది. ఈ సీజన్లోనే కాలువలో 3,450 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించగా, అందుకు అనుగుణంగా హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు కూడా కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని వేగవంతంగా వెడల్పు పనులను పూర్తి చేశారు.
గతంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో 1,300 నుంచి 1,400 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తుండగా, వెడల్పు పనులు పూర్తి కావడంతో 3,200 నుంచి 3,450 క్యూసెక్కుల నీరు కాలువలో ప్రవహించే అవకాశం ఉందని హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజా స్వరూప్ కుమార్ తెలిపారు.
మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలతో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుని, జిల్లాలో మొదటి ఫేజ్ ప్యాకేజీ-2 పనులు పూర్తి పనులను పూర్తి చేయడం జరిగిందని ఎస్ఈ తెలిపారు. వీటితోపాటు తూములు ద్వారా చెరువులకు నీరు ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఈనెల 17వతేదీన నంద్యాల జిల్లా మాల్యాల పంపుహౌస్ వద్ద కృష్ణా నీటి ఎత్తిపోతలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీరు అనంతపురం జిల్లా సరిహద్దుల్లోకి మంగళవారం చేరగా, అదేరోజు సాయంత్రం ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయపురం గ్రామం వద్ద నీరు నియోజకవర్గంలోకి ప్రవేశించడం జరిగింది.
వజ్రకరూరు మండలంలోని ఛాయాపురం గ్రామం వద్దనున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలో వెడల్పు పనులను ఈ ఏడాది మే 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించి ఈ సీజన్లోనే వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి సారించి పనులపై నిత్యం తాను ఎక్కడ ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులపై సమీక్ష నిర్వహిస్తూ నీరు వచ్చేలోపే పనులు పూర్తి చేయాలని చెబుతూ అధికారులతో, సంబంధిత కాంట్రాక్టర్లతో పనులు చేయించారు.
జూలై నెలలోనే వర్షాలు వచ్చే సమయానికల్లా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను పూర్తి చేయడంపై అధికారులు కూడా దృష్టి సారించి జిల్లాలో మొదటి ఫేజ్ ప్యాకేజీ-2 పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయించారు. దీంతో కాలువలో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయాయి. మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారని ఉరవకొండ నియోజకవర్గ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బుధవారం వజ్రకరూరు మండలం రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మూడు మోటార్ల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటిని ఎత్తిపోతల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు, నాయకులు స్విచ్ ఆన్ చేసి 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అక్కడినుంచి ఉరవకొండ నియోజకవర్గం ద్వారా జీడిపల్లి జలాశయానికి చేరుకోనున్నాయి. జీడిపల్లి జలాశయం వద్ద 216.300 కిలోమీటర్ వద్ద ఇన్పాల్ రెగ్యులేటర్ వద్ద గురువారం నీటికి జలహారతి నిర్వహించడం జరుగుతుందని హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ తెలిపారు.